Torn Notes : ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి? ఎక్కడ మార్చుకోవాలి?-received torn or mutilated note from atm check how to change in simple way know rbi rules here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Torn Notes : ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి? ఎక్కడ మార్చుకోవాలి?

Torn Notes : ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి? ఎక్కడ మార్చుకోవాలి?

Anand Sai HT Telugu
Nov 12, 2024 05:53 PM IST

Torn Note : ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వచ్చాయా? ఏం చేయాలో అర్థం కావడం లేదా? చాలా సింపుల్‌గా ఈ నోట్లను మార్చుకోవచ్చు. కొన్ని పద్ధతులు ఫాలో కావాలి అంతే. ఎక్కడ ఈ నోట్లు మార్చాలో తెలుసుకుందాం..

ఏటీఎం నుంచి చిరిగిన నోటు వస్తే ఏం చేయాలి?
ఏటీఎం నుంచి చిరిగిన నోటు వస్తే ఏం చేయాలి?

డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఇటీవలి కాలంలో బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేదు. దగ్గరలోని ఏటీఎం వెళ్లవచ్చు.కొన్నిసార్లు ఏటీఎంలో చినిగిన నోటు రావొచ్చు. మరీ ఎక్కువగా చినిగి ఉండకపోయినా.. కాస్తైనా చినిగినట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు కాస్త ఎక్కువ చినిగి రావడం గమనించవచ్చు. ఇలాంటి సమయంలో ఆ నోట్లను ఎక్కడ మార్చాలి అని సాధారణంగా వచ్చే ప్రశ్న. ఇలా పొరపాటున చినిగిన నోట్లు బయటకు వస్తే.. మీరు ఏం చేయాలి? దీనిపై ఆర్‌బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయో చూడండి..

మనం మన అవసరానికి తగ్గట్టుగా ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తూనే ఉంటాం. ఏటీఎం సర్వీస్ 24x7 అందుబాటులో ఉంటుందని తెలుసు. మనం ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు విత్‌డ్రా చేయవలసి వస్తే.. అటువంటి పరిస్థితిలో ఏటీఎం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఏటీఎం నుంచి చినిగిన నోట్లు బయటకు వస్తాయి. అలాంటి పరిస్థితిలో ఏమి చేయాలి?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఏటీఎం నుండి చిరిగిన నోట్లు ఎప్పుడైనా బయటకు వస్తే.. భయపడాల్సిన అవసరం లేదు. మీరు దీన్ని చాలా సులభంగా మార్చవచ్చు. బ్యాంకుకు వెళ్లి ఈ నోట్లను మార్చుకోవచ్చు. అదే సమయంలో అటువంటి నోట్లను మార్చడానికి ఏ బ్యాంకు నిరాకరించదు. నోట్ల మార్పిడికి బ్యాంకుల్లో సుదీర్ఘ ప్రక్రియ లేదు. ఈ నోట్‌ని ఏ బ్యాంక్ ఏటీఎం నుండి తీసుకున్నారో ఆ బ్యాంకుకు తీసుకెళ్లాలి. మీరు బ్యాంకుకు వెళ్లిన వెంటనే అడిగితే ఫారం ఇస్తారు. ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని జాగ్రత్తగా చదివి నింపాలి.

ఈ ఫారమ్‌లో నోట్‌ను జారీ చేసిన తేదీ, సమయం వంటి చిన్న సమాచారం అడుగుతారు. బ్యాంకుతో పాటు, రిజర్వ్ బ్యాంక్ కార్యాలయానికి వెళ్లి నోట్లను మార్చుకోవచ్చు. అయితే ఇందులో కూడా ఓ పరిమితి ఉంది. దీనికి సంబంధించి ఒక వ్యక్తి ఒకేసారి 20 కంటే ఎక్కువ చిరిగిన నోట్లను మార్చుకోలేరు. ఇది కాకుండా ఈ 20 నోట్ల విలువ రూ. 5000 కంటే ఎక్కువ ఉండకూడదు. దీనితో పాటు నోట్లను మార్చుకునే ముందు, ఆర్‌బిఐ కొన్ని చెడ్డ నోట్లుగా ప్రకటించిన వాటిని తెలుసుకోండి.

ఆర్‌బిఐ కింద కొన్ని నోట్లను చెడ్డవి అని పిలుస్తారు. అవి నిరంతర వినియోగం కారణంగా పాడై ఉంటాయి. ఇది కాకుండా రెండు ముక్కలుగా అయిన నోట్లు కూడా ఈ లిస్టులో ఉంటాయి. నోట్‌లో రాసిన ఏదైనా సమాచారం తప్పుగా లేదా అసంపూర్ణంగా ముద్రించడం కూడా దీని కిందకు వస్తుంది. మీరు ఈ నోట్లను బ్యాంక్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా శాఖలో మార్చుకోవచ్చు.

Whats_app_banner