Realme 14 Pro series launch: రేపే రియల్మీ 14 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్
రియల్మీ తన మిడ్ రేంజ్ రియల్మీ 14 ప్రో సిరీస్, బడ్స్ వైర్లెస్ 5 ఇయర్ ఫోన్లను జనవరి 16న భారత్ లో లాంచ్ చేయనుంది. మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లో స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది.
రియల్మీ తన మిడ్ రేంజ్ రియల్మీ 14 ప్రో సిరీస్ ను జనవరి 16 గురువారం ఒక ఈవెంట్లో భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈ ఈవెంట్ లోనే కంపెనీ తన బడ్స్ 5 వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ ను కూడా లాంచ్ చేయనుంది.
రియల్మీ 14 ప్రో సిరీస్ లాంచ్ వివరాలు
రియల్మీ 14 ప్రో సిరీస్ లో రియల్మీ 14 ప్రో, రియల్మీ 14 ప్రో ప్లస్ స్మార్ట్ఫోన్ మోడల్స్ ఉన్నాయి. ఇవి రేపు మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో లాంచ్ కానున్నాయి. ఈ కార్యక్రమాన్ని కంపెనీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
రియల్ మీ 14 ప్రో సిరీస్ స్పెసిఫికేషన్లు (అంచనా):
రియల్ మీ 14 ప్రో ప్లస్ సిరీస్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. రియల్మీ 14 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.83 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ ఉండే అవకాశం ఉంది. అలాగే, స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 12 జీబీ వరకు LPDDR4X ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉన్నాయి. రియల్ మీ (realme) యూఐ 6.0 ఆధారిత ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
కెమెరా
50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 896 ప్రైమరీ షూటర్ విత్ ఓఐఎస్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 3ఎక్స్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 6ఎక్స్ సెన్సార్ జూమ్తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. వీటిలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపి 66, ఐపి 68, ఐపి 69 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఉన్నాయి. ఇందులో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇదిలా ఉంటే రియల్ మీ 14 ప్రోకు సంబంధించి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.మరి దీనిపై క్లారిటీ రావాలంటే రేపు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
రియల్ మీ 14 ప్రో ప్లస్ ధర (అంచనా):
రియల్ మీ 14 ప్రో ప్లస్ 12 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,599 యువాన్లుగానూ, 12 జీబీ ర్యామ్ / 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,799 యువాన్లుగానూ ఉంది. భారత్ లో వీటి ధరలు వరుసగా రూ. 30 వేలు, రూ. 33 వేలు ఉండవచ్చు.