Pink WhatsApp: ‘పింక్ వాట్సాప్’ ను డౌన్లోడ్ చేసుకోకండి.. చాాలా డేంజర్
వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ అయిన ‘పింక్ వాట్సాప్ (Pink WhatsApp)’ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటూ మీకేమైనా మెసేజ్, లింక్ వచ్చిందా? వెంటనే ఆ మెసేజ్, లింక్ లను డిలీట్ చేయండి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ లింక్ ను క్లిక్ చేయకండి.
వాట్సాప్ స్కామ్స్ లిస్ట్ లోకి మరో కొత్త స్కామ్ వచ్చి చేరింది. లేటస్ట్ వాట్సాప్ (WhatsApp) వర్షన్ ‘పింక్ వాట్సాప్ (Pink WhatsApp)’ ను డౌన్ లోడ్ చేసుకవాలంటూ వచ్చే లింక్ లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని ముంబై సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు సూచిస్తున్నారు.
ఏంటీ పింక్ వాట్సాప్..
ఇది లేటెస్ట్ వాట్సాప్ పింక్ వర్షన్ అని, దీన్ని ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలని మెసేజ్ వస్తుంది. నిజానికి ఇది హ్యాకర్స్ పంపిన మోసపూరిత లింక్. వాట్సాప్ లో పింక్ వర్షన్ అనేదేదీ లేదు. ఒకవేళ ఆ లింక్ ను మీరు క్లిక్ చేస్తే, మాల్వేర్ మీ ఫోన్ లోకి చొరబడి, మీ స్మార్ట్ ఫోన్ ను హ్యాక్ చేస్తుంది. మీ కాంటాక్ట్స్ ను, ఫొటోలను, వీడియోలను యాక్సెస్ చేస్తుంది. మీ పేమెంట్ యాప్స్, లేదా బ్యాంకింగ్ యాప్స్ ను హ్యాక్ చేసి, డబ్బులు నష్టపోయేలా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఫోన్ మీ చేతిలో ఉంటుంది కానీ దానిపై నియంత్రణ మాత్రం హ్యాకర్ల చేతిలో ఉంటుంది.
How to protect yourself: ఎలా తప్పించుకోవడం?
ఒకవేళ ఇప్పటికే మీరు ఆ పింక్ వాట్సాప్ (Pink WhatsApp) ను డౌన్ లోడ్ చేసుకుని ఉంటే, వెంటనే దాన్ని డౌన్ లోడ్ చేసుకోండి. అందుకు ఈ స్టెప్స్ ఫాలో కండి. సెట్టింగ్స్ లోకి వెళ్లి, యాప్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అందులో వాట్సాప్ (పింక్) ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం ఆ యాప్ ను డిలీట్ చేయాలి. సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్రౌజర్ క్యాచ్ ని క్లియర్ చేయండి. అంతేకాదు..
- గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ, యాపిల్ యాప్ స్టోర్ నుంచి కానీ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవడం మంచిది.
- గుర్తు తెలియని సోర్స్ నుంచి వచ్చిన లింక్స్ ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దు.
- అపరిచిత వ్యక్తులకు, అనుమానాస్పద యాప్ లకు వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు చెప్పవద్దు.
- అనుమానాస్పద లింక్ లను, తెలియని వ్యక్తులు, సోర్స్ ల నుంచి వచ్చిన లింక్ లను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు.
- తెలియని ఏపీకేలను మీ డివైజెస్ లో ఇన్ స్టాల్ చేసుకోవద్దు.