మిడ్ ప్రీమియం సెగ్మెంట్లో, డైమెన్సిటీ 9400ఈ ప్రాసెసర్ తో రియల్మీ జీటీ 7 లాంచ్-realme gt 7 with mediatek dimensity 9400e chip launched in india price is ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మిడ్ ప్రీమియం సెగ్మెంట్లో, డైమెన్సిటీ 9400ఈ ప్రాసెసర్ తో రియల్మీ జీటీ 7 లాంచ్

మిడ్ ప్రీమియం సెగ్మెంట్లో, డైమెన్సిటీ 9400ఈ ప్రాసెసర్ తో రియల్మీ జీటీ 7 లాంచ్

Sudarshan V HT Telugu

రియల్మీ అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రియల్మీ జీటీ 7 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయింది. రూ.39,999 ధరకు ఈ స్మార్ట్ ఫోన్ వినియోగ దారులకు లభ్యం కానుంది. రియల్ మీ జీటీ 7 లో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9400ఈ ప్రాసెసర్, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.

రియల్మీ జీటీ 7 లాంచ్

రియల్మీ తన జీటీ సిరీస్ లో మరో స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. ఈ సరికొత్త డివైజ్ రియల్మీ జీటీ 7 మిడ్-ప్రీమియం ధర సెగ్మెంట్ ను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సెగ్మెంట్ లో ఇటీవల లాంచ్ అయిన ఐక్యూ నియో 10, వన్ ప్లస్ 13 ఆర్, రాబోయే వన్ ప్లస్ 13ఎస్ మొదలైన పాపులర్ మోడల్స్ ఉన్నాయి.

రియల్ మీ జీటీ 7 ధర

రియల్మీ జీటీ 7 స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ /256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. 12 జీబీ ర్యామ్ /256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,999 గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ /512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.46,999. అమెజాన్, రియల్మీ అధికారిక వెబ్సైట్, ఆఫ్ లైన్ స్టోర్ల ద్వారా మే 30 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ప్రీ-బుకింగ్స్ మే 27 నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రీ-బుక్ చేసుకున్న వినియోగదారులకు ఒక సంవత్సరం ఉచిత స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ లభిస్తుంది.

రియల్ మీ జీటీ 7 స్పెసిఫికేషన్లు

  • రియల్ మీ జీటీ 7లో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే, 6,000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, ఆర్మర్ షెల్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఇది నీరు మరియు ధూళి నిరోధకత కోసం ఐపి 69 రేటింగ్ తో వస్తుంది. అంటే ఇది 30 నిమిషాల పాటు 1.5 మీటర్ల లోతున నీటిలో ఉన్నా, ఏ దిశ నుండి అయినా వేడి లేదా చల్లని నీటి జెట్లను అయినా తట్టుకోగలదు.
  • రియల్మీ జీటీ 7లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400ఈ ప్రాసెసర్, జీ720 ఎంసీ12 జీపీయూ ఉన్నాయి. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ను ఇందులో అందించారు.
  • ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్ మీ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. మూడేళ్ల ఓఎస్ అప్డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ లు ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.
  • రియల్మీ జీటీ 7లో 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
  • రియల్మీ జీటీ 7లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 906 ప్రైమరీ సెన్సార్ విత్ ఓఐఎస్, 50 మెగాపిక్సెల్ 2ఎక్స్ టెలిఫోటో లెన్స్ విత్ ఓఐఎస్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం