Redmi Smart Band 2 : రెడ్​మీ స్మార్ట్​ బ్యాండ్​ 2 వచ్చేస్తోంది!-redmi smart band 2 production reportedly started likely to be launched soon ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Redmi Smart Band 2 Production Reportedly Started, Likely To Be Launched Soon

Redmi Smart Band 2 : రెడ్​మీ స్మార్ట్​ బ్యాండ్​ 2 వచ్చేస్తోంది!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 19, 2022 07:52 AM IST

Redmi Smart Band 2 launch : రెడ్​మీ నుంచి మరో స్మార్ట్​ బ్యాండ్​ రానున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో ఇది లాంచ్​ అవ్వొచ్చని సమాచారం.

రెడ్​మీ స్మార్ట్​ బ్యాండ్​
రెడ్​మీ స్మార్ట్​ బ్యాండ్​

Redmi Smart Band 2 launch : రెడ్​మీ నుంచి తొలి ఫిట్​నెస్​ ట్రాకర్​గా గుర్తింపు పొందిన 'స్మార్ట్​ బ్యాండ్'​.. 2020లో లాంచ్​ అయ్యింది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ మార్కెట్లలో తన హవా కొనసాగించింది. ఇక ఇప్పుడు.. స్మార్ట్​ బ్యాండ్​ 2 కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫిట్​నెస్​ ట్రాకర్​ లాంచ్​ ఉండనున్నట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

రెడ్​మీ స్మార్ట్​ బ్యాండ్​ 2కు సంబంధించిన లేటెస్ట్​ అప్డేట్​ని ఓ టిప్​స్టర్​ ఇచ్చాడు. 2023 తొలినాళ్లల్లో ఇది లాంచ్​ అయ్యే అవకాశం ఉందని వివరించాడు.

Redmi Smart Band 2 : "రెడ్​మీ స్మార్ట్​ బ్యాండ్​ 2 ప్రొడక్షన్​.. ఏషియా, యూరప్​లోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైందని తెలిసింది. ఈ ఫిట్​నెస్​ ట్రాకర్​.. 2023 తొలినాళ్లల్లో లాంచ్​ అయ్యే అవకాశం ఉందని సమాచారం," అని టిప్​స్టర్​ ముకుల్​ శర్మ వెల్లడించాడు.

కాగా.. ఈ రెడ్​మీ స్మార్ట్​ బ్యాండ్​ 2 స్పెసిఫికేషన్స్​, ధరకు సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై రెడ్​మీ స్పందించాల్సి ఉంది.

రెడ్​మీ స్మార్ట్​ బ్యాండ్​..

Redmi Smart Band : ఎంఐ స్మార్ట్​ బ్యాండ్​ 4సీ పేరుతో.. అంతర్జాతీయ మార్కెట్​లోకి వచ్చింది రెడ్​మీ తొలి స్మార్ట్​ బ్యాండ్​. ఇందులో 1.08 ఇంచ్​ టీఎఫ్​టీ ఎల్​సీడీ కలర్​ ప్యానెల్​, టచ్​ ఇన్​పుట్​, 24 హవర్​ హార్ట్​ రేట్​ మానిటరింగ్​ సిస్టెమ్​ ఉన్నాయి.

టీఎఫ్​టీ ఎల్​సీడీ ప్యానెల్​ 128X200 పిక్సెల్​ రిసొల్యూషన్​ను ఆఫర్​ చేస్తుంది. టచ్​ ఇన్​పుట్​ను సపోర్ట్​ చేస్తుంది. ఈ స్క్రీన్​ మ్యాగ్జిమం బ్రైట్​నెస్​ 200నిట్స్​గా ఉంది.

Redmi Smart Band specifications : హార్ట్​ రేట్​ను ఈ డివైజ్​ నిత్యం పరిశీలిస్తుంది. ఏదైనా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటే.. వెంటనే అలర్ట్​ చేస్తుంది. ఇందులో 5 ప్రొఫెషనల్​ స్పోర్ట్స్​ మోడ్స్​ ఉన్నాయి. రన్నింగ్​, సైక్లింగ్​, పవర్​ వాకింగ్​, ట్రెడ్​మిల్​, ఫ్రీ స్టైల్​ ఎక్సర్సైజ్​ మోడ్స్​ ఉన్నాయి. 50కిపైగా స్క్రీన్​ కస్టమైజేషన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. యూఎస్​బీ ఛార్జింగ్​ కూడా ఉంది. ఇందులో 130ఎంఏహెచ్​ బ్యాటరీ సెటప్​ ఉండటంతో.. ఇది 14 రోజుల వరకు పనిచేస్తుందని తెలుస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్​లో రెడ్​మీ స్మార్ట్​ బ్యాండ్​ ధర 22డాలర్లుగా ఉంది.

Redmi Smart Band 2 price details : ఇక రెడ్​మీ స్మార్ట్​ బ్యాండ్​ 2 ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియాలో ఈ స్మార్ట్​ బ్యాండ్​ ఎప్పుడు లాంచ్​ అవుతుంది? అన్న విషయంపైనా స్పష్టత రావాల్సి ఉంది.

WhatsApp channel