భారత మార్కెట్లో రెడ్‌మీ సంస్థ తన కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. దాని పేరు రెడ్‌మీ 15 5జీ. ఈ కొత్త ఫోన్ రూ. 20,000 లోపు ధరతో మార్కెట్లోకి వచ్చి, ఐక్యూ జెడ్10ఆర్, ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..
రెడ్‌మీ 15 5జీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది:
6GB RAM/128GB స్టోరేజ్: రూ. 14,999
8GB RAM/256GB స్టోరేజ్: రూ. 15,999
8GB RAM/256GB స్టోరేజ్ (టాప్-ఎండ్): రూ. 16,999
ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, ఫ్రాస్టెడ్ బ్లాక్, శాండీ పర్పుల్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. ఇది ఆగస్ట్ 28 నుంచి Mi.com, అమెజాన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
డిస్‌ప్లే: రెడ్‌మీ 15లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 288Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. దీని బ్రైట్‌నెస్ సాధారణంగా 700 నిట్స్, హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 850 నిట్స్ వరకు ఉంటుంది. ఈ ఫోన్‌కు ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. అంటే తేలికపాటి వర్షం, నీటి తుంపరల నుంచి రక్షణ ఉంటుంది, కానీ పూర్తిగా నీటిలో ముంచితే తట్టుకోలేదు.
ప్రాసెసర్- స్టోరేజ్: ఈ ఫోన్ 6ఎన్ఎం ప్రాసెస్ ఆధారిత క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్, అడ్రినో 619 జీపీయూతో పనిచేస్తుంది. ఇది 6GB/8GB LPDDR4x ర్యామ్, 128GB/256GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్ ద్వారా స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు.
సాఫ్ట్‌వేర్- బ్యాటరీ: రెడ్‌మీ 15 ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్‌ఓఎస్ 2.0పై రన్ అవుతుంది. రెడ్‌మీ ఈ ఫోన్‌కు 2 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇది 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు, ఇంకా 18డబ్ల్యూ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: ఫొటోగ్రఫీ కోసం, ఈ ఫోన్ వెనుక భాగంలో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, డెప్త్ సెన్సార్, ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8ఎంపీ కెమెరా ఉంది.
ఇతర ఫీచర్లు: ఈ ఫోన్‌కు అన్‌లాక్ చేయడానికి సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. అప్లయెన్సెస్‌ను నియంత్రించడానికి ఐఆర్ సెన్సార్ కూడా ఉంది. డాల్బీ సర్టిఫికేషన్‌తో ఒకే బాటమ్-ఫైరింగ్ స్పీకర్ ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తుంది.
సంబంధిత కథనం