RBI slaps penalty on Amazon Pay: ‘ఆమెజాన్ పే’ పై 3 కోట్ల జరిమానా-rbi slaps over rs 3 crore penalty on amazon pay ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Rbi Slaps Over <Span Class='webrupee'>₹</span>3-crore Penalty On Amazon Pay

RBI slaps penalty on Amazon Pay: ‘ఆమెజాన్ పే’ పై 3 కోట్ల జరిమానా

HT Telugu Desk HT Telugu
Mar 03, 2023 08:24 PM IST

ఈ కామర్స్ దిగ్గజం ఆమెజాన్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గానూ రూ. 3 కోట్లు పెనాల్టీగా చెల్లించాలని ఆమెజాన్ డిజిటల్ పేమెంట్ విభాగం ‘ఆమెజాన్ పే (Amazon Pay)’ ను ఆదేశించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ‘ఆమెజాన్ పే (Amazon Pay)’ కు రూ. 3.06 కోట్ల పెనాల్టీ విధించింది. ప్రి పెయిడ్ ఇన్ స్ట్రుమెంట్స్ (PPI) కు, నో యువర్ కస్టమర్ (Know Your Customer KYC) సంబంధించి ఆర్బీఐ నిబంధనలను పాటించని కారణంగా ఈ జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

కేవైసీ నిబంధనలను పాటించలేదు..

అయితే, ఈ జరిమానా నిబంధనలను పాటించని కారణంగానే విధిస్తున్నామని, కస్టమర్ల పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోని లోపాలకు సంబంధించి కాదని ఆర్బీఐ వివరణ ఇచ్చింది. అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం ఆమెజాన్ (Amazon)కు ఆమెజాన్ పే (Amazon Pay) అనేది డిజిటల్ పేమెంట్ విభాగమన్న విషయం తెలిసిందే. కేవైసీ (KYC) కి సంబంధించి ఆర్బీఐ నిబంధనలను ఆమెజాన్ పే (Amazon Pay) పాటించలేదని, ఈ విషయమై ఆర్బీఐ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు కూడా సరిగ్గా స్పందించలేదని ఆమెజాన్ పే (Amazon Pay) పై రిజర్వ్ బ్యాంక్ ఆరోపణలు చేసింది. దాంతో, జరిమానా విధించామని ఆర్బీఐ తెలిపింది. Payment and Settlement Systems Act, 2007 చట్టంలోని సెక్షన్ 30 కింద లభించిన అధికారాల కింద ఈ జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది.

WhatsApp channel

టాపిక్