Redmi Note 14s : రెడ్మీ నోట్ 14ఎస్ ఫీచర్స్ చూశారా?
Redmi Note 14s : రెడ్మీ నోట్ 14ఎస్ స్మార్ట్‌ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ మోడల్ ఫీచర్స్, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
రెడ్మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. దీని పేరు రెడ్మీ నోట్ 14ఎస్. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 200ఎంపీ రేర్ కెమెరాతో పాటు మరిన్ని ఎగ్జైటింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇదొక 4జీ స్మార్ట్‌ఫోన్. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రెడ్మీ నోట్ 14ఎస్- స్పెసిఫికేషన్స్, ఫీచర్స్..
రెడ్మీ నోట్ 14ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ సిమ్ ఉంటుంది. హైపర్ఓఎస్పై ఇది పనిచేస్తుంది. ఇందులో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. దీనికి కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తోంది.
ఈ రెడ్మీ నోట్ 14ఎస్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జీ99-యూ ప్రాసెసర్ ఉంటుంది. రెడ్మీ నోట్ 13 ప్రోలోనూ ఇదే కనిపిస్తుంది. ఇక కొత్త స్మార్ట్‌ఫోన్.. 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది.
ఫొటోలు, వీడియోల కోసం రెడ్మీ నోట్ 14ఎస్‌లో 200ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ, 2ఎంపీ కెమెరా సెటప్ రేర్‌లో ఉంది. సెల్ఫీ కోసం 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వస్తోంది. ఐపీ64 రేటింగ్ కూడా ఉంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి 67వాట్ ఛార్జింగ్ ఆప్షన్ వస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 179గ్రాములు.
రెడ్మీ నోట్ 14ఎస్- ధర..
చెక్ రిపబ్లిక్లో ఈ రెడ్మీ నోట్ 14ఎస్ 5,999 సీజెడ్కే ధరతో లాంచ్ అయ్యింది. ఇండియన్ కరెన్సీలో ఇది సుమారు రూ. 22,700. ఇక ఉక్రెయిన్‌లో దీని ధర యూఏహెచ్ 10,000. సుమారు రూ. 23,100. అరోరా పర్పుల్, మిడ్నైట్ బ్లాక్, ఓషన్ బ్లూ కలర్స్‌తో ప్రస్తుతానికి ఇది ఈ రెండు దేశాల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
రెడ్మీ నోట్ 14సీ..
ఇండియాలో కొన్ని నెలల క్రితం రెడ్మీ నోట్ 14సీ లాంచ్ అయ్యింది. 6 జీబీ వరకు ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ సహా శక్తివంతమైన ఇంటర్నల్స్ LPDDR4X తో ఇది లభిస్తుంది.
రెడ్మీ 14సీలో 4ఎన్ఎం ఆధారిత క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్ ఉంది. రెడ్మీ 14సీ స్మార్ట్‌ఫోన్‌లో 6 జీబీ వరకు LPDDR4X ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది.
బ్యాటరీ: రెడ్మీ 14సీలో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5160 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉన్నాయి. సింగిల్ ఫుల్ చార్జింగ్‌తో 22 గంటల వీడియో ప్లేబ్యాక్, 33 గంటల సోషల్ మీడియా వాడకం, 42 గంటల వాయిస్ కాల్స్ కోసం ఉపయోగించవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం