Ratan Tata Book : రతన్ టాటా జీవిత చరిత్రలో రహస్యాలు.. పుస్తకం ప్రచురించడంలో ఇబ్బందులు!
Ratan Tata a Life Book : రతన్ టాటా భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన వ్యాపారవేత్త. తన జ్ఞానం, వృత్తి నైపుణ్యం, దాతృత్వంతో ప్రజలకు కూడా దగ్గరయ్యారు. ఆయన జీవితంపై చాలా పుస్తకాలు వచ్చాయి. కానీ ఓ పుస్తకం ప్రచురించడం మాత్రం ఇంకా అవ్వలేదు.
రతన్ టాటా అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన జీవితం చాలా మందికి ఆదర్శం. ఇప్పటికే రతన్ టాటాకు సంబంధించి కొన్ని పుస్తకాలు వచ్చాయి. కానీ రతన్ టాటా జీవిత చరిత్ర రాసి ప్రచురించే ప్రక్రియలో ఉంది. కొన్ని కారణాల వల్ల ఈ పుస్తకం విడుదల ఆలస్యమవుతోంది. రతన్ టాటా జీవిత చరిత్రను టాటా గ్రూప్ మాజీ ఎగ్జిక్యూటివ్ థామస్ మాథ్యూ రాశారు.
రతన్ టాటా సన్నిహితులు, బంధువులు ఈ పుస్తకంలో మరిన్ని వివరాలను రాసినట్లు తెలుస్తోంది. జంతువుల కోసం ఆసుపత్రిని ఏర్పాటు చేయడం కూడా కొంతకాలం కిందడ యాడ్ చేశారు. ప్రఖ్యాత హార్పర్‌కాలిన్స్ ఈ పుస్తక ప్రచురణ హక్కులను రెండేళ్ల క్రితం రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.
రతన్ టాటా జీవిత చరిత్ర కాపీని రచయిత మాథ్యూ జనవరి 2022లో టాటాతో పంచుకున్నారు. పుస్తక ప్రచురణకర్త, హార్పర్ కాలిన్స్, నవంబర్ 2022లో 'రతన్ టాటా-ఎ లైఫ్' పేరుతో పుస్తకాన్ని విడుదల చేయాలని మొదట అనుకున్నారు. తరువాత తేదీని మార్చి 2023కి, తరువాత ఈ సంవత్సరం ఫిబ్రవరికి వాయిదా వేశారు. కానీ ఇప్పటి వరకు పుస్తకం ప్రచురించలేదు. ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి. అయితే ఈ పుస్తకంలో రతన్ టాటా జీవితానికి సంబంధించిన చాలా రహస్యాలు ఉంటాయని కొంతమంది అంటున్నారు. బయటకు తెలియని విషయాలు కూడా ఇందులో రాశారని చెబుతారు.
రతన్ టాటా 1937 డిసెంబర్ 28న బొంబాయిలో జన్మించారు. 1991-2012 టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్‌లో పట్టభద్రుడయ్యారు. టాటా గ్రూప్‌కు సారథ్యం వహించిన తర్వాత దానిని విస్తరించేందుకు రతన్ టాటా చురుకుగా ప్రయత్నించారు. తన వ్యాపారాలను గ్లోబలైజ్ చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టారు. 2000లో లండన్‌కు చెందిన డెడ్లీ టీని 431.3 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.
2007లో టాటా స్టీల్ ఆంగ్లో-డచ్ స్టీల్‌మేకర్ కోరస్ గ్రూప్‌ను 11.3 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేయడం అతిపెద్ద కార్పొరేట్ డీల్‌గా చెప్పుకొంటారు. 2008లో టాటా మోటార్స్ ఫోర్డ్ మోటార్ కంపెనీ నుండి ఎలైట్ బ్రిటిష్ కార్ బ్రాండ్‌లు జాగ్వార్, ల్యాండ్ రోవర్‌లను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. 2.3 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్ ఇప్పటివరకు భారతీయ ఆటో కంపెనీ చేసిన అతిపెద్ద కొనుగోలుగా చెబుతారు.
మధ్యతరగతి ప్రజలకు కారు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రతన్ టాటా నానో కారును తీసుకొచ్చారు. దీని ధర సుమారు రూ.100,000. డిసెంబర్ 2012లో టాటా గ్రూప్ చైర్మన్‌గా పదవీ విరమణ చేశారు. టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించిన తరువాత, అక్టోబర్ 2016 నుండి తాత్కాలిక ఛైర్మన్‌గా కొంతకాలం పనిచేశారు. 2017 జనవరిలో నటరాజన్ చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమితులైనప్పుడు రతన్ టాటా పదవీ విరమణ చేశారు.
టాపిక్