Realme Discount : 50 ఎంపీ కెమెరా ఉండే ఈ రియల్‌మీ ఫోన్‌పై 42 శాతం డిస్కౌంట్.. కొనడానికి మంచి ఛాన్స్!-realme narzo 70x 5g gets 42 percentage discount know this smartphone affordable price and specifications ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme Discount : 50 ఎంపీ కెమెరా ఉండే ఈ రియల్‌మీ ఫోన్‌పై 42 శాతం డిస్కౌంట్.. కొనడానికి మంచి ఛాన్స్!

Realme Discount : 50 ఎంపీ కెమెరా ఉండే ఈ రియల్‌మీ ఫోన్‌పై 42 శాతం డిస్కౌంట్.. కొనడానికి మంచి ఛాన్స్!

Anand Sai HT Telugu
Jan 05, 2025 10:00 PM IST

Realme Discount : రియల్‌మీ లవర్స్‌ కోసం మంచి ఆఫర్ నడుస్తోంది. రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ కొనుగోలుపై సూపర్ డిస్కౌంట్ నడుస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం..

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ డిస్కౌంట్
రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ డిస్కౌంట్

రియల్‌మీ లవర్స్ కోసం అమెజాన్‌లో సూపర్ ఆపర్ నడుస్తుంది. రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీపై భారీ డిస్కౌంట్ ఉంది. ఫోన్ కొనుగోలుపై 42 శాతం తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ కొత్త ధర, ఆఫర్లు, ప్రత్యేక ఫీచర్లను తెలుసుకుందాం.

yearly horoscope entry point

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్ 6.72 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 128జీబీ స్టోరేజ్, 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ ఆప్షన్లలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్‌లో 11,000 కంటే తక్కువ ధరకు దీనిని కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1080 x 2400 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ సపోర్ట్ ఇస్తుంది. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. గ్రాఫిక్స్ కోసం ఇది మెయిల్ జీ57 జీపీయూని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత రియల్‌మీ యూఐ 5.0తో పనిచేస్తుంది.

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ర్యామ్‌ని పెంచడానికి డైనమిక్ సపోర్ట్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇందులో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది. నీరు, దుమ్ము నుండి రక్షణ కోసం ఐపీ54 రేట్‌తో వస్తుంది. ఇందులో రెయిన్ వాటర్ టచ్ ఫీచర్, ఎయిర్ గెస్చర్ ఫీచర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి.

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో విక్రయిస్తున్నారు. దీన్ని 4జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌తో కొనుగోలు చేయవచ్చు. 6జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీపై 42 శాతం డిస్కౌంట్ నడుస్తోంది. అంటే మీరు ఈ ఫోన్‌ను రూ.10,499కి కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ.17,999గా ఉంది.

ఆర్బీఎల్ కార్డుల ద్వారా అదనపు తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఐస్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో ఈ ఆఫర్‌లు పొందవచ్చు.

Whats_app_banner