Realme 14 Pro Plus: రియల్మీ తన రియల్మీ 14 ప్రో ప్లస్ లైనప్ ను భారతదేశంలో విస్తరించింది. కొత్తగా రియల్మీ 14 ప్రో ప్లస్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను లాంచ్ చేసింది. రియల్మీ 14 ప్రో ప్లస్ లో 8 జీబీ +128 జీబీ, 8 జీబీ + 256 జీబీ, 12 జీబీ + 256 జీబీ కాన్ఫిగరేషన్ల వేరియంట్లను జనవరిలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా 12 జీబీ + 512 వేరియంట్ స్టోరేజ్ ను ప్రవేశపెట్టింది. ఇది డేటా కోసం ఎక్కువ స్థలం అవసరమయ్యే వినియోగదారుల కోసం ఉద్దేశించినది.
కొత్త రియల్మీ 14 ప్రో ప్లస్ 512 జీబీ వేరియంట్ ధర రూ.37,999. రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ తో రూ.34,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ వేరియంట్ మొదటి సేల్ మార్చి 6 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్, రియల్మీ ఇండియా వెబ్సైట్, ఇతర ఆఫ్ లైన్ స్టోర్లలో లభిస్తుంది. రియల్ మీ 14 ప్రో ప్లస్ లైనప్ లోని ఇతర వేరియంట్ల ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
512 జీబీ వేరియంట్ పెర్ల్ వైట్, సూడ్ గ్రే అనే రెండు రంగుల్లో లభిస్తుంది. ఇతర వేరియంట్లు పెర్ల్ వైట్, సూడ్ గ్రే, బికనీర్ పర్పుల్ అనే మూడు రంగుల్లో లభిస్తాయి.
రియల్ మీ 14 ప్రో ప్లస్ లో 1.5 కె రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో 6.83 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్ మీ యూఐ 6 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్ సెట్ తో పనిచేస్తుంది. రియల్మీ 14 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 896 ప్రైమరీ సెన్సార్ విత్ ఓఐఎస్ సపోర్ట్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్తో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
ఎల్పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్, యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇచ్చే 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు ఐపి 68/69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఈ స్మార్ట్ ఫోన్ లోని అదనపు ఫీచర్లు. కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీలను సపోర్ట్ చేస్తుంది.
సంబంధిత కథనం