Realme 10 Pro+ Price in India: ఇండియాలో రియల్‍మీ 10 ప్రో+ ధర ఎలా ఉంటుందంటే! హింట్ ఇచ్చిన రియల్‍మీ బాస్-realme 10 pro plus 5g price in india teased by madhav seth ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Realme 10 Pro Plus 5g Price In India Teased By Madhav Seth

Realme 10 Pro+ Price in India: ఇండియాలో రియల్‍మీ 10 ప్రో+ ధర ఎలా ఉంటుందంటే! హింట్ ఇచ్చిన రియల్‍మీ బాస్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 27, 2022 03:59 PM IST

Realme 10 Pro Plus 5G price in India: రియల్‍మీ 10 ప్రో+ 5జీ స్మార్ట్ ఫోన్ ధర ఏ రేంజ్‍లో ఉండనుందో తెలిసిపోయింది. రియల్‍మీ ఇండియా బాస్.. ఈ ఫోన్ ధర విషయంలో హింట్ ఇచ్చారు.

Realme 10 Pro+ 5G Price in India:  ఇండియాలో రియల్‍మీ 10 ప్రో+ ధర ఎలా ఉంటుందంటే! (Photo: Realme)
Realme 10 Pro+ 5G Price in India: ఇండియాలో రియల్‍మీ 10 ప్రో+ ధర ఎలా ఉంటుందంటే! (Photo: Realme)

Realme 10 Pro+ Price in India: రియల్‍మీ 10 ప్రో+ 5జీ ఫోన్‍పై ఇప్పుడు అందరి కళ్లు ఉన్నాయి. ఇటీవల చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్.. ఇండియాకు వచ్చేస్తోంది. డిసెంబర్ 8వ తేదీన భారత్‍లో అడుగుపెట్టనుంది. ముఖ్యంగా కర్వ్డ్ అమోలెడ్ డిస్‍ప్లే అదిరిపోయేలా ఉంది. ఇలాంటి డిస్‍ప్లే ఉన్న మొబైల్ మిడ్ రేంజ్‍లో రావడం ఇదే తొలిసారి కానుంది. రియల్‍మీ 10 ప్రో+ మిగిలిన స్పెసిఫికేషన్లు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. దీంతో ఇండియాలో ఈ ఫోన్ ధర ఎలా ఉంటుంది.. అన్న ఆసక్తి చాలా మందిలో ఉంది. ఈ తరుణంలో రియల్‍మీ ఇండియా సీఈవో, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేత్ (Madhav Seth) ఓ హింట్ ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ ఏ రేంజ్ లోపు ఉంటుందో చెప్పారు. దీంతో అంచనా ధరలు కూడా వెలువడుతున్నాయి. ఆ వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

ఆ రేంజ్‍లోనే..

Realme 10 Pro plus 5G Price in India: రియల్‍మీ 10 ప్రో+ లాంచ్‍తో పాటు వివిధ వివరాల గురించి ఇటీవల ట్విట్టర్‍ ద్వారా మాట్లాడారు రియల్‍మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేత్. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే రియల్‍మీ 10 ప్రో+ ధర విషయంలో స్పందించారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.25,000లోపే ఉంటుందని వెల్లడించారు. దీంతో ఈ రేంజ్‍లో కర్వ్ అమోలెడ్ డిస్‍ప్లేను కలిగి ఉన్న తొలి ఫోన్ ఇదే కానుంది.

మాధవ్ సేత్ హింట్ ఇవ్వడంతో రియల్‍మీ 10 ప్రో+ ధర ఇండియాలో రూ.24,999తో ప్రారంభం అవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి.

చైనాలో ఇలా..

Realme 10 Pro plus 5G Price: 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ఉన్న రియల్‍మీ 10 ప్రో+ బేస్ వేరియంట్ ధర చైనాలో 1,699 యువాన్లు (సుమారు రూ.19,500)గా ఉంది. అయితే సాధారణంగా చైనాతో పోలిస్తే స్మార్ట్ ఫోన్‍ల ధరలు భారత్‍లో కాస్త ఎక్కువగా ఉంటాయి. రూపాయి మారకం విలువ, రవాణా ఖర్చులతో కలిపి చైనీస్ కంపెనీలు.. మొబైళ్లను ఇండియాలో విక్రయిస్తాయి. అయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బడ్జెట్ ఫోన్‍లను అందించేందుకు రియల్‍మీ పోటీ పడుతూనే ఉంటుంది. స్పెసిఫికేషన్లు బట్టి చూస్తే భారత్‍లో రూ.25,000లోపు రియల్‌మీ 10 ప్రో+ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.

కర్వ్ ఎడ్జెస్ డిస్‍ప్లేతో..

Realme 10 Pro+ Details: రియల్‍మీ 10 ప్రో+ 5జీకి ప్రధాన ఆకర్షణ డిస్‍ప్లే. 6.7 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ సూపర్ అమోలెడ్ కర్వ్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ వస్తుంది. అంటే ఈ డిస్‍ప్లే అంచులు ఫ్లాట్ గా కాకుండా కర్వ్ తిరిగి ఉంటాయి. మీడియాటెక్ డైమన్సిటీ 1080 ప్రాసెసర్ ఈ ఫోన్‍లో ఉంటుంది. వెనుక 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ రానుంది. 5000mAh బ్యాటరీ ఉండనుండగా.. 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.

Realme 10 Pro+ 5G launch date: డిసెంబర్ 8వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్‍మీ 10ప్రో+ 5జీ ఇండియాలో లాంచ్ కానుంది. దీంతో పాటు రియల్‍మీ 10 ప్రో కూడా అడుగుపెట్టనుంది.

WhatsApp channel