Realme P Series Phones : రియల్మీ పీ సిరీస్ నుంచి రెండు స్మార్ట్ఫోన్లు వచ్చేశాయోచ్.. అందుబాటు ధరలోనే!
Realme P Series Phones : రియల్మీ పీ సిరీస్ నుంచి రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి పీ3 ప్రో, పీ3 ఎక్స్ స్మార్ట్ ఫోన్లు. ఈ ఫోన్ల ధరలు, ఇతర వివరాలేంటో చూద్దాం..

రియల్మీ పీ3 ప్రో, రియల్మీ పీ3ఎక్స్ అనేవి రియల్మీ పీ సిరీస్ నుండి వచ్చిన తాజా ఫోన్లు. Realme P3 Pro 5G భారతదేశంలో మిడ్-రేంజ్ పీ సిరీస్‌లో భాగంగా Realme P3X 5Gతో పాటు విడుదల చేశారు. రెండు ఫోన్లు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. రియల్మీ పీ3 ప్రో 5జీ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. అయితే పీ3ఎక్స్ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 SoCతో అమర్చబడింది. రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 15పై నడుస్తాయి. Realme UI 6.0తో వస్తాయి.
రియల్మీ పీ3 ప్రో ధరలు
రియల్మీ పీ3 ప్రో 5జీ 8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ మోడల్ రూ.23,999 నుండి ప్రారంభమవుతుంది. 8జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.రూ.24,999 కాగా 12 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ రూ.26,999 ధరకు అందిస్తుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 25 నుండి రియల్మీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ పర్పుల్, నెబ్యులా గ్లో, సాటర్న్ బ్రౌన్ అనే మూడు రంగులలో లభిస్తుంది.
రియల్మీ పీ3ఎక్స్ ధరలు
రియల్మీ పీ3ఎక్స్ 5జీ ధర 6జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ రూ.13,999, 8జీబీ ప్లస్ 128జీబీ వెర్షన్ రూ.14,999గా నిర్ణయించారు. ఈ మోడల్ ఫిబ్రవరి 28 నుండి రియల్మీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. లూనార్ సిల్వర్, మిడ్నైట్ బ్లూ, స్టెల్లార్ పింక్ రంగులలో లభిస్తుంది.
ఫీచర్లు
రియల్ మీ పీ3 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1,500 నిట్స్ బ్రైట్ నెస్ తో 6.7 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ తో వస్తుంది. ఇందులో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్లో ఏఐ రికార్డింగ్, ఏఐ రైటర్, ఏఐ రిప్లై, సర్కిల్ టు సెర్చ్ వంటి నెక్ట్స్ఏఐ ఫీచర్లు ఉన్నాయి. అయితే పీ3ఎక్స్ 5జీ 6.7-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
కెమెరా వివరాలు
ఫోటోగ్రఫీ కోసం పీ3 ప్రో 5జీలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో సోనీ IMX896 సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. ఇది సోనీ IMX480 సెన్సార్‌తో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. పీ3ఎక్స్ 5జీ f/1.8 ఎపర్చర్‌తో 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరాను, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్