రిలయన్స్ డిజిటల్ మరోసారి ‘డిజిటల్ డిస్కౌంట్ డేస్’ ను ప్రారంభించింది. ఈ డిస్కౌంట్ డేస్ లో ఎలక్ట్రానిక్స్ పై రూ. 25,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అన్న విషయాన్ని కస్టమర్లు గుర్తుంచుకోవాలి.
రిలయన్స్ డిజిటల్ మళ్ళీ ‘డిజిటల్ డిస్కౌంట్ డేస్’ ను తీసుకువచ్చింది. ఇండియాలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ అయిన ఈ సేల్ లో అగ్రగామి బ్యాంకు కార్డులపై, పేపర్ ఫైనాన్స్ పై రూ. 25000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఏప్రిల్ 20 వ తేదీ వరకు అన్నీ రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, ఆన్ లైన్ లో reliancedigital.in వెబ్ సైట్ లో ఈ డిస్కౌంట్ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో అన్నీ ఎలక్ట్రానిక్స్ పై ఆఫర్లు చెల్లుతాయి. సులభ ఫైనాన్సింగ్, ఈఎమ్ఐ ఎంపికలు, వేగవంతమైన డెలివరీ అండ్ ఇన్ స్టలేషన్ సదుపాయాలను రిలయన్స్ డిజిటల్ కల్పిస్తోంది.
వివిధ బ్రాండ్ లకు చెందిన 1.5 టన్ 3 స్టార్ ఏసీల ధరలు రిలయన్స్ డిజిటల్ డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్ లో రూ. 26990 నుండి ప్రారంభమవుతాయి. విస్తృత శ్రేణి ఏయిర్ కూలర్స్ పై ఉత్తమ డీల్స్ ఉన్నాయి. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ ను కేవలం రూ. 61,990 లకే సొంతం చేసుకోవచ్చు. ల్యాప్ టాప్ లపై రూ. 30,000 వరకు బెనెఫిట్స్ పొంద వచ్చు.
ఈ రిలయన్స్ డిజిటల్ ‘డిజిటల్ డిస్కౌంట్ డేస్’ సేల్ లో అన్ని బ్రాండ్స్ కు చెందిన సరికొత్త స్మార్ట్ ఫోన్స్ ను అత్యుత్తమ ధరలకు సొంతం చేసుకోవచ్చు. టీవీలపై 60% వరకు తగ్గింపు లభిస్తుంది. 55 ఇంచ్ ల 4కే గూగుల్ టీవీ కేవలం రూ.26,990 లకు లభిస్తుంది. వాషర్ డ్రైయర్స్ ప్రారంభ ధర రూ. 49,990 గా ఉంది. అదనంగా, రూ. 3000 విలువ గల ఫ్రీబీలు పొందవచ్చు. యాపిల్ ఏయిర్ పాడ్స్ 4 ను రూ. 537 మంత్లీ ఈఎమ్ఐతో, యాపిల్ వాచ్ సిరీస్ 10 ను రూ 3908 మంత్లీ ఈఎమ్ఐతో పొందవచ్చు.