Qualitest to hire 1,400 tech professionals in India: భారత్ లో 1400 ఐటీ జాబ్స్-qualitest plans to hire 1 400 tech professionals in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Qualitest Plans To Hire 1,400 Tech Professionals In India

Qualitest to hire 1,400 tech professionals in India: భారత్ లో 1400 ఐటీ జాబ్స్

HT Telugu Desk HT Telugu
Nov 02, 2022 08:42 PM IST

Qualitest to hire 1,400 tech professionals in India: క్వాలిటీ ఇంజినీరింగ్ లో అంతర్జాతీయ దిగ్గజ ఐటీ సంస్థ Qualitest భారత్ లో విస్తరణ దిశగా ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం భారత్ లో కొత్తగా 1400 ఐటీ ఉద్యోగాలు కల్పించనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Qualitest to hire 1,400 tech professionals in India: Qualitest కృత్రిమ మేథ(artificial intelligence) సాయంతో క్వాలిటీ ఇంజినీరింగ్ సేవలు అందించే అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సంస్థ.

ట్రెండింగ్ వార్తలు

Qualitest to hire 1,400 tech professionals in India: భారత్ లో విస్తరణ

Qualitest సంస్థ భారత్ లో విస్తరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా దేశంలోని ఐటీ నిపుణులకు రానున్న 12 నెలల్లో 1400 కొత్త ఉద్యోగాలను కల్పించనుంది. భారత్ లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రాంతాల్లో విస్తరణకు Qualitest ప్రయత్నిస్తోంది. అందుకోసం మొత్తంగా 1000 ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను, 2000 అనుభవం ఉన్న నిపుణుల ఉద్యోగులను నియమించాలని నిర్ణయించింది.

Qualitest to hire 1,400 tech professionals in India: ఈ రంగాల్లో ఉద్యోగాలు..

Qualitest సంస్థ ప్రస్తుతానికి గేమింగ్ అండ్ టెక్నాలజీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రీటెయల్, మీడియా అండ్ ఎంటర్టెయిన్మెంట్, హెల్త్ కేర్ , లైఫ్ సైన్సెస్, ఎనర్జీ రంగాలతో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(Internet-of-Things) వంటి స్పెషలైజ్డ్ రంగాల్లో సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఆయా రంగాల్లో అనుభవం ఉన్న ఉద్యోగులను సంస్థలో చేర్చుకోవాలని భావిస్తోంది. వీరిలో 1400 వరకు భారత్ లో, అమెరికాలో 1000, యూరోప్ లో 500, ఇజ్రాయెల్ లో 400 ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంస్థకు 7 వేల మంది ఉద్యోగులున్నారు.

Qualitest to hire 1,400 tech professionals in India: సెక్యూరిటీ సేవలు

యాప్స్ లో బగ్స్ ను క్లియర్ చేయడం, సైబర్ సెక్యూరిటీ అందించడం, డేటా ప్రొటెక్షన్.. తదితర సమస్యలపై Qualitest సేవలను అందిస్తుంది. భారత్, అర్జెంటీనా, కెనడా, ఇజ్రాయెల్, మెక్సికో, యూకే తదితర దేశాల్లో క్వాలిటీ ఇంజినీర్లు, సాఫ్ట్ వేర్ డెవలపర్లు, సాఫ్ట్ వేర్ టెస్టర్స్ లను హైర్ చేసుకోవాలనుకుంటోంది.

WhatsApp channel