Multibagger stocks: రాకేష్ ఝున్ ఝున్ వాలా మల్టీబ్యాగర్ స్టాక్స్ ఇవే.. ఏడాదిలో 123 శాతం వృద్ధి-rakesh jhunjhunwala multibagger stocks geojit ncc among the top 4 this year ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibagger Stocks: రాకేష్ ఝున్ ఝున్ వాలా మల్టీబ్యాగర్ స్టాక్స్ ఇవే.. ఏడాదిలో 123 శాతం వృద్ధి

Multibagger stocks: రాకేష్ ఝున్ ఝున్ వాలా మల్టీబ్యాగర్ స్టాక్స్ ఇవే.. ఏడాదిలో 123 శాతం వృద్ధి

HT Telugu Desk HT Telugu
Aug 14, 2024 03:50 PM IST

ఇండియన్ వారెన్ బఫెట్ గా పేరుగాంచిన రాకేష్ ఝున్ ఝున్ వాలా పోర్ట్ ఫోలియోలోని మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? రాకేష్ ఝున్ ఝున్ వాలా పోర్ట్ ఫోలియోలో జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్సర్స్ లిమిటెడ్, జుబిలెంట్ ఫార్మోవా, ఎన్సీసీ మొదలైనవి ఉన్నాయి.

రాకేష్ ఝున్ ఝున్ వాలా మల్టీబ్యాగర్ స్టాక్స్
రాకేష్ ఝున్ ఝున్ వాలా మల్టీబ్యాగర్ స్టాక్స్ (MINT_PRINT)

Rakesh Jhunjhunwala stocks: రాకేష్ ఝున్ ఝున్ వాలా అండ్ అసోసియేట్స్ పోర్ట్ ఫోలియోలో ఉన్న మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్సర్స్ లిమిటెడ్, జుబిలెంట్ ఫార్మోవా, ఎన్సీసీ లిమిటెడ్ మొదలైనవి ఉన్నాయి. అవి గత ఏడాది కాలంలో మల్టీబ్యాగర్ రాబడులను అందించాయి. గత ఏడాది కాలంలో 112 శాతానికి పైగా పెరిగిన జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు ధర అద్భుతమైన గెయినర్ గా ఉంది. రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్సర్స్ లిమిటెడ్, జుబిలెంట్ ఫార్మోవా, ఎన్సీసీ కూడా వారి షేరు ధరను రెట్టింపు చేశాయి.

రాకేశ్ ఝున్ ఝున్ వాలా రెండో వర్ధంతి

ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా రెండో వర్ధంతి సందర్భంగా ఇన్వెస్టర్లు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. 1960 జూలై 5న జన్మించిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా 2022 ఆగస్టు 14న చనిపోయారు. రాకేశ్ ఝున్ ఝున్ వాలా అండ్ అసోసియేట్స్ పోర్ట్ ఫోలియోలోని ఇతర స్టాక్స్ లో టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, ఫెడరల్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, జుబిలెంట్ ఇంగ్రేవియా ఫోర్టిస్ హెల్త్ కేర్, కెనరా బ్యాంక్ గత ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు 50 శాతానికి పైగా రాబడులని అందించాయి. ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్, నజారా టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి సంస్థలు 40-50% రాబడిని ఇచ్చాయి.

ఇవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు

రాకేష్ ఝున్ ఝున్ వాలా అండ్ అసోసియేట్స్ పోర్ట్ ఫోలియోలోని టైటాన్ ఇండస్ట్రీస్ ఆగ్రో టెక్ ఫుడ్స్ లిమిటెడ్ వంటి కొన్ని స్టాక్స్ గతంలో మంచి పనితీరును కనబరిచాయి. కానీ, గత ఏడాది కాలంగా పరిమిత పెరుగుదలను చూశాయి. ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు టైటన్ షేరు ధరలపై ప్రభావం చూపాయి. ఫోర్టిస్ హెల్త్ కేర్, కెనరా బ్యాంక్ మినహా రాకేష్ ఝున్ ఝున్ వాలా అండ్ అసోసియేట్స్ పోర్ట్ ఫోలియోలోని మిగతా స్టాక్స్ అన్నీ కొంత క్షీణతను చవి చూశాయని మనీకంట్రోల్ డేటా చెబుతోంది. ఆగ్రో టెక్ ఫుడ్స్ లిమిటెడ్, నజారా టెక్నాలజీస్ షేర్ హోల్డింగ్ మార్చి 2024 త్రైమాసికంతో పోలిస్తే జూన్ 2024 త్రైమాసికం చివరి నాటికి 0.15% తగ్గింది.

సూచన: పైన చేసిన అభిప్రాయాలు మరియు సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి, హెచ్ టీ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.