Reliance Q1 Results: Q1 రిలయన్స్ లాభాలు రూ. 16,011 కోట్లు; 10 శాతం తగ్గిన నెట్ ప్రాఫిట్స్
Reliance Q1 Results: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) శుక్రవారం ప్రకటించింది. Q1FY24 లో రిలయన్స్ నికర లాభాల్లో 10.8% క్షీణత నమోదైంది. Q1FY24 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభాలు రూ. 16,011 కోట్లు. కాగా, Q1FY23 లో అది రూ. 17,955 కోట్లు.
Reliance Q1 Results: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) శుక్రవారం ప్రకటించింది. Q1FY24 లో రిలయన్స్ నికర లాభాల్లో 10.8% క్షీణత నమోదైంది. Q1FY24 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభాలు రూ. 16,011 కోట్లు. కాగా, Q1FY23 లో అది రూ. 17,955 కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థూల ఆదాయం ఈ Q1 లో రూ. 2,31,132 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY23) తో పోలిస్తే స్థూల ఆదాయంలో 4.6% క్షీణత నమోదైంది. Q1FY23 లో రిలయన్స్ స్థూల ఆదాయం రూ. 2,42,529 కోట్లు.
O2C లో తగ్గిన ఆదాయం
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (Q4FY23) రిలయన్స్ సంస్థ 19.11% వృద్ధితో రూ. 19,299 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. Q4FY22 లో రిలయన్స్ నికర లాభాలు రూ. 16,203 కోట్లుగా ఉంది. ఆయిల్స్ టు కెమికల్స్ (O2C) సెగ్మెంట్లో మంచి లాభాలు సాధించడంతో ఆ ఆర్థిక సంవత్సరం రిలయన్స్ నికర లాభాలు దాదాపు 20% పెరిగాయి. కానీ, ఈ Q1FY24 లో ఈ ఆయిల్స్ టు కెమికల్స్ (O2C) సెగ్మెంట్లో రిలయన్స్ ఆదాయం అనూహ్యంగా తగ్గిపోయింది. ఈ సెగ్మెంట్లో రిలయన్స్ 11.8% క్షీణతతో రూ. 1, 28,633 కోట్ల ఆదాయం సముపార్జించింది.
డివిడెండ్..
ఆయిల్ నుంచి టెలీకాం వరకు విస్తరించిన రిలయన్స్ సామ్రాజ్యంలో ఈ ఫలితాలు ఊహించని కుదుపును ఇచ్చాయి. కాగా, రిలయన్స్ ఆపరేటింగ్, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ పై సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ సంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. కాగా, రిలయన్స్ Q1 ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు డివిడెండ్ ను కూడా ప్రకటించింది. రూ. 10 ముఖ విలువ కలిగిన ప్రతీ ఈక్విటీ షేర్ పై రూ. 9 లను డివిడెండ్ గా అందించాలని సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించారు.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్
మరోవైపు, గురువారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి రిలయన్స్ స్ట్రాటెజిక్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (RSIL) విడిపోయింది. ఈ ఆర్ఎస్ఐఎల్ ఇకపై జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) పేరుతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లలో వేరేగా లిస్ట్ అవుతుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు విలువను రూ. 261.85 గా నిర్ధారించారు. నిజానికి ఈ షేరు విలువ మార్కెట్ నిపుణులు రూ. 125 నుంచి రూ. 225 మధ్య ఉంటుందని భావించారు. కాగా, జులై 21, శుక్రవారం రిలయన్స్ షేర్ విలువ 2.57% క్షీణించి, రూ.2,536.20 వద్ద ముగిసింది.