ఎంజీ మోటార్ ఇండియా తన సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును భారతదేశంలోని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లకు పంపడం ప్రారంభించింది. ఈ కారు ఎంజీ ఈవి ఉత్పత్తి మాత్రమే కాదు.. ఇది భారతదేశంలో విక్రయించే మొదటి ఆల్-ఎలక్ట్రిక్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు.
ఎంజీ సైబర్‌స్టర్ మొదట 2023లో ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. ఇప్పుడు సీబీయూ(కంప్లీట్లీ బిల్ట్ యూనిట్)గా భారతదేశానికి వస్తోంది. ఇది కంపెనీ ప్రీమియం ఎంపిక చేసిన డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా విక్రయిస్తారు. ప్రారంభంలో పరిమిత యూనిట్లతో లభిస్తుంది.
స్పోర్ట్స్ కారులా అద్భుతంగా కనిపించే ఎంజీ సైబర్ స్టర్ వైపు చూసి ఆకర్షితులవుతారు. ఇది తక్కువ స్లంగ్ డిజైన్ ను కలిగి ఉంది. దీనికి ఫ్యూచరిస్టిక్ స్కియర్ డోర్లు లభిస్తాయి. ఇది కాకుండా డ్యూయల్ డోర్లతో కూడిన ఓపెన్ రూఫ్ బాడీ ఉంటుంది. దీని లోపల మీకు 3 స్క్రీన్ల హైటెక్ డ్యాష్ బోర్డు లభిస్తుంది. ఇందులో ఎయిర్ క్రాఫ్ట్ తరహా స్టీరింగ్ వీల్‌ను అందించారు.
ఎంజీ సైబర్‌స్టర్ స్పోర్ట్స్ కారు రెండు పవర్ ట్రెయిన్ ఎంపికలలో వస్తుంది. ఇది సింగిల్ మోటార్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్‌ను పొందుతుంది. ఇది డ్యూయల్-మోటార్ ఏడబ్ల్యూడీ వేరియంట్లో లభిస్తుంది. ఈ కారు రేంజ్ 500 కిలోమీటర్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు.
భారతదేశంలో లాంచ్ తేదీని, ధరను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇది త్వరలో ఎం9తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. దీని ధర రూ.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. ఇప్పటికే కొన్ని డీలర్ షిప్ ల వద్ద కస్టమర్ ప్రివ్యూ ప్రారంభమయ్యాయి.
ఎంజీ సైబర్‌స్టర్ కేవలం ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు. భారతదేశంలో ఈవీ స్పోర్ట్స్ విభాగానికి కొత్త దిశను ఇచ్చే మోడల్. దీని రాకతో పనితీరు, స్టైల్ రెండింటినీ కోరుకునే యువ వినియోగదారులకు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆప్షన్ కూడా లభిస్తుంది. మీరు కూడా ఎలక్ట్రిక్ కార్లను ఇష్టపడితే, ఫ్యూచరిస్టిక్ డిజైన్, స్పోర్టినెస్ కలయికను కోరుకుంటే ఎంజీ సైబర్‌స్టర్ వైపు చూడవచ్చు.