Realme Narzo 70X Discount : రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఇక లేట్ చేయకు బ్రో!-realme narzo 70x discount gets huge discount know this smart phone features and offer price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme Narzo 70x Discount : రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఇక లేట్ చేయకు బ్రో!

Realme Narzo 70X Discount : రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఇక లేట్ చేయకు బ్రో!

Anand Sai HT Telugu
Jan 23, 2025 11:30 AM IST

Realme Narzo 70X Discount : రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్లపై మంచి డిస్కౌంట్ లభిస్తోంది. తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారు ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. ఈ ఫోన్ మీద ఉన్న ఆఫర్స్ చూద్దాం..

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఆఫర్
రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఆఫర్

మార్కెట్‌లో రియల్‌మీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ తరచూ బంపర్ ఆఫర్లను ప్రకటిస్తుంది.. ప్రస్తుతానికి, రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ తక్కువ ధరలో దొరుకుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్ పొందవచ్చు. ఇది లాంచ్ ధర కంటే తక్కువ ధరకే వస్తుంది. ఈ ఫోన్ కొత్త ధర, ఆఫర్‌లు, ప్రత్యేకతలను ఇక్కడ చూడండి.

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ మూడు స్టోరేజ్ ఆప్షన్లలో విక్రయిస్తున్నారు. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100ప్లస్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 6.72 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 128జీబీ స్టోరేజ్ కూడా కలిగి ఉంది.

ఫోన్ ఫీచర్లు

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ 6.72-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1080 x 2400 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్‌ప్లేలో ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్షన్ 6100 ప్లస్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం మెయిల్ జీ57 జీపీయూ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0తో పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇందులో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ మొబైల్ 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం అందిస్తారు. నీరు, దుమ్ము నుండి రక్షణ కోసం స్మార్ట్‌ఫోన్ ఐపీ54 రేట్ పొందింది. ఇందులో రెయిన్ వాటర్ టచ్ ఫీచర్, ఎయిర్ గెస్చర్ ఫీచర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి.

ఆఫర్ వివరాలు

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్‌ను అమెజాన్‌లో భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ యొక్క 8జీబీ ర్యామ్ ప్లస్ 128 స్టోరేజ్ వేరియంట్ రూ. 13,999 వద్ద ఉంది. అంటే 26 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. క్యాష్ బ్యాక్ కూడా ఉంది.

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 10,498కి విక్రయిస్తోంది. అంటే 41 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫారెస్ట్ గ్రీన్ రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ ఆఫర్‌లన్నింటినీ పొందవచ్చు.

Whats_app_banner