Redmi Pad Pro 5G : రెడ్మీ ప్యాడ్ ప్రో 5జీ లాంచ్‌కు రెడీ- ఫీచర్స్ ఇవే!
Redmi Pad Pro 5G price : రెడ్మీ ప్యాడ్ ప్రో 5జీ లాంచ్‌కు రెడీ అవుతోంది- ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్‌పై ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.
Redmi Pad Pro 5G India launch date : కొత్త రెడ్మీ ప్యాడ్ ప్రో 5జీ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు షియోమీ సీఈఓ లీ జున్ ప్రకటించారు. వైఫై కనెక్టివిటీని మాత్రమే అందించే ప్రస్తుత ప్యాడ్ ప్రో మాదిరిగా కాకుండా ఈ కొత్త మోడల్.. 5జీని కూడా సపోర్ట్ చేస్తుంది. రాబోయే ట్యాబ్లెట్.. ఇప్పుడు ఒక ప్రధాన చైనీస్ సర్టిఫికేషన్ సైట్లో దర్శనమిచ్చింది. ఫలితంగా.. పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రెడ్మీ ప్యాడ్ ప్రో 5జీ: సర్టిఫికేషన్ వివరాలు..
రెడ్మీ ప్యాడ్ ప్రో 5జీ.. టెనా డేటాబేస్‌లో మోడల్ నంబర్ 24074ఆర్ పీడీ2సీతో కనిపించింది. కొత్త ట్యాబ్లెట్.. 5జీ కోసం ఫిజికల్ సిమ్ కార్డును ఉపయోగిస్తుందని, ఈ-సిమ్‌కు మద్దతు ఇవ్వదని లీ జున్ ప్రకటనలో పేర్కొన్నారు. డ్యూయెల్ సిమ్ సపోర్ట్, జీపీఎస్, ఏజీపీఎస్, బీడౌ, గ్లోనాస్, డబ్ల్యూఎల్ఏఎన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి.
Redmi Pad Pro 5G price in India : టెనా సర్టిఫికేషన్ ఉన్న రెడ్మీ ప్యాడ్ ప్రో 5జీలో.. 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. రెగ్యులర్ రెడ్మీ ప్యాడ్ ప్రోలో 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నందున, 5జీ వెర్షన్ కూడా అదే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 5జీ వెర్షన్ ఒరిజినల్ మోడల్‌తో పోల్చదగిన స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. రెడ్మీ ప్యాడ్ ప్రోలో 12.1 ఇంచ్ 2.5కే ఎల్సీడీ ప్యానెల్, 2560 × 1600 రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్ఓసీ, 6జీబీ లేదా 8జీబీ ర్యామ్- 128 జీబీ లేదా 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో పనిచేసే ఈ ఫోన్లో.. హైపర్ ఓఎస్ కస్టమ్ స్కిన్ ఉంటుంది. ముందు, వెనుక రెండు వైపులా 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. 33వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, బ్లూటూత్ 5.2, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో క్వాడ్ స్పీకర్లు ఇతర ఫీచర్లుగా ఉన్నాయి.
ఈ రెడ్మీ ప్యాడ్ ప్రో 5జీ.. తొలుత చైనాలో లాంచ్ అవుతుంది. ఆ తర్వాత ఇండియాలో అడుగుపెడుతుంది. ఈ గ్యాడ్జెట్ లాంచ్ డేట్, ఇతర ఫీచర్స్, ధర వంటి వివరాలపై త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
హానర్ 200 లాంచ్..
మరోవైపు.. హానర్ 200 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ని లాంచ్ చేసింది దిగ్గజ టెక్ సంస్థ. చైనాలో లాంచ్ అయిన ఈ సిరీస్‌లో.. హానర్ 200, హానర్ 200 ప్రో గ్యాడ్జెట్స్ ఉన్నాయి. త్వరలోనే కొత్త ఫోన్ భారతదేశానికి రానుందని కంపెనీ చెప్పింది.
హానర్ 200లో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2664×1200 పిక్సల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 100% డీసీఐ-పీ3 కలర్ గేమట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ 3,840 హెర్ట్జ్ పీడబ్ల్యుఎమ్ డిమ్మింగ్‌ను కలిగి ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక చేయండి.
సంబంధిత కథనం