రియల్‌మీ భారతదేశంలో తన జీటీ 7 సిరీస్‌కు కొత్త స్మార్ట్‌ఫోన్‌ని ఇటీవలే విడుదల చేసింది. ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన రియల్‌మీ జీటీ 7 ప్రోతో మంచి గుర్తింపు పొందిన తర్వాత, ఇప్పుడు కంపెనీ ఈ సిరీస్ కింద రియల్‌మీ జీటీ 7 అనే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 9400ఈ చిప్‌తో పర్ఫార్మెన్స్ విభాగంలోకి ప్రవేశించింది. అయితే, సుమారు రూ. 40,000 ధరలో ప్రీమియం ఫీచర్లు, పర్ఫార్మెన్స్‌ను అందించే పలు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఉన్నాయి. అటువంటి ప్రముఖ మిడ్-రేంజ్ ఫోన్‌లలో ఒకటి.. ఈ ఏడాది జనవరిలో విడుదలైన కొత్త వన్‌ప్లస్ 13ఆర్. ఈ నేపథ్యంలో కొత్త రియల్‌మీ జీటీ 7 అంచనాలకు తగ్గట్టుగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి, వన్‌ప్లస్ 13ఆర్ స్మార్ట్‌ఫోన్‌తో పోల్చి చూద్దాము..
రియల్‌మీ జీటీ 7 స్మార్ట్‌ఫోన్ దాని ఫ్లాగ్‌షిప్ మోడల్ రియల్‌మీ జీటీ 7 ప్రో నుంచి స్ఫూర్తి పొంది, స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. ఇది ఐస్‌సెన్స్ గ్రాఫేన్ బ్యాక్ ప్యానెల్, లేజర్-ఎచెడ్ ఫ్రేమ్‌ను కలిగి ఉండి, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ఇది నీటి నుంచి రక్షణ కోసం ఐపీ69 రేటింగ్‌ను, ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్‌ను కూడా కలిగి ఉంది. మరోవైపు, వన్‌ప్లస్ 13ఆర్ మ్యాట్-ఫినిష్డ్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్, అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఇది దాని ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల మాదిరిగానే ఉంటుంది. అయితే, తక్కువ ఐపీ65 రేటింగ్ కారణంగా ఇది రియల్‌మీ జీటీ 7 అంత మన్నికైనది కాదు!
డిస్‌ప్లే విషయానికి వస్తే, రియల్‌మీ జీటీ 7 6.78-ఇంచ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. కాగా, వన్‌ప్లస్ 13ఆర్ 6.78-ఇంచ్ ఎల్టీపీఓ 4.1 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 4500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందిస్తుంది.
రియల్‌మీ జీటీ 7 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ంఎంపీ సోనీ ఐఎంఎక్స్906 మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ శాంసంగ్ S5KJN5 టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. మరోవైపు, వన్‌ప్లస్ 13ఆర్ కూడా ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50ఎంపీ సోనీ ఎల్వైటీ700 మెయిన్ కెమెరా, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ శాంసంగ్ S5KJN5 టెలిఫోటో లెన్స్, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు- వీడియో కాల్స్ కోసం, రియల్‌మీ జీటీ 7 స్మార్ట్‌ఫోన్ 32ఎంపీ ఫ్రెంట్ కెమెరాను కలిగి ఉండగా, వన్‌ప్లస్ 13ఆర్‌లో 16ఎంపీ సెల్ఫీ షూటర్ ఉంది.
రియల్‌మీ జీటీ 7 మీడియాటెక్ డైమెన్సిటీ 9400ఈ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 12జీబీ వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. వన్‌ప్లస్ 13ఆర్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఇది 16జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. కాబట్టి, రెండు ఫోన్‌లు ప్రీమియం పర్ఫార్మెన్స్‌ను, రోజూవారీ వాడకంలో సాఫీగా పనిచేసే అనుభవాన్ని అందిస్తాయి.
చివరగా, రియల్‌మీ జీటీ 7 స్మార్ట్‌ఫోన్ 7000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. కాగా వన్‌ప్లస్ 13ఆర్ 6000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రియల్‌మీ 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది, వన్‌ప్లస్ 80వాట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
సంబంధిత కథనం