Realme 12 launch: ఇండియన్ మార్కెట్లోకి రియల్ మి 12, రియల్ మి 12+ 5జీ; ధర ఎంతంటే..?
Realme 12 launch:ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మి లేటెస్ట్ గా, మార్చి 6న భారత్ లో రియల్ మి 12, రియల్ మి 12 ప్లస్ స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేసింది. ఇవి 5 జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తాయి. ఇవి రియల్ మి యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తాయి. వీటిలో రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ కూడా ఉంది.
Realme 12+ 5G launch రియల్ మి తన మిడ్ రేంజ్ రియల్ మి 12 5జీ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను రూ.16,999 ప్రారంభ ధరతో భారత్ లో లాంచ్ చేసింది. ఈ రియల్ మి 12 5జీ, రియల్ మి 12 ప్లస్ స్మార్ట్ ఫోన్లు రూ.25,000 లోపు ధర సెగ్మెంట్లో పోటీని మరింత పెంచే రియల్ మీ 12 5 జీ, రియల్ మీ 12+ 5 జీ ఫోన్స్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత తాజా రియల్ మీ యుఐ 5.0 కస్టమ్ యుఐపై పనిచేస్తాయి. ఈ డివైజ్ లతో 2 సంవత్సరాల ఓఎస్ అప్ డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ లను కూడా రియల్ మీ ఆఫర్ చేస్తోంది.
రియల్ మి 12 5జీ, రియల్మీ 12+ 5జీ ధరలు
రియల్ మి 12 5జీ (Realme 12 5G) 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999, 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 గా కంపెనీ నిర్ణయించింది. రియల్ మి 12 5జీ స్మార్ట్ ఫోన్ వుడ్ ల్యాండ్ గ్రీన్, ట్విలైట్ పర్పుల్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. రియల్ మి 12+ 5జీ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999 కాగా, 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ నావిగేటర్ బీజ్, పయనీర్ గ్రీన్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ లేదా Realme.com ద్వారా ఈ రెండు స్మార్ట్ ఫోన్లను మార్చి 6 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
రియల్ మి 12+ 5జీ స్పెసిఫికేషన్లు
రియల్ మి 12+ 5జీ (Realme 12+ 5G launch) స్మార్ట్ ఫోన్లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో, 2000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్ నెస్ తో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. రియల్ మి 12+ 5జీ స్మార్ట్ రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫీచర్ వల్ల తడి చేతులతో కూడా ఫోన్ ను సునాయాసంగా ఆపరేట్ చేయవచ్చు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్ ను అమర్చారు.
కెమెరా ఫీచర్స్
కెమెరా విషయానికొస్తే, రియల్ మి 12+ 5జీ (Realme 12+ 5G) లో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్ వై టీ -600 ప్రైమరీ సెన్సార్ ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ తో పాటు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ను 67వాట్ల సూపర్ వూక్ ఛార్జర్ ద్వారా వేగంగా ఛార్జ్ చేయవచ్చు. రియల్మీ 12+ ఐపి 54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ను సపోర్ట్ చేస్తుంది.
రియల్మీ 12 5 జి స్పెసిఫికేషన్లు
రియల్ మి 12 5 జీ (Realme 12 5G) స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో, 2400*1800 పిక్సెల్స్ రిజల్యూషన్ తో 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ + డిస్ ప్లే ను కలిగి ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీ, మాలి జీ57 జీపీయూ ఆపరేటింగ్ సిస్టంలను పొందుపర్చారు. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. వీటిలో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ అవసరాలను తీర్చడానికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది.