ఈ వాట్సాప్ సీక్రెట్ ట్రిక్ మీకు తెలుసా?.. చాలా యూజ్ ఫుల్-read whatsapp messages secretly without alerting the sender ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ వాట్సాప్ సీక్రెట్ ట్రిక్ మీకు తెలుసా?.. చాలా యూజ్ ఫుల్

ఈ వాట్సాప్ సీక్రెట్ ట్రిక్ మీకు తెలుసా?.. చాలా యూజ్ ఫుల్

Sudarshan V HT Telugu

అన్ని రంగాల్లో ఇప్పుడు వాట్సాప్ వినియోగం చాలా పెరిగింది. అదే సమయంలో, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వాట్సాప్ తీసుకువస్తోంది. పంపిన వ్యక్తికి తెలియకుండా, వారు పంపిన వాట్సాప్ సందేశాలను ఎలా చదవాలనే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

Know how to read WhatsApp messages secretly without notifying the sender by adjusting privacy settings. (Pexels)

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులతో కమ్యూనికేషన్ కు వాట్సాప్ ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. స్నేహితులు, కుటుంబంతో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక ప్రముఖ వేదిక అయింది. సాధారణంగా, మీకు వచ్చిన ఒక వాట్సాప్ సందేశాన్ని మీరు చదవగానే, ఆ సందేశం అతడి ఫోన్ లో బ్లూ టిక్ తో కనిపిస్తుంది. దాంతో, మీరు అతడి మెసేజ్ ను చదివారని అర్థం అవుతుంది.

తెలియకుండా వాట్సాప్ మెసేజ్ చదవడం ఎలా?

కొన్నిసార్లు, కొన్ని సందేశాలను మీరు చదవాలని అనుకుంటారు. కానీ, ఆ విషయం ఆ మెసేజ్ ను పంపిన వ్యక్తికి తెలియకూడదని కోరుకుంటారు. అలాంటి, సందర్భాల్లో మీకు ఉపయోగపడే ఒక ట్రిక్ ను మీరు ఇక్కడ తెలుసుకుంటారు. అందుకు మీరు మీ వాట్సాప్ లోని సెట్టింగ్ ల్లోని ప్రైవసీ సెట్టింగ్ లను మార్చాల్సి ఉంటుంది. తద్వారా, మీరు ఇతరులు పంపిన మెసేజ్ లను చదివినప్పటికీ, పంపిన వ్యక్తి వాట్సాప్ లో ఆ సందేశానికి బ్లూ టిక్ కనిపించదు. దాంతో, మీరు ఆ సందేశం చదివినట్లుగా ఆ వ్యక్తికి తెలియదు. బ్లూ టిక్ లను డిసేబుల్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాలి.

ఇలా చేయండి

  1. ముందుగా మీ ఫోన్ లోని వాట్సప్ యాప్ ను ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లాలి.
  2. ప్రైవసీ ఆప్షన్ లోని రీడ్ రిసీట్స్ (read receipts) సెట్టింగ్ లను గుర్తించండి..
  3. రీడ్ రిసీట్స్ ఆప్షన్ ను ఆఫ్ చేయండి. దాంతో, మీ చాట్ లలో బ్లూ టిక్ లు నిలిపివేయబడుతాయి.
  4. అవే దశలను తిరిగి అనుసరించడం ద్వారా మీరు తరువాత ఈ ఫీచర్ ను మళ్లీ ప్రారంభించవచ్చు.
  5. అయితే, రీడ్ రిసీట్స్ ఆప్షన్ ను డిసేబుల్ చేయడం వల్ల, మీరు కూడా ఇతరులు మీ సందేశాలను చూశారా? లేదా? అనే విషయాన్ని గుర్తించలేరనే విషయాన్ని గమనించాలి.

‘లాస్ట్ సీన్’ ను, ‘ఆన్ లైన్ స్టేటస్’ లను హైడ్ చేయడం ఎలా?

అంతేకాదు, మీరు మీ ‘లాస్ట్ సీన్ (last seen)’ ను, ‘ఆన్ లైన్ స్టేటస్ (online status)’ లను కూడా హైడ్ చేయవచ్చు. అందుకు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

  1. వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీని ట్యాప్ చేయండి.
  2. "లాస్ట్ సీన్ అండ్ ఆన్ లైన్" సెట్టింగ్స్ పై ట్యాప్ చేయండి.
  3. ఈ నాలుగు ఆప్షన్ల నుండి ఎంచుకోండి: ప్రతి ఒక్కరూ (Everyone), నా పరిచయాలు (My Contacts), వీరు తప్ప నా పరిచయాలు(My Contacts Except), లేదా ఎవరూ కాదు (Nobody).
  4. మీరు ఎంచుకున్న ఆప్షన్ ను బట్టి వారికి మీ లాస్ట్ సీన్ (last seen) అండ్ ఆన్ లైన్ స్టేటస్ (online status) కనిపించదు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం