Reliance Tira : హైదరాబాద్​లోకి రిలయన్స్​ 'టీరా'.. ఈ స్టోర్​ ఎంతో ప్రత్యేకం!-reliances beauty platform tira launched in hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Reliance's Beauty Platform Tira Launched In Hyderabad

Reliance Tira : హైదరాబాద్​లోకి రిలయన్స్​ 'టీరా'.. ఈ స్టోర్​ ఎంతో ప్రత్యేకం!

Sharath Chitturi HT Telugu
Sep 29, 2023 01:00 PM IST

Reliance Tira in Hyderabad : రిలయన్స్​ టీరా స్టోర్​.. కొత్తగా హైదరాబాద్​లో ఓపెన్​ అయ్యింది. అసలేంటి ఈ టీరా? హైదరాబాద్​లో ఎక్కడ ఉంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రిలయన్స్​ టీరా..
రిలయన్స్​ టీరా..

Reliance Tira in Hyderabad : రిలయన్స్​​కు చెందిన బ్యూటీ రిటైల్ ప్లాట్​ఫామ్ ‘టీరా’ తన తొలి స్టోర్​ను హైదరాబాద్​లో ప్రారంభించింది. ఈ సంవత్సరం ప్రారంభించిన జియో వరల్డ్ డ్రైవ్, ఇన్ఫినిటీ మాల్ మలాడ్ వద్ద ముంబైలో తన స్టోర్లు విజయవంతం కావ‌డంతో.. ఈ బ్రాండ్ కొత్తగా హైదరాబాద్​కి కూడా విస్తరించింది. నగరంలో నిరంత‌రం సందడిగా ఉండే శరత్ సిటీ మాల్​లో ఈ స్టోర్​ మొదలైంది. బ్రాండ్ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. వైబ్రెంట్ సిటీ అయిన హైద‌రాబాద్‌కు ఉత్తమ సౌందర్య ఉత్పత్తులు, అనుభవాలను తీసుకురావాలనే లక్ష్యంతో ఈ స్టోర్ ఓపెన్​ అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు

టీరాతో సౌందర్యం మీ సొంతం..!

‘టీరా’ కొత్త త‌రం కస్టమర్ల కోసం అంత‌ర్జాతీయ, స్వదేశీ బ్యూటీ బ్రాండ్ల క‌ల‌యిక‌ను అందిస్తుంది. ఎలివేటెడ్ షాపింగ్ అనుభవాన్ని క‌స్ట‌మ‌ర్ల‌కు తీసుకొస్తుంది.

రిలయన్స్​ ‘టీరా’ స్టోరును సందర్శించినప్పుడు కస్టమర్లకు అనేక ఆహ్లాదకరమైన టచ్ పాయింట్లు కనిపిస్తాయి. ఇక్క‌డి వెండింగ్ మిష‌న్ అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇది ప్రతి కస్టమర్ త‌మ ఇంటికి తీసుకెళ్లడానికి బ్యూటీ ట్రీట్లు, శాంపిల్స్‌ను పంపిణీ చేస్తుంది. ప్రత్యేకంగా రూపొందించిన టీరా “సిగ్నేచర్ లుక్స్” వినియోగదారుల ఆసక్తిని పొందాయి. ఇక్కడి అత్యంత నైపుణ్యం కలిగిన బ్యూటీ అడ్వైజర్ల నుంచి తమకు ఇష్టమైన కాంప్లిమెంటరీ గ్లామర్ లుక్‌ను కూడా పొందవచ్చు. ప్ర‌త్యేక‌మైన ఎన్‌గ్రేవింగ్ మిష‌న్‌తో ఉన్న డెడికేటెడ్ గిఫ్టింగ్ స్టేష‌న్లు వినియోగ‌దారుల‌కు ప‌ర్స‌న‌లైజ్డ్ గిఫ్టులు ఇవ్వ‌డానికి స‌హాప‌డ‌తాయి. వీటిద్వారా వారు త‌మ గిఫ్టుల‌ను మ‌రింత ప్ర‌త్యేకంగా చేయించుకోవ‌చ్చు.

రిటైల్ స్టోర్స్‌ లో ఫ్రాగ్రెన్స్ ఫైండ‌ర్ కూడా ఉంది. రీటైల్ వాతావ‌ర‌ణంలో ఇలాంటిది ఉండ‌టం ఇదే మొట్ట‌మొద‌టిసారి. క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు న‌చ్చిన పెర్‌ఫ్యూంల‌ను కేట‌గరైజ్ చేసిన సువాస‌న‌ల ఆధారంగా ఎంపిక చేసుకోవ‌డానికి దీనివ‌ల్ల వీలవుతుంది.

Reliance Tira : ‘టీరా’ హైదరాబాద్ స్టోర్ బ్యూటీ రిటైల్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చాలని కోరుకుంటుంది. వినియోగదారులు వారి ప్రత్యేకమైన సౌందర్య ప్రాధాన్యతలను అన్వేషించడానికి, స్వీకరించడానికి ఇంటరాక్టివ్, సాంకేతిక-ఆధారిత వాతావరణాన్ని ఇది అందిస్తుంది. ‘టీరా’ నిరంతరం బ్యూటీ రిటైల్ ల్యాండ్ స్కేప్​ను పునర్నిర్మిస్తున్నందున, ఇది అందం ప‌ట్ల ఆస‌క్తి, ఉత్సాహం ఉన్న‌వారంద‌రికీ సమ్మిళిత, సాధికారిక సౌందర్య ప్రయాణానికి మార్గం సుగమం చేస్తుంది.

కరీనా కపూర్ ఖాన్, కియారా అద్వానీ, సుహానా ఖాన్ లతో 'ఫర్ ఎవ్రీ యూ' పేరుతో ‘టీరా’ ఇటీవల హై ఇంపాక్ట్ 360 డిగ్రీల క్యాంపెయిన్​ను ఆవిష్కరించింది. ఈ ప్రచారం వ్యక్తులు ఎదుర్కొనే విభిన్న పాత్రలు, భావోద్వేగాలు, మనోభావాలను గౌర‌విస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను ప్రేరేపించడం, వారి సౌందర్య అన్వేషణ ప్రయాణంలో వారు ఎక్కడ ఉన్నారనే దాంతో సంబంధం లేకుండా వారి నిజమైన స్వభావాన్ని స్వీకరించడానికి, వ్యక్తీకరించడానికి వ్యక్తులను ప్రోత్సహిస్తుంది. ‘టీరా’ యాప్‌ను ఇప్పటికే 1.5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇది టీరా​ పట్ల పెరుగుతున్న ప్రజాదరణను సూచిస్తుంది. ‘‘టీరా’ విస్తృతమైన రీచ్ భారతదేశం అంతటా 98శాతం పిన్ కోడ్‌ల‌ను కవర్ చేస్తుంది. ఇది 100 కిపైగా నగరాల్లోని వినియోగదారులకు చేరుతుంది.

Hyderabad Reliance Tira : మరింత సమాచారం కోసం, ‘టీరా’ అందించే వైవిధ్యమైన సౌందర్య ఆఫర్లను తెలుసుకోవడానికి, హైదరాబాద్ లోని శరత్ సిటీ మాల్ లో కొత్తగా ప్రారంభించిన స్టోర్ ను సందర్శించాల్సి ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం