Car damage in rainy season : వర్షాలు, వరదలకు కారు డ్యామేజ్ అయితే- ఇలా చేయండి..
How to take care of car in Rainy season : వర్షాకాలం సమీపిస్తోంది. ఏదో ఒక కారణంగా.. కారు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. మరి ఆ తర్వాత ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి.
Car care tips in rainy season : దేశంలో వేసవి కాలానికి ఇంకొన్ని రోజుల్లో ముగింపు పడనుంది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకేందుకు అడుగు దూరంలో ఉన్నాయి. ఈ ఏడాది.. వర్షాలు సాధారణం కన్నా ఎక్కువగా కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. వర్షాలు, వరదలకు కారు దెబ్బతినే అవకాశం ఉంది. పైగా.. ప్రస్తుతం పశ్చిమ్ బెంగాల్‌ని కుదిపేస్తున్న రేమాల్ తుపానుకు వాహనాలు సైతం కొట్టుకుపోతున్నాయి. చాలా కార్లు దెబ్బతింటున్నాయి. అందుకే.. వర్షాకాలంలో వాహనాలు డ్యామేజ్ అయితే ఏం చేయాలి? అన్న విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి.
డాక్యుమెంట్స్ చెక్ చేయండి..
ముందుగా.. అసలు కారుకు ఎంత డ్యామేజ్ అయ్యిందో తెలుసుకోండి. మీకు నచ్చిన, ప్రియమైన కారు ధ్వంసమవ్వడాన్నిచూడటం కష్టమే. కానీ దానిని డాక్యుమెంట్ చేయడం చాలా అవసరం. ఫొటోలు, వీడియోలు తీసి వాటిని జాగ్రత్త పరచండి.
ఇదీ చూడండి:- Mahindra XUV 3XO: మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ డెలివరీలు నేటి నుంచి ప్రారంభం
ఇన్ష్యూరెన్స్ ప్రొవైడర్‌తో మాట్లాడండి..
మీ కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ని సంప్రదించండి. మీరు పాలసీని కొనుగోలు చేసిన కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కంపెనీని సంప్రదించండి. కారుకు జరిగిన నష్టాలకు సంబంధించిన అన్ని వివరాలను వారికి తెలియజేయండి. ఆధారాలుగా చిత్రాలు, వీడియోలను వారితో పంచుకోవాలి. అలాగే, కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, యజమాని డ్రైవింగ్ లైసెన్స్ కాపీని బీమా కంపెనీతో పంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇచ్చిన వివరాలను బీమా సంస్థ ప్రాసెస్ చేస్తుంది. అవసరమైతే మిమ్మల్ని మరిన్ని వివరాలను అడిగే అవకాశం ఉంటుంది.
కారును రిపేర్ చేయండి.. క్లెయిమ్ రీయింబర్స్మెంట్..
Car insurance tips in telugu : కారు ఇన్ష్యూరెన్స్ని క్లెయిమ్ చేయాలి. రెండు పద్ధతుల ద్వారా క్లెయిమ్ చేయవచ్చు. ఒకటి ఆన్-అకౌంట్ సెటిల్మెంట్. ఇక్కడ భీమా సంస్థ నష్టాన్ని అంచనా వేస్తుంది. మరమ్మత్తు పని కోసం బీమా చేసిన వ్యక్తి బ్యాంక్ ఖాతాకు కవరేజీ మొత్తాన్ని ముందుగానే పంపుతుంది. రెండో పద్ధతిలో వాహన యజమాని కారును గ్యారేజీకి తీసుకెళ్లి, మరమ్మతు పనులు చేయించి ఇన్ వాయిస్‌లను బీమా కంపెనీతో పంచుకుంటాడు. రెండో ఆప్షన్ ఎంచుకోవాలనుకుంటే కారును గ్యారేజీకి తీసుకెళ్లి రిపేర్ పనులు చేయించుకోవాలి. సరైన ఇన్ వాయిస్ అడగండి. తరువాత దానిని బీమా కంపెనీతో పంచుకోండి. గ్యారేజీకి ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అనుమతి ఇస్తే క్యాష్‌లెస్ ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇలా.. మీరు బీమా పొందొచ్చు.
ఈ మధ్య కాలంలో చాలా మంది.. సొంతంగా కారు కొనేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే.. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుని మీ కారు డ్యామేజ్‌కి పరిష్కారాన్ని సులభంగా పొందొచ్చు. మరిన్ని వివరాల కోసం మీరు మీ కారు ఇన్ష్యూరెన్స్ కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది. ప్రీమియం కట్టే ముందే.. అన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోవడం బెటర్. అప్పుడు.. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తవు. మీరు ఇబ్బందులు పడకుండా పని జరిగిపోతుంది.
సంబంధిత కథనం