Realme 13 vs Realme 12 : రియల్​మీ 13 వర్సెస్​ రియల్​మీ 12.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?-realme 13 vs realme 12 know whats new in latest mid range smartphone ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme 13 Vs Realme 12 : రియల్​మీ 13 వర్సెస్​ రియల్​మీ 12.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?

Realme 13 vs Realme 12 : రియల్​మీ 13 వర్సెస్​ రియల్​మీ 12.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?

Sharath Chitturi HT Telugu
Aug 31, 2024 10:24 AM IST

Realme 13 vs Realme 12 : రియల్​మీ 13 వర్సెస్​ రియల్​మీ 12.. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో కనిపించే మార్పులు ఏంటి? కొత్త గ్యాడ్జెట్​ కొనొచ్చా? లేక పాతదే బెటర్​ ఆ? ఇక్కడ తెలుసుకోండి..

రియల్​మీ 13 వర్సెస్​ రియల్​మీ 12..
రియల్​మీ 13 వర్సెస్​ రియల్​మీ 12.. (Realme)

రియల్​మీ 12 సిరీస్ తర్వాత మిడ్ రేంజ్ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో రియల్​మీ 13 సిరీస్ ఈ వారం లాంచ్ అయింది. మీరు లేటెస్ట్ రియల్​మీ 13ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఏ అప్​గ్రేడ్స్​ ఇంటిగ్రేట్ అయ్యాయి? ఇది కొనడానికి విలువైనదా? కాదా? అని స్పష్టమైన అవగాహన పొందడానికి, మేము రియల్​మీ 12 - రియల్​మీ 13 మధ్య వివరణాత్మక స్పెసిఫికేషన్స్​ పోలికను సేకరించాము. అందువల్ల, కొనుగోలుదారులు కొత్తదాన్ని సులభంగా పరిశీలించవచ్చు.

రియల్​మీ 13 వర్సెస్ రియల్​మీ 12:

డిజైన్- డిస్​ప్లే: రియల్​మీ 13- రియల్​మీ 12 ఒకే రకమైన డిజైన్ కాన్సెప్ట్​ను కలిగి ఉన్నాయి. అయితే, రియల్​మీ 13 బ్యాక్​ ప్యానెల్​పై టెక్స్చర్​ కలిగి ఉన్న డ్యూయెల్ టోన్ డిజైన్​తో వస్తుంది. డస్ట్​-వాటర్​ రెసిస్టెన్స్​ కోసం ఐపీ రేటింగ్ ప్రొటెక్షన్​ను ఐపీ54 నుంచి ఐపీ64కు అప్​గ్రేడ్ చేశారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.72 ఇంచ్​ ఫుల్​హెచ్​డీ+ ఐపీఎస్ ఎల్​సీడీ డిస్​ప్లేని ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​ అందిస్తున్నాయి. అందువల్ల, రెండు ఒకే విధమైన డిస్​ప్లే టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఒక అనుభవాన్నిఇస్తాయి.


కెమెరా: కెమెరా పరంగా, అనేక మార్పులు​ జరిగాయి. మెగాపిక్సల్ విషయానికి వస్తే రియల్​మీ 13 డౌన్​గ్రేడ్స్​ ఎదుర్కొంది. రియల్​మీ 13లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ ఉండగా, రియల్​మీ 12లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అయితే, కొత్త తరంతో, మీరు ఓఐఎస్ సపోర్ట్- 1440పీ వీడియో క్వాలిటీని పొందొచ్చు. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో 2 మెగాపిక్సెల్ బోకే కెమెరా ఉంది. అయితే రియల్​మీ 13లో సెల్ఫీ కెమెరాను 8 ఎంపీ నుంచి 16 ఎంపీకి అప్​గ్రేడ్ చేశారు.


పర్ఫార్మెన్స్​- బ్యాటరీ: పనితీరు కోణంలో, రియల్​మీ 13 8 జీబీ ర్యామ్​తో కనెక్ట్​ చేసిన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్ఓసితో పనిచేస్తుంది. మరోవైపు, రియల్​మీ 12లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్​సెట్​తో పాటు 6 జీబీ ర్యామ్ ఉంది. అందువల్ల, రియల్​మీ ప్రాసెసర్​, ర్యామ్ పరంగా గణనీయమైన పర్ఫార్మెన్స్​ అప్​గ్రేడ్స్​ ఇంటిగ్రేట్ చేసింది.

బ్యాటరీ పరంగా, రెండు స్మార్ట్​ఫోన్స్​లో 45 వాట్ విఓఓసి ఛార్జింగ్ సపోర్ట్​తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటాయి.


ధర: ఇప్పుడు ధరల కోణంలో చూస్తే, రియల్​మీ ధరను రూ.1000 పెంచింది. కాబట్టి రియల్​మీ 13 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.17,999గా ఉంది. రియల్​మీ 12 6 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్​లో అందుబాటులో ఉంది. టెక్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం వాట్సాప్​లో హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి.

సంబంధిత కథనం