RBI's Retail Direct Scheme: ప్రభుత్వ సెక్యూరిటీస్ లో ఇక డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు.. ఈ అకౌంట్ ఓపెన్ చేయండి చాాలు..
RBI's Retail Direct Scheme: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కొత్త స్కీమ్ ని ప్రారంభించింది. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా, ప్రభుత్వ సెక్యూరిటీస్ లో రిటైల్ ఇన్వెస్టర్స్ ఇక నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించే ఈ పథకాన్ని ఆర్బిఐ తాజాగా ప్రారంభించింది.
RBI's Retail Direct Scheme: సాధారణంగా ప్రభుత్వ సెక్యూరిటీస్ లో పెట్టుబడులు పెట్టాలంటే.. బ్రోకరేజ్ సంస్థల ద్వారా కానీ, మ్యుచ్యువల్ ఫండ్స్ ద్వారా కానీ వేరే ఇతర ఇంటర్మీడియరీస్ ద్వారా కానీ ఆ పెట్టుబడులు పెట్టాలి. అందుకు వారికి కొంత రుసుము చెల్లించాలి. ఇకపై ఆ చార్జీల భారం తగ్గనుంది. ఆ దిశగా ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ (Retail Direct Scheme) ను ప్రారంభించింది. నేరుగా ఈ స్కీం ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుగోలు చేసిన వారికి అదనపు చార్జీల భారం ఉండదు.
ఏమిటి ఈ పథకం?
ఈ పథకం పేరు ఆర్బిఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్. ఏ వ్యక్తిగత ఇన్వెస్టర్ అయిన ఈ స్కీం ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ను కొనుగోలు చేయవచ్చు, అలాగే, అమ్మవచ్చు కూడా. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కొనుగోలు చేయాలనుకునే ఇన్వెస్టర్స్ ముందుగా https://rbiretaildirect.org.in. వెబ్ సైట్ ద్వారా రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (Retail Direct Gilt) ను ఓపెన్ చేయాలి. ఈ ఎకౌంటు ద్వారా ప్రైమరీ మార్కెట్ ఆప్షన్స్ లోనూ, సెకండరీ మార్కెట్లోనూ ఇన్వెస్టర్స్ లావాదేవీలు చేయవచ్చు.
ప్రభుత్వ సెక్యూరిటీలతో లాభాలు..
గవర్నమెంట్ సెక్యూరిటీస్ సాధారణంగా రిస్క్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు. ఇవి దీర్ఘకాలంలో ఆకర్షణీయమైన రిటర్న్స్ కూడా ఇస్తాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్స్ పోర్ట్ ఫోలియో డైవర్సిటీ వస్తుంది. రిస్క్ తగ్గుతుంది ముఖ్యంగా ఈ రిటైల్ డైరెక్ట్ స్కీం ద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఇంటర్మీడియట్ ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవు. ఈ రిటైర్డ్ డైరెక్ట్ స్కీం ద్వారా భారత ప్రభుత్వ ట్రెజరీ బిల్స్ ను, భారత ప్రభుత్వ సెక్యూరిటీస్ ను, రాష్ట్ర ప్రభుత్వ రుణాలకు సంబంధించిన బాండ్స్ ను, సావరిన్ గోల్డ్ బాండ్స్ ను కొనుగోలు చేయొచ్చు, అలాగే, వాటిని అమ్మవచ్చు.
ఈ డాక్యుమెంట్స్ అవసరం
రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (Retail Direct Gilt) ను ఓపెన్ చేయడానికి ప్రధానంగా, ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. అలాగే, ఆదాయ పన్ను విభాగం జారీ చేసే పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) ఉండాలి. నో యువర్ కస్టమర్ (Know Your Customer KYC) కోసం ఏదైనా గుర్తింపు పత్రం ఉండాలి. అలాగే, ఒక ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ కావాలి. వీటి ద్వారా రిటైల్ ఇన్వెస్టర్స్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. ఫెమా పరిధికి లోబడి ప్రవాస భారతీయులు కూడా ప్రభుత్వ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఓపెన్ చేసే ప్రక్రియ
- ముందుగా https://rbiretaildirect.org.in. వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- పేరు, పాన్, ఈమెయిల్, మొబైల్ నంబర్, రెసిడెన్షియల్ అడ్రెస్ వంటివి నమోదు చేయాలి.
- బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయాలి.
- మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
- నో యువర్ కస్టమర్ (Know Your Customer KYC) ప్రక్రియను పూర్తి చేయాలి.
- నామినేషన్ డిటైల్స్ కచ్చితంగా ఇవ్వాలి.