Reliance Jio : సియాచిన్​లో జియో 5జీ సేవలు- భారత సైన్యానికి ఇక కనెక్టివిటీ సమస్యలు దూరం!-reliance jio takes 4g 5g to siachen for indian armys communication needs ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Jio : సియాచిన్​లో జియో 5జీ సేవలు- భారత సైన్యానికి ఇక కనెక్టివిటీ సమస్యలు దూరం!

Reliance Jio : సియాచిన్​లో జియో 5జీ సేవలు- భారత సైన్యానికి ఇక కనెక్టివిటీ సమస్యలు దూరం!

Sharath Chitturi HT Telugu
Jan 14, 2025 06:07 AM IST

ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన భూభాగంలో భారత సైన్యానికి మద్దతుగా సియాచిన్ గ్లేసియర్​లో 4జీ, 5జీ కనెక్టివిటీని ప్రారంభించింది రిలయన్స్​ జియో. ఇది దేశంతో పాటు టెలికాం రంగంలో కీలక మైలురాయిగా నిలిచింది.

సియాచిన్​ గ్లేసియర్​లో జియో 5జీ సేవలు..
సియాచిన్​ గ్లేసియర్​లో జియో 5జీ సేవలు.. (Jio)

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిగా పేరొందిన సియాచిన్ గ్లేసియర్​లో 4జీ, 5జీ నెట్​వర్క్ కనెక్టివిటీని ఏర్పాటు చేసింది దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్​ జియో. దేశంతో పాటు టెలికాం రంగంలో ఇదొక కీలక మైలురాయిగా నిలిచిపోయింది. ఇండియన్ ఆర్మీ సహకారంతో కనెక్టివిటీ సేవలను ఈ ప్రాంతానికి విస్తరించిన తొలి టెలికాం ఆపరేటర్​గా పేరు సంపాదించుకుంది. ఆర్మీ సిగ్నలర్ల సహకారంతో జరిగిన ఈ ఏర్పాట్లు దేశానికి ఒక పెద్ద సాంకేతిక విజయంగా కూడా చూడొచ్చు.

16వేల అడుగుల ఎత్తులో 5జీ సేవలు..

జియో తన ఫుల్ స్టాక్ 5జీ టెక్నాలజీని ఉపయోగించి కరకోరం రేంజ్​లోని ఫార్వర్డ్ పోస్ట్ వద్ద ప్లగ్ అండ్ ప్లే ప్రీ కాన్ఫిగర్ పరికరాలను విజయవంతంగా ఇన్​స్టాల్ చేసింది! లాజిస్టిక్స్​ని నిర్వహించే, గ్లేసియర్​కి పరికరాలను ఎయిర్​లిఫ్ట్​ చేయడానికి వీలు కల్పించిన భారత సైన్యంతో కోఆర్డినేషన్​ ద్వారా ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. కఠినమైన వాతావరణం ఉన్నా, ఉష్ణోగ్రతలు -50 డిగ్రీల సెల్సియస్​కి పడిపోయినా, జియో తాజా సేవలతో 16,000 అడుగుల వద్ద భారత సైన్యానికి నమ్మదగిన కనెక్టివిటీ లభిస్తుంది.

మారుమూల, సవాలుతో కూడిన ప్రదేశాలలో కనెక్టివిటీని అందించి భౌగోళిక అడ్డంకులను అధిగమించడానికి తమ నిబద్ధతను ఈ విజయం హైలైట్ చేస్తుందని జియో చెప్పింది. ఇది భారత సైన్యానికి కమ్యూనికేషన్ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సరిహద్దు ప్రాంతాల్లో వారి కార్యకలాపాలను పెంచుతుందని పేర్కొంది.

కీలకమైన సరిహద్దు పోస్టులపై దృష్టి సారించిన రిలయన్స్ జియో.. లద్దాఖ్​లో ఇప్పటికే తన నెట్​వర్క్​ని విస్తరించింది. ఈ కఠినమైన భూభాగాలకు 4జీ సేవలను తీసుకువచ్చిన మొదటి ఆపరేటర్​గా నిలిచింది. సాయుధ దళాలు, స్థానిక సమాజాలకు అవసరమైన డిజిటల్ సేవలకు మద్దతు ఇస్తూనే ఉంది.

సియాచిన్​లో విజయవంతంగా 5జీని ప్రారంభించడం టెలికాం పరిశ్రమలో ఒక కొత్త ప్రమాణాన్ని ఏర్పరుస్తుంది. ఇది భారతదేశంలోనే అత్యంత రిమోట్​ ప్రాంతాలను కూడా అనుసంధానించాలనే జియో సంకల్పాన్ని ప్రదర్శిస్తుంది. ఈ విజయం దేశ సాంకేతిక పురోగతిని, సాయుధ దళాల అచంచల అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని సంస్థ పేర్కొంది.

ఉచిత యూట్యూబ్ ప్రీమియం..

మరోవైపు జియో బ్రాడ్​బ్యాండ్​ వినియోగదారులకు ఉచిత యూట్యూబ్​ ప్రీమియం అందిస్తోంది సంస్థ. ఎంపిక చేసిన జియోఫైబర్, జియో ఎయిర్​ఫైబర్ పోస్ట్​పెయిడ్ ప్లాన్​లతో రెండు సంవత్సరాల పాటు యూట్యూబ్ ప్రీమియంను ఉచితంగా అందిస్తోంది. రూ.888 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన పోస్ట్​పెయిడ్ ప్లాన్లను సబ్​స్క్రైబ్​ చేసుకున్న వినియోగదారులు ఈ ఆఫర్​లో భాగంగా యాడ్ ఫ్రీ యూట్యూబ్, ఆఫ్​లైన్ వ్యూస్​, యూట్యూబ్ మ్యూజిక్ యాక్సెస్​ని ఆస్వాదించవచ్చు. భారతదేశంలో యూట్యూబ్ ప్రీమియంకు పెరుగుతున్న ప్రజాదరణకు ఇది మంచి ఆఫర్​.

Whats_app_banner

సంబంధిత కథనం