Redmi Note 13 Pro Discount : 200ఎంపీ కెమెరాతో వచ్చే రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్-redmi note 13 pro with 200mp camera smartphone gets huge discount check affordable price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi Note 13 Pro Discount : 200ఎంపీ కెమెరాతో వచ్చే రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్

Redmi Note 13 Pro Discount : 200ఎంపీ కెమెరాతో వచ్చే రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్

Anand Sai HT Telugu
Jan 20, 2025 05:29 PM IST

Redmi Note 13 Pro Discount : రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్ తీసుకోవాలనుకునేవారికి గుడ్‌న్యూస్. 31 శాతం డిస్కౌంట్‌తో ఈ ఫోన్ లభిస్తోంది. ఆ వివరాలేంటో చూడండి..

రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ
రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ

ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. బ్రాండెడ్ కంపెనీల స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై భారీ తగ్గింపు ఉంది. రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్ కొనుగోలుపై 31 శాతం తగ్గింపు దొరుకుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం విడుదలైంది. 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆఫర్ వివరాలు తెలుసుకుందాం..

yearly horoscope entry point

డిస్‌ప్లే వివరాలు

రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్ 6.67 అంగుళాల అమోల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1220 x 2712 పిక్సెల్స్ రిజల్యూషన్, 1800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా సేఫ్టీగా ఉంటుంది. ఈ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత హైపర్ ఓఎస్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ ఉంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు.

కెమెరా ఫీచర్లు

రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మూడో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది.

రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ 5100mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం ఐపీ54 రేట్ పొందింది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

ఆఫర్ వివరాలు

రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 19,699 రూపాయల తగ్గింపు ధరకు విక్రయిస్తున్నారు. అంటే 31 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది.

గమనిక : ప్రస్తుతం ఉన్న డిస్కౌంట్ ఆధారంగా ధర ఇచ్చాం. డిస్కౌంట్ ఆఫర్ భవిష్యత్తులో మారవచ్చు.

Whats_app_banner