రిలయన్స్ రిటైల్ తొలి స్వదేశ్ స్టోర్ హైదరాబాద్‌లో ప్రారంభం-reliance retail first standalone swadesh store opens in hyderabad ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Reliance Retail First Standalone Swadesh Store Opens In Hyderabad

రిలయన్స్ రిటైల్ తొలి స్వదేశ్ స్టోర్ హైదరాబాద్‌లో ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Nov 09, 2023 10:35 AM IST

హైదరాబాద్లో రిలయన్స్ రిటైల్ తొలి స్వదేశ్ స్టోర్ ను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు,చైర్ పర్సన్ నీతా అంబానీ ప్రారంభించారు.

హైదరాబాద్‌లో స్వదేశ్ స్టోర్ ప్రారంభిస్తున్న నీతా అంబానీ
హైదరాబాద్‌లో స్వదేశ్ స్టోర్ ప్రారంభిస్తున్న నీతా అంబానీ

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ నీతా అంబానీ హైదరాబాద్లో రిలయన్స్ రిటైల్ తొలి స్వదేశ్ స్టోర్ ను బుధవారం ప్రారంభించారు. సంప్రదాయ కళాకారులు, చేతివృత్తులను ప్రోత్సహించడానికి, వారిప్రతిభ, నైపుణ్యాన్ని అంద‌రికీ ప్రదర్శించడానికి ఒక వేదికను సృష్టించాలనే నీతా అంబానీ దార్శనికత నుంచి రూపుదిద్దుకున్న‌దే స్వదేశ్. 

ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్ న‌గ‌రంలో త‌మ మొట్టమొదటి స్టాండ‌లోన్‌ స్వదేశ్ స్టోర్ ను ప్రారంభించిన సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ, “స్వదేశ్ భారతదేశ సంప్రదాయ కళలు, చేతివృత్తుల వారికి ప్రతిరూపం. ఇది 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తిని హైలైట్ చేస్తుంది. ఇంకా మన నిపుణులైన హస్తకళాకారులు, చేతివృత్తుల మహిళలకు గౌరవం, జీవనోపాధిని అందిస్తుంది. వారు నిజంగా మన దేశానికి గర్వకారణం. స్వదేశ్ ద్వారా వారికి గొప్ప అంత‌ర్జాతీయ గుర్తింపును అందించాలని మేము ఆశిస్తున్నాము. అందుకే స్వదేశ్ ను భారత్ లోనే కాకుండా అంతర్జాతీయంగా అమెరికా, యూరప్ ఖండాలలో కూడా విస్తరించేందుకు ఉత్సాహంగా ఉన్నాం” అని చెప్పారు.

రిలయన్స్ ఫౌండేషన్ అలుపెరగని ప్రయత్నాలకు నిదర్శనంగా, ముంబైలో ఇటీవల ప్రారంభించిన కళలు, సాంస్కృతిక ప్రదేశమైన‌ నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఎసిసి) లో సృష్టించిన అందమైన స్వదేశ్ ఎక్స్‌పీరియెన్స్ జోన్‌లో భారతీయ హస్తకళాకారులు ఇటీవల జాతీయ‌, అంతర్జాతీయ అతిథుల నుంచి బ్ర‌హ్మాండ‌మైన‌ ప్రశంసలను పొందారు. సంద‌ర్శ‌కులు కేవ‌లం నిపుణులైన క‌ళాకారుల‌ను వారు త‌మ సంప్ర‌దాయ ప‌నిప్ర‌దేశంలో క‌ళాఖండాలు రూపొందిస్తుంటే చూసి ఆనందించ‌డం, వాళ్ల‌తో మాట్లాడ‌ట‌మే కాదు.. ఆ క‌ళాఖండాల‌ను కొనుగోలు కూడా చేయొచ్చు.

వాస్తవానికి మూడు రోజుల కార్యక్రమంగా షెడ్యూల్ చేసిన ఎన్ఎంఎసిసి స్వదేశ్ ఎగ్జిబిషన్ అపూర్వమైన ప్రజా డిమాండ్ కారణంగా పొడిగించాల్సి వచ్చింది. విస్తృత సంఖ్యలో సందర్శకులు, చేతివృత్తుల వద్ద ఉంచిన రోజువారీ ఆర్డర్లలో ఈ డిమాండ్ కనిపించింది. దీని ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం చేతివృత్తుల వారికి వెళ్లింది.

దీనికి అదనంగా, స్వదేశ్ చొరవలో భాగంగా, 18 రిలయన్స్ ఫౌండేషన్ ఆర్టిజన్ ఇనిషియేటివ్ ఫర్ స్కిల్ ఎన్‌హాన్స్ మెంట్ (రైజ్‌) కేంద్రాలను భారతదేశం అంతటా ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. దీని ద్వారా 600కు పైగా క‌ళా రూపాల‌ను సోర్సింగ్ చేయడానికి వీలవుతుందని భావిస్తున్నారు.

రిలయన్స్ రిటైల్ చొరవ అయిన స్వదేశ్ స్టోర్, భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వం యొక్క సున్నితమైన అందాన్ని ఉపయోగించుకోవడానికి, అంతరించిపోతున్న దాని కళారూపాలను పరిరక్షించడానికి రిలయన్స్ ఫౌండేషన్ ప్రయాణంలో ఒక సహజ పురోగతి. తెలంగాణలోని జూబ్లీహిల్స్ లో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న తొలి స్వదేశ్ స్టోర్ లో ఎంతోకాలంగా మరచిపోయిన టెక్నిక్స్, లోకల్ మెటీరియల్స్ ఉపయోగించి భారతదేశ నైపుణ్యం కలిగిన, ప్రతిభావంతులైన కళాకారులు పూర్తిగా చేతితో తయారుచేసిన ఉత్పత్తుల సేకరణ ఉంటుంది.

సందర్శకులు స్టోర్ లోని వివిధ జోన్లలో ఆహార ఉత్పత్తులు, దుస్తుల నుంచి వస్త్రాలు, హస్తకళల వరకు ఉత్పత్తుల సమగ్ర పోర్ట్ ఫోలియోను బ్రౌజ్ చేయవచ్చు. భారతదేశ సంప్రదాయ సృజనాత్మక వ్యక్తీకరణలను ఆకర్షణీయమైన, శక్తివంతమైన, ఆకాంక్షాత్మక వాతావరణంలో ఆస్వాదించగల‌రు. వారు "స్కాన్ అండ్ నో" టెక్నాలజీ ఫీచర్ ద్వారా ప్రతి ఉత్పత్తి, దాని తయారీదారు వెనుక ఉన్న కథను తెలుసుకోవ‌చ్చు.

ప్రత్యేకమైన ఉత్పత్తులను సృష్టించడానికి స్వదేశ్ బృందంతో కలిసి పనిచేయడానికి వినియోగదారులకు సహాయపడే ప్రత్యేక కస్టమైజేషన్ సేవతో పాటు, ఈ దుకాణంలో ఫార్మ్-టు-టేబుల్ కాన్సెప్ట్ ఆధారంగా ఆహారప్రియుల కోసం ఒక కేఫ్ ఉంది.

WhatsApp channel

టాపిక్