Telugu News  /  Business  /  Realme 10 Pro 5g Series Launched Date In India Revealed Officially By Realme
రియల్‍మీ 10 ప్రో సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్
రియల్‍మీ 10 ప్రో సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్

Realme 10 Pro+ 5G India launch date: భారత్‍లో రియల్‍మీ 10 ప్రో సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. అదుర్స్ అనిపించేలా డిస్‍‍ప్లే

24 November 2022, 12:28 ISTChatakonda Krishna Prakash
24 November 2022, 12:28 IST

Realme 10 Pro 5G Series India launch date: రియల్‍మీ 10 ప్రో+ 5జీ ఇండియాకు వచ్చేస్తోంది. ఈ 10 ప్రో 5జీ సిరీస్ లాంచ్ డేట్‍ను రియల్‍మీ అధికారికంగా ప్రకటించింది.

Realme 10 Pro 5G Series India launch date: రియల్‍మీ 10 ప్రో 5జీ సిరీస్ ఇండియాకు వచ్చేందుకు సిద్ధమైంది. రియల్‍మీ 10 ప్రో+ 5జీ, రియల్‍మీ 10 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‍లు భారత్‍లో డిసెంబర్ 8న తేదీన లాంచ్ కానున్నాయి. తేదీని రియల్‍మీ అధికారికంగా ప్రకటించింది. ఈనెలలో చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్‍లను డిసెంబర్‍లో ఇండియాకు తీసుకొస్తోంది రియల్‍మీ. ఇందులో రియల్‍మీ 10 ప్రో+ 5జీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఫోన్‍కు ఉండే కర్వ్డ్ ఎడ్జెస్ సూపర్ అమోలెడ్ డిస్‍ప్లే చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. మీడియాటెక్ డైమన్సిటీ 1080 ప్రాసెసర్ ను కలిగి ఉంది. రియల్‍మీ 10 ప్రో 5జీ, రియల్‍మీ 10 ప్రో 5జీ గురించిన వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

లాంచ్ వివరాలు ఇవే

Realme 10 Pro 5G Series launch date India: డిసెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్‍లో రియల్‍మీ 10 ప్రో+ 5జీ లాంచ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా రియల్‍మీ ప్రకటించింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ లో ఈ రియల్‍మీ 10 ప్రో 5జీ సిరీస్ సేల్‍కు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికైతే రియల్‍మీ 10 ప్రో+ 5జీనే టీజ్ చేస్తోంది రియల్‍మీ.

రియల్‍మీ 10 ప్రో సిరీస్ స్పెసిఫికేషన్లు

Realme 10 Pro+ 5G, Realme 10 Pro 5G Specifications: చైనాలో లాంచ్ అయిన స్పెసిఫికేషన్లతోనే రియల్‍మీ 10 ప్రో+ 5జీ, రియల్‍మీ 10 ప్రో 5జీ మొబైళ్లు ఇండియాలోనూ అడుగుపెట్టే అవకాశాలు అధికం. రెండు మొబైళ్లు ఆండ్రాయిడ్ 13 బేస్డ్ రియల్‌మీ యూఐ 4పై రన్ అవుతాయి. రియల్‍మీ 10 ప్రో+ 5జీ ఫోన్‍లో 1080 ప్రాసెసర్, 10 ప్రో 5జీ మోడల్‍లో స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటాయి. రియల్‍మీ 10 ప్రో+ 5జీ కర్వ్డ్ సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేను కలిగి ఉంటుంది. 10 ప్రో 5జీ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో రానుంది.

రియల్‍మీ 10 ప్రో+ 5జీ వెనుక మూడు కెమెరాలు ఉండనుండగా.. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 10 ప్రో 5జీ వెనుక రెండు కెమెరాలు ఉంటాయి. రెండు ఫోన్లు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటాయి. అలాగే ఈ రెండు రియల్‍మీ 10 ప్రో సిరీస్ 5జీ స్మార్ట్ పోన్‍లలో 5,000mAh బ్యాటరీ ఉంటుంది.

చైనాలో రియల్‍మీ 10 ప్రో+ 5జీ ప్రారంభ ధర 1,699 (సుమారు రూ.19,500), రియల్‍మీ 10 ప్రో 5జీ ప్రారంభ ధర 1,599 (సుమారు రూ.18,500)గా ఉంది. అయితే రియల్‍మీ 10 ప్రో+ 5జీ ధర భారత్‍లో కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంది.