హైదరాబాద్‌లో అతిపెద్ద లగ్జరీ క్లబ్‌హౌస్ 'క్లబ్ ఒడిస్సీ'ని ఆవిష్కరించిన రాజపుష్ప ప్రాపర్టీస్-rajapushpa properties unveils hyderabads largest luxury clubhouse club odyssey ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  హైదరాబాద్‌లో అతిపెద్ద లగ్జరీ క్లబ్‌హౌస్ 'క్లబ్ ఒడిస్సీ'ని ఆవిష్కరించిన రాజపుష్ప ప్రాపర్టీస్

హైదరాబాద్‌లో అతిపెద్ద లగ్జరీ క్లబ్‌హౌస్ 'క్లబ్ ఒడిస్సీ'ని ఆవిష్కరించిన రాజపుష్ప ప్రాపర్టీస్

Anand Sai HT Telugu

రాజపుష్ప ప్రాపర్టీస్ హైదరాబాద్‌లో అతిపెద్ద లగ్జరీ క్లబ్‌హౌస్ క్లబ్ ఒడిస్సీని ఆవిష్కరించింది. దీనిద్వారా నివాసితులు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.

రాజపుష్ప ప్రావిన్షియాలో క్లబ్ ఒడిస్సీ ఆవిష్కరణ

క్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటైన రాజపుష్ప ప్రాపర్టీస్.. నార్సింగిలో ప్రధాన నివాస సముదాయం రాజపుష్ప ప్రావిన్షియాలో అతిపెద్ద లగ్జరీ క్లబ్‌హౌస్ క్లబ్ ఒడిస్సీని ఘనంగా ప్రారంభించినట్లు ప్రకటించింది. 1,00,000 ప్లస్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న క్లబ్ ఒడిస్సీ.. నివాసితుల కోసం ఆరోగ్యం, ఫిట్‌నెస్, విశ్రాంతి, ఇతర సౌకర్యాలను అందించే కేంద్రంగా మారనుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా, రాజపుష్ప ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి గౌరవ అతిథిగా వచ్చారు.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్‌కి కొంత దూరంలో ఉన్న రాజపుష్ప ప్రావిన్షియా.. 23.75 ఎకరాల విస్తీర్ణంలో 3,498 ప్రీమియం అపార్ట్‌మెంట్లతో కూడిన మాస్టర్-ప్లాన్డ్ కమ్యూనిటీ. మొదటి దశ (1,908 యూనిట్లు) 95 శాతం అమ్ముడైపోగా, రెండో దశ (1,590 యూనిట్లు) రాబోయే 6-9 నెలల్లో అప్పగించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికే ఒక కీలక మైలురాయిని సాధించింది.

కమ్యూనిటీలో 6.5 ఎకరాల సెంట్రల్ కోర్ట్‌యార్డ్, 80 శాతం ఖాళీ స్థలాలు, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, స్కైవాక్‌లు, అందమైన పచ్చని ల్యాండ్‌స్కేప్‌లు ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని, మంచి జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ఈ సందర్భంగా రాజపుష్ప ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...'క్లబ్ ఒడిస్సీతో మేం సంప్రదాయ రియల్ ఎస్టేట్‌కు మించి మంచి లైఫ్‌స్టైల్ వ్యవస్థను సృష్టించాం. ఆనందాన్ని పెంపొందించే కమ్యూనిటీలను నిర్మించాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.' అని అన్నారు.

పుల్లెల గోపీచంద్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను ప్రశంసించారు. 'కమ్యూనిటీ అభివృద్ధి పట్ల ఇంత ముందుచూపు ఉండటం నాకు స్ఫూర్తినిచ్చింది. క్లబ్ ఒడిస్సీ వంటి సౌకర్యాలు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడమే కాకుండా చురుకైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా ప్రోత్సహిస్తాయి.' అని పేర్కొన్నారు.

క్లబ్ ఒడిస్సీ అనేది మొదటి దశ నివాసితులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన లైఫ్‌స్టైల్ కేంద్రం. ఇందులో ఉండే సౌకర్యాలు చూద్దాం.. అతి పెద్ద స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ క్రీడా మైదానాలు, రుచికరమైన భోజనం అందించే రెస్టారెంట్లు, కేఫ్‌లు, లాంజ్‌లు, స్పా, వెల్‌నెస్ సెంటర్, లోపల ఉండే ఏసీ బాస్కెట్‌బాల్ కోర్టు, కో-వర్కింగ్ లాంజ్‌లు, ఇతర అవసరాలకు హాళ్ళు, వినోద కేంద్రాలు/ సృజనాత్మక స్టూడియోలు, వర్క్-ఫ్రమ్-క్లబ్ ప్రాంతాలు, మెడిటేషన్/యోగా/ఏరోబిక్స్ గదితోపాటుగా మరెన్నో సౌకర్యాలు ఉంటాయి.

రెండో దశ నివాసితులకు కూడా ఇదే స్థాయిలో క్లబ్ ఒయాసిస్ అనే మరో అద్భుతమైన క్లబ్ రాబోతోంది. దీనివల్ల మొత్తం టౌన్‌షిప్‌లోని ప్రజలకు మంచి వినోద సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. రాజపుష్ప ప్రావిన్షియా హైదరాబాద్‌లోని ఉత్తమ నివాస ప్రాంతాలలో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.