Raksha Bandhan gifts: రాఖీ కి ఇవ్వడానికి మంచి గిఫ్ట్ కోసం చూస్తున్నారా?.. ఇవి చూడండి..-realme c63 5g iqoo z9 lite 5g and more tech gifts under rs 15 000 for raksha bandhan ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Raksha Bandhan Gifts: రాఖీ కి ఇవ్వడానికి మంచి గిఫ్ట్ కోసం చూస్తున్నారా?.. ఇవి చూడండి..

Raksha Bandhan gifts: రాఖీ కి ఇవ్వడానికి మంచి గిఫ్ట్ కోసం చూస్తున్నారా?.. ఇవి చూడండి..

HT Telugu Desk HT Telugu
Aug 16, 2024 09:15 PM IST

Raksha Bandhan gifts: అన్నా చెల్లెళ్లు, లేదా అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్. రాఖీ కట్టిన సహోదరికి తమ స్థాయికి తగ్గట్లు బహుమతి ఇవ్వడం ఆనవాయితీ. ఈ రాఖీకి మీ సహోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, ఈ కింది లిస్ట్ చూడండి..

రాఖీ కి ఇవ్వడానికి మంచి గిఫ్ట్ కోసం చూస్తున్నారా?.. ఇవి చూడండి.
రాఖీ కి ఇవ్వడానికి మంచి గిఫ్ట్ కోసం చూస్తున్నారా?.. ఇవి చూడండి. (Amazon)

Raksha Bandhan gifts: మరో రెండు రోజుల్లో రాఖీ పండుగ వస్తోంది. రాఖీకి మీ సహోదరికి లేదా సహోదరుడికి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా?.. రూ. 10 వేల లోపు ధరలో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్, ఇతర గాడ్జెట్స్ ను మీ కోసం లిస్ట్ చేశాం.. చూడండి..

రూ. 10 వేల ధరలో బెస్ట్ టెక్ గిఫ్ట్స్

ప్రస్తుతం, మంచి ఫీచర్స్, మెరుగైన పనితీరు, అవసరమైన సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ కొనాలంటే కనీసం రూ. 10 వేలు పెట్టాల్సిందే. అందుకే రూ. 10 వేల లోపు లభించే బెస్ట్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను మీ కోసం తీసుకువచ్చాం..

రియల్మీ సీ63 5జీ

రూ. 10 వేల లోపు ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లో రియల్మీ సీ63 5జీ ఒకటి. ఈ స్మార్ట్ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ చిప్సెట్, 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. వెనకవైపు 108 మెగాపిక్సెల్ ప్రోలైట్ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. రియల్మీ (realme) సీ63 5జీ 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ స్టోరేజ్ వేరియంట్లలో అమెజాన్ లో కేవలం రూ.8,663 ధరకు లభిస్తుంది.

ఐక్యూ జెడ్ 9 లైట్ 5G

ఐక్యూ జెడ్ 9 లైట్ (iQOO Z9 Lite) 5 జీ స్మార్ట్ ఫోన్ సరసమైన ధరలో సొగసైన డిజైన్ తో వస్తుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.56 అంగుళాల డిస్ ప్లేను ఇందులో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్, 15వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 50 మెగాపిక్సెల్ సోనీ ఏఐ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా సెన్సార్ తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ మోచా బ్రౌన్, ఆక్వా ఫ్లో రంగుల్లో అమెజాన్ లో రూ.10,499 ధరకు లభిస్తుంది.

రెడ్ మీ 13సీ 5జీ

రెడ్మి (redmi) 13 సీ 5 జి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో అద్భుతమైన ఫీచర్లను అందించే మరొక స్మార్ట్ ఫోన్. 6.74 అంగుళాల డాట్ డ్రాప్ డిస్ ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను ఈ స్మార్ట్ ఫోన్ అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5జీ ప్రాసెసర్, 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. వెనకవైపు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ ఏఐ కెమెరా సెటప్, సెల్ఫీలు దిగేందుకు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.10,499 గా నిర్ణయించారు. అమెజాన్ లో స్టార్లైట్ బ్లాక్, స్టార్ట్రైల్ గ్రీన్, స్టార్ట్రైల్ సిల్వర్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

హానర్ ఛాయిస్ వాచ్

హానర్ (honor) ఛాయిస్ వాచ్ అల్ట్రా-థిన్ లార్జ్ డిస్ప్లే, ఇన్-బిల్ట్ జిపిఎస్, వన్-క్లిక్ ఎస్ఓఎస్ కాలింగ్ తో వస్తుంది. దీన్ని హానర్ హెల్త్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది 5ఎటిఎమ్ వాటర్ రెసిస్టెంట్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది మరియు ఈత కొట్టేటప్పుడు మరియు ఇతర అవుట్ డోర్ కార్యకలాపాల సమయంలో మన్నికైనది. ఈ వాచ్ ఎస్ పిఓ2, స్ట్రెస్ మానిటర్ మరియు అడ్వాన్స్ డ్ స్లీప్ క్వాలిటీ మానిటర్ వంటి వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ట్రాక్ చేస్తుంది. ఇందులో 1.95 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే, 410×502 పిక్సెల్ రిజల్యూషన్ ను అందించారు. ఇది 550 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను అందిస్తుంది. అమెజాన్ లో ఇది రూ.4,999 ధరకు లభిస్తుంది.

హానర్ ఛాయిస్ ఇయర్ బడ్స్ ఎక్స్5

హానర్ ఛాయిస్ ఇయర్ బడ్స్ ఎక్స్5లో 30డీబీ ఏఎన్ సీతో కూడిన ఆడియో ఉంది. హానర్ ఏఐ స్పేస్ ద్వారా స్విచ్చింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ డివైజ్ కాల్స్ పై స్పష్టమైన సంభాషణలు చేయడానికి డ్యూయల్ మైక్రోఫోన్ ఈఎన్ సీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల నాన్ స్టాప్ మ్యూజిక్ తో కూడిన 35 గంటల బ్యాటరీ లైఫ్ ను ఈ డివైజ్ అందిస్తుంది. హానర్ ఛాయిస్ ఇయర్ బడ్స్ ను అమెజాన్ లో రూ.1,699 ధరకు కొనుగోలు చేయవచ్చు.