Realme P3 : 20వేల బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్! రియల్మీ పీ3 లాంచ్ రేపే..
Realme P3 5G price : రియల్మీ పీ3 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధరలను సంస్థ వెల్లడించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రియల్మీ పీ3 5జీ స్మార్ట్‌ఫోన్ మార్చ్ 19న భారతదేశంలో లాంచ్కానుంది. అయితే, అధికారిక లాంచ్‌కి ముందు ఈ ఫోన్ ధర, అందుబాటులో ఉన్న ఆఫర్లు, దాని అద్భుతమైన స్పెసిఫికేషన్లకు సంబంధించిన కీలక వివరాలను కంపెనీ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ వివరాలను ఇక్కడ చూసేయండి..
రియల్మీ పీ3 5జీ- ధర, ఆఫర్లు..
రూ.20,000లోపు ధరలో లభించే రియల్మీ పీ1 5జీ బాటలోనే ఈ రియల్మీ పీ3 5జీ కూడా అందుబాటులోకి రానుంది. రియల్మీ పీ3 5జీ మూడు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. అవి.. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. కామెట్ గ్రే, నెబ్యులా పింక్, స్పేస్ సిల్వర్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ ప్రైజ్ పాయింట్లో ఈ గ్యాడ్జెట్స్ అట్రాక్టివ్‌గా ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
బ్యాంక్ ఆఫర్లతో వినియోగదారులు రూ.14,999 ప్రారంభ ధరతోనే ఈ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు!
రియల్మీ పీ3 5జీ సేల్ మార్చ్ 19న ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎర్లీ బర్డ్ సేల్ ఉంటుంది. రియల్మీ అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్, వివిధ రిటైల్ ఔట్లెట్స్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండనుంది.
అంతేకాదు, ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు బడ్స్ ఎయిర్ 5ను రూ.1,499కు, బడ్స్ వైర్లెస్ 5 ఏఎన్సీని రూ.1,599కే కొనుగోలు చేయవచ్చు. రియల్మీ కేర్ ప్లస్‌పై అదనంగా రూ.500 ఎక్స్ఛేంజ్ బోనస్, 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
రియల్మీ పీ3 5జీ: స్పెసిఫికేషన్లు- ఫీచర్లు (అంచనా)
రియల్మీ పీ3 5జీ స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 మినిట్ పీక్ బ్రైట్నెస్, 92.65 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది డిస్ప్లే క్వాలిటీకి మంచి ఆప్షన్ అవుతుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 5జీ చిప్సెట్తో ఈ ఫోన్ పనిచేస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఈ ఫోన్లో ఐపీ69-రేటింగ్ కూడా ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. ఏఐ మోషన్ కంట్రోల్, ఏఐ అల్ట్రా టచ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు తీవ్రమైన గేమింగ్ సెషన్ల సమయంలో సమర్థవంతమైన థర్మల్ మేనేజ్మెంట్ కోసం ఏరోస్పేస్-గ్రేడ్ వీసీ కూలింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో రియల్మీ గేమింగ్ అప్గ్రేడ్స్ని టీజ్ చేసింది.
ఇక లాంచ్ టైమ్‌కి ఈ రియల్మీ పీ3 5జీ స్మార్ట్‌ఫోన్ ఇతర ఫీచర్స్పై క్లారిటీ వస్తుంది.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
సంబంధిత కథనం