Renault summer service camp 2024: రెనో కార్లకు సమ్మర్ సర్వీస్ క్యాంప్; కస్టమర్లకు ఆఫర్స్, గిఫ్ట్స్ కూడా..-renault announces summer service camp 2024 check out all the offers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Renault Summer Service Camp 2024: రెనో కార్లకు సమ్మర్ సర్వీస్ క్యాంప్; కస్టమర్లకు ఆఫర్స్, గిఫ్ట్స్ కూడా..

Renault summer service camp 2024: రెనో కార్లకు సమ్మర్ సర్వీస్ క్యాంప్; కస్టమర్లకు ఆఫర్స్, గిఫ్ట్స్ కూడా..

HT Telugu Desk HT Telugu
May 11, 2024 09:14 PM IST

Renault summer service camp 2024: 2024 సంవత్సరానికి గానూ ప్రముఖ కార్ తయారీ సంస్థ రెనో.. తన లైనప్ లోని అన్ని కార్లకు సమ్మర్ సర్వీస్ క్యాంప్ ను ప్రకటించింది. ఈ క్యాంప్ లో ఉచితంగా కార్ టాప్ వాష్ తో పాటు కారు కంప్లీట్ చెకప్ ఉంటుంది.

మే 13 నుంచి రెనో సమ్మర్ సర్వీస్ క్యాంప్
మే 13 నుంచి రెనో సమ్మర్ సర్వీస్ క్యాంప్

Renault summer service camp 2024: రెనో ఇండియా తన సమ్మర్ సర్వీస్ క్యాంప్ 2024 ను ప్రకటించింది. ఈ రెనో సమ్మర్ సర్వీస్ క్యాంప్ 2024 మే 13 నుంచి మే 20, 2024 వరకు ఉంటుంది. రెనో లైనప్ లోని అన్ని కార్లకు ఈ సమ్మర్ క్యాంప్ లో పలు ఆఫర్స్ ఉన్నాయి. కార్ కంప్లీట్ చెకప్ తో పాటు టాప్ వాష్ ను కస్టమర్లు ఉచితంగా పొందవచ్చు. అలాగే, వివిధ సర్వీసులపై డిస్కౌంట్ లను పొందవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో క్విడ్, ట్రైబర్, కిగర్ అనే మూడు మోడళ్లను రెనో విక్రయిస్తోంది.

ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్..

2024 రెనో సమ్మర్ సర్వీస్ క్యాంప్ లో కార్ టాప్ వాష్ ను ఉచితంగా చేస్తారు. అలాగే, కారు అన్ని కీలకమైన భాగాలను నిశితంగా పరిశీలించి, సమగ్ర కారు చెకప్ స్టేట్మెంట్ ను అందిస్తుంది. సర్వీసింగ్ లో భాగంగా ఎంపిక చేసిన విడిభాగాలు, యాక్సెసరీలపై 15 శాతం డిస్కౌంట్, ఇంజిన్ ఆయిల్ రీప్లేస్మెంట్ పై 10 శాతం డిస్కౌంట్, లేబర్ ఛార్జీలపై 15 శాతం తగ్గింపు, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ పై ప్రత్యేక ఆఫర్లతో సహా బహుళ ప్రయోజనాలను ఈ క్యాంప్ లో కస్టమర్లు పొందవచ్చు. అంతేకాకుండా, రెనో ఎక్స్టెండెండ్ వారంటీపై 10 శాతం తగ్గింపు, రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ లపై 10 శాతం తగ్గింపును అందిస్తుంది. సమ్మర్ క్యాంప్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రెనో ఆటోమొబైల్ అధీకృత టచ్ పాయింట్లలో అందుబాటులో ఉంది. రెనో కు భారతదేశంలో 400 కి పైగా షో రూమ్స్, 430 కి పైగా సర్వీస్ అవుట్ లెట్స్ ఉన్నాయి.

ఫన్ యాక్టివిటీస్ కూడా..

ఈ సమ్మర్ సర్వీస్ క్యాంప్ లో తమ కారును సర్వీసింగ్ కు ఇచ్చిన కస్టమర్లకు కొన్ని బహుమతులను కూడా రెనో అందిస్తోంది. సర్వీసింగ్ కోసం వచ్చిన కస్టమర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఫన్ యాక్టివిటీస్ ను కూడా నిర్వహిస్తున్నారు. భారత్ లో అద్భుతంగా విజయం సాధించిన డస్టర్ ఎస్ యూ వీ అప్ డేటెట్, న్యూ జనరేషన్ మోడల్ ను ఇండియా మార్కెట్లోకి తీసుకురావాలని రెనో భావిస్తోంది. రెనో తో పాటు, స్కోడా ఆటో తదితర కార్ల తయారీ సంస్థలు తమ వినియోగదారుల కోసం సమ్మర్ సర్వీస్ క్యాంప్ లను ప్రకటించాయి.

WhatsApp channel