Realme GT5 pro : అదిరిపోయే ఫీచర్స్​తో రియల్​మీ జీటీ5 ప్రో.. లాంచ్​ ఎప్పుడు?-realme gt5 pro features leaked before launch see details ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Realme Gt5 Pro Features Leaked Before Launch See Details

Realme GT5 pro : అదిరిపోయే ఫీచర్స్​తో రియల్​మీ జీటీ5 ప్రో.. లాంచ్​ ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu
Nov 10, 2023 06:33 AM IST

Realme GT5 pro features : రియల్​మీ జీటీ5 ప్రో ఫీచర్స్​ లీక్​ అయ్యాయి. లాంచ్​ డేట్​ గురించి ఓ అప్డేట్​ ఉంది. ఆ వివరాలు..

రియల్​మీ జీటీ5 ప్రో ఫీచర్స్​ లీక్​..!
రియల్​మీ జీటీ5 ప్రో ఫీచర్స్​ లీక్​..!

Realme GT5 pro : రియల్​మీ సంస్థ నుంచి జీటీ5 ప్రో పేరుతో ఒక కొత్త స్మార్ట్​ఫోన్​ రాబోతోంది. 2023 చివరి నాటికి ఈ మోడల్​ లాంచ్​ అవుతుందని సమాచారం. అయితే, లాంచ్​కి ముందే, ఈ మోడల్​ ఫీచర్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. వీటితో పాటు సంస్థ కూడా కొన్ని టీజర్స్​ వదిలింది. ఫలితంగా.. ఈ గ్యాడ్జెట్​కు సంబంధించిన కీలక ఫీచర్స్​పై క్లారిటీ వచ్చేసింది. ఆ వివరాలు..

ట్రెండింగ్ వార్తలు

రియల్​మీ జీటీ5 ప్రో ఫీచర్స్​ ఇవేనా..?

త్వరలో లాంచ్​ కాబోతున్న రియల్​మీ జీటీ5 ప్రోలో క్వాల్కమ్​ లేటెస్ట్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 చిప్​సెట్​ ఉంటుంది. ఎల్​పీడీడీఆర్​5 ర్యామ్​, 1టీబీ యూఎఫ్​ఎస్​ 4.0 స్టోరేజ్​ ఉండనున్నాయి. రియల్​మీ జీటీ3లో ఉన్నట్టుగానే.. ఈ కొత్త స్మార్ట్​ఫోన్​లో కూడా 240వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఈ మోడల్​లో 5,400 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుందని లీక్స్​ సూచిస్తున్నాయి. 50వాట్​ వయర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్​ కూడా లభిస్తుందట.

Realme GT5 pro price in India : ఈ రియల్​మీ జీటీ5 ప్రోలో 50ఎంపీ సోనీ లైటియా ఎల్​వైటీ808 ప్రైమరీ, 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్​890 టెలిఫొటో, 8ఎంపీ అల్ట్రా-వైడ్​ లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా ఉండనుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోందని టాక్​!

ఈ రియల్​మీ కొత్త స్మార్ట్​ఫోన్​లో 6.78 ఇంచ్​ కర్వ్​డ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉండొచ్చు. అండర్​ డిస్​ప్ల ఫింగర్​ప్రింట్​ స్కానర్​ లభిస్తుంది. 161.6x75.1x9.2mm మెజర్​మెంట్​లో ఈ మోడల్​ వస్తుంది. దీని బరువు 220గ్రాములు అని సమాచారం.

Realme GT5 pro release date India : కాగా.. ఈ మోడల్​ లాంచ్​ డేట్​ను సంస్థ ఇంకా ప్రకటించలేదు. ఇండియా లాంచ్​ గురించి కూడా ఇంకా వెల్లడించలేదు. లాంచ్​ సమయం దగ్గర పడుతున్న కొద్ది.. ఈ రియల్​మీ జీటీ5 ప్రో ఇతర ఫీచర్స్​, ధర వంటి వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. లీక్​ అయిన ఫీచర్స్​ని చూస్తుంటే.. ఈ గ్యాడ్జెట్​ ధర.. బడ్జెట్​ ఫ్రెండ్లీ కన్నా కాస్త ఎక్కువ ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

5జీ స్మార్ట్​ఫోన్​ కొనాలా..?

కొత్తగా ఒక 5జీ స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? కొనే మొబైల్​.. బడ్జెట్​ ఫ్రెండ్లీగా ఉండాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో లభిస్తున్న ది బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ ఇదిగో..

సామ్​సంగ్​ గెలాక్సీ ఎం14 5జీ:- ఇందులో ఎక్సినోస్​ 1330 ఆక్టా కోర్​ 2.4 జీహెచ్​జెడ్​ ప్రాసెసర్​ ఉంటుంది. 6.6 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే, 6000 ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 50ఎంపీ ట్రిపుల్​ రేర్​ కెమెరా, 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఇందులో ఉంటుంది. ఈ మొబైల్​ ధర రూ. 18,990గా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం