Redmi Note 14 : రేపే రెడ్​మీ నోట్​ 14 సిరీస్​ లాంచ్​- ఫీచర్స్​, ధరల వివరాలు..-redmi note 14 series launching in india tomorrow all you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi Note 14 : రేపే రెడ్​మీ నోట్​ 14 సిరీస్​ లాంచ్​- ఫీచర్స్​, ధరల వివరాలు..

Redmi Note 14 : రేపే రెడ్​మీ నోట్​ 14 సిరీస్​ లాంచ్​- ఫీచర్స్​, ధరల వివరాలు..

Sharath Chitturi HT Telugu
Dec 08, 2024 12:07 PM IST

Redmi Note 14 pro : షియోమీ రెడ్ మీ నోట్ 14 సిరీస్ లో నోట్ 14, ప్రో, ప్రో ప్లస్ మోడల్స్​ ఉన్నాయి. అమోఎల్ఈడీ డిస్​ప్లేలు, మీడియాటెక్, స్నాప్​డ్రాగన్ ప్రాసెసర్లు, పెద్ద బ్యాటరీలు వంటి ఫీచర్లతో ఇవి సోమవారం లాంచ్​కానున్నాయి.

రేపే రెడ్​మీ నోట్​ 14 సిరీస్​ లాంచ్!
రేపే రెడ్​మీ నోట్​ 14 సిరీస్​ లాంచ్!

షియోమీ తన మిడ్ రేంజ్ రెడ్​మీ నోట్ 14 సిరీస్​ని సోమవారం, రేపు భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈ రెడ్​మీ సిరీస్ లైనప్​లో రెడ్​మీ నోట్ 14, రెడ్​మీ నోట్ 14 ప్రో, రెడ్​మీ నోట్ 14 ప్రో+ అనే మూడు స్మార్ట్​ఫోన్స్​ ఉండనున్నాయి. లాంచ్​కి ముందు, రెడ్​మీ నోట్ 14 ప్రో సిరీస్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

yearly horoscope entry point

రెడ్​మీ నోట్ 14 సిరీస్​ ధరలు..
రెడ్​మీ నోట్ 14 వేరియంట్ ధర రూ .21,999. రెడ్​మీ నోట్ 14 ప్రో మోడల్ రూ .28,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. రెడ్​మీ నోట్ 14 ప్రో ప్రారంభ ధర రూ.34,999. ప్రో+ మోడల్​ ధర తెలియాల్సి ఉంది.

రెడ్​మీ నోట్ 14 స్పెసిఫికేషన్లు..

రెడ్​మీ నోట్ 14లో 6.67 ఇంచ్​ అమోఎల్ఈడీ డిస్​ప్లే, 2,100 నిట్స్ పీక్ బ్రైట్​నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్​పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఆప్టిక్స్ ఫ్రంట్​లో స్మార్ట్​ఫోన్​లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్​తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ షూటర్ ఉండవచ్చు.

45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 5,110 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది.

రెడ్​మీ నోట్ 14 ప్రో స్పెసిఫికేషన్స్..

రెడ్​మీ నోట్ 14 ప్రో స్మార్ట్​ఫోన్​లో కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ప్రొటెక్షన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.67 ఇంచ్​ 1.5కే అమోలెడ్ డిస్​ప్లే ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్లను ఇందులో అందించింది సంస్థ.

50 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్​ని అందించారు. 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్​తో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనుంది.

రెడ్​మీ నోట్ 14 ప్రో+ స్పెసిఫికేషన్లు (అంచనా)..

రెడ్​మీ నోట్ 14 ప్రో ప్లస్ కూడా ప్రో వేరియంట్ మాదిరిగానే 6.67 ఇంచ్​ 1.5కె అమోఎల్ఈడీ డిస్​ప్లేతో రావచ్చు. క్వాల్కం స్నాప్​డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.

నోట్ 14 ప్రో ప్లస్​లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉండవచ్చు. ముందు భాగంలో ప్రో వేరియంట్ మాదిరిగానే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉండవచ్చు.

మిడ్ రేంజ్ డివైజ్ 90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 6,200 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. మూడు రెడ్ మీ నోట్ 14 సిరీస్ వేరియంట్లు ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ పై పనిచేసే అవకాశం ఉంది.

ఈ సిరీస్​లోని స్మార్ట్​ఫోన్స్​కి సంబంధించిన మరిన్ని వివరాలపై క్లారిటీ రావాల్సింది. లాంచ్​ టైమ్​కి కీలక విషయాలు బయటకి రావొచ్చు. వాటిని మేము మీకు అప్డేట్​ చేస్తాము.

Whats_app_banner

సంబంధిత కథనం