ఎనర్జీ స్టోరేజ్ రంగంలోకి ప్యూర్ ఎనర్జీ.. ప్యూర్‌పవర్ ఉత్పత్తుల ఆవిష్కరణ-pure launches purepower products marks entry into energy storage segments ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఎనర్జీ స్టోరేజ్ రంగంలోకి ప్యూర్ ఎనర్జీ.. ప్యూర్‌పవర్ ఉత్పత్తుల ఆవిష్కరణ

ఎనర్జీ స్టోరేజ్ రంగంలోకి ప్యూర్ ఎనర్జీ.. ప్యూర్‌పవర్ ఉత్పత్తుల ఆవిష్కరణ

HT Telugu Desk HT Telugu

ఎలక్ట్రిక్ మొబిలిటీ, స్వచ్ఛ విద్యుత్ ఆవిష్కరణల్లో పేరున్న సంస్థ అయిన ప్యూర్ (PURE).. భారతదేశంలో ఎనర్జీ పరివర్తన ప్రయాణాన్ని వేగవంతం చేసే లక్ష్యంతో విప్లవాత్మకమైన ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులను PuREPower పేరుతో ఆవిష్కరించింది.

ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల

దేశంలో ఇంధన భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా ప్యూర్ సంస్థ గృహ వినియోగం (PuREPower Home), వాణిజ్య వినియోగం (PuREPower Commercial), గ్రిడ్ స్థాయి (PuREPower Grid) ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి నమ్మదగినవిగా, విస్తరించదగినవిగా, పర్యావరణ అనుకూలంగా ఉండనున్నాయి.

భారతదేశ డీకార్బనైజేషన్, పునరుత్పాదక శక్తి లక్ష్యాలను సాధించడంలో ఈ ఉత్పత్తులు కీలక పాత్ర పోషించనున్నాయి. వచ్చే 18 నెలల్లో 300 మందికి పైగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్యూర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

PuREPower Home ఉత్పత్తుల బుకింగ్స్ 2025 ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుండగా, అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా 2025 ఏప్రిల్ 30 నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఆకర్షణీయమైన రంగుల్లో, ముఖ్యంగా బంగారు వర్ణంలో లభ్యం కానున్నాయి. PuREPower Home ధర రూ. 74,999/- (ఫ్యాక్టరీ ధర) నుండి ప్రారంభమవుతుంది.

ఈ సందర్భంగా ప్యూర్ వ్యవస్థాపకుడు, ఎండీ డాక్టర్ నిశాంత్ మాట్లాడుతూ, “PuREPower అనేది కేవలం ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తి మాత్రమే కాదు, ఇది భారతదేశ డీకార్బనైజేషన్ లక్ష్యాల పట్ల మా నిబద్ధతకు నిదర్శనం. గృహాలు, వ్యాపారాలు, గ్రిడ్‌కు అధునాతన బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్ ద్వారా సాధికారత కల్పించడం, దేశవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ప్యూర్ తోడ్పడుతోంది” అని అన్నారు.

ప్యూర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ వదేరా మాట్లాడుతూ, “పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని, ఎనర్జీ స్టోరేజీ సమన్వయాన్ని ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్య సాధనకు PuREPower మద్దతుగా నిలుస్తుంది. సౌర విద్యుత్‌ను సమర్ధవంతంగా నిల్వ చేసుకోవడంలో గృహాల యజమానులకు సహాయపడటం నుండి, పర్యావరణహితంగా కార్యకలాపాలు నిర్వహించుకునేలా వ్యాపారాలకు సహాయపడటం వరకు, విద్యుత్‌కు సంబంధించిన పర్యావరణ అనుకూల పరిస్థితులను PuREPower సమర్ధవంతంగా తీర్చిదిద్దుతోంది” అని తెలిపారు.

ఈ విస్తరణ ద్వారా PuREPower ఉత్పత్తులను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, స్థానికంగా వ్యవస్థాపకతను పెంపొందించడానికి కూడా ఇది దోహదపడుతుందని చెప్పారు.

మేకిన్ ఇండియా

‘బ్యాటరీ టెక్నాలజీ, పవర్-ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్, సోలార్ కంట్రోల్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఒకే ఉత్పత్తిలో సమగ్రపరచడం ద్వారా PuREPower విద్యుత్ నిల్వ ఆవిష్కరణల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇది ‘డిజైన్ అండ్ మేక్ ఇన్ ఇండియా’ నినాదం పట్ల తమ నిబద్ధతను చాటుతోంది..’ అని వివరించారు.

నిరంతరాయ విద్యుత్ సరఫరాను అందించే PuREPower Home 3KVA, 5KVA మరియు 15KVA సామర్థ్యాలలో ఆకర్షణీయమైన రంగుల్లో మరియు కాంపాక్ట్ డిజైన్‌తో లభిస్తుందని వివరించారు.

‘యాప్ ఆధారిత మానిటరింగ్, క్లౌడ్ AI ద్వారా 10+ సంవత్సరాల జీవితకాలంతో, ఇది విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. పర్యావరణహిత భవిష్యత్తుకు తోడ్పడుతుంది. నమ్మదగిన ఎనర్జీ ఉత్పత్తిగా నిలుస్తుంది..’ అని వివరించారు.

‘సుస్థిర విధానాలకు కట్టుబడి ఉంటూనే నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలనుకునే వ్యాపార సంస్థల కోసం PuREPower Commercial 25 KVA నుండి 100 KVA వరకు సామర్థ్యం కలిగిన ఎనర్జీ స్టోరేజీ ఉత్పత్తులను అందిస్తుంది. ఇది పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి, డీజిల్ జనరేటర్లపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కార్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, టెలికాం టవర్లు, రిటైల్ కాంప్లెక్స్‌ల వంటి వాటి అవసరాలకు అనుగుణంగా ఉంటుంది..’ అని తెలిపారు.

‘అధునాతన ఎలక్ట్రానిక్స్ సహాయంతో PuREPower Commercial పీక్ లోడ్ బ్యాలెన్సింగ్‌కు తోడ్పడుతుంది. అలాగే, సెంట్రలైజ్డ్ ACలు, ఎలివేటర్లు మరియు EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు వంటి కీలక సిస్టమ్‌లకు ఇది మద్దతునిస్తుంది. వ్యాపార అవసరాలకు అనుగుణంగా దీన్ని విస్తరించుకునే అవకాశం కూడా ఉంది..’ అని సంస్థ వివరించింది.

‘PuREPower Grid ఉత్పత్తులు 4 MWh వరకు గల సామర్థ్యంతో, కాంపాక్ట్ కంటైనర్ ఆధారిత రూపంలో ఉంటాయి. ఇవి ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వినియోగదారులు, మైక్రో-గ్రిడ్‌లు, సౌర/విద్యుత్ పార్క్‌ల కోసం రూపొందించాం. ఫ్రీక్వెన్సీ రెగ్యులేషన్, పంపిణీ నష్టాలను తగ్గించడం, గ్రిడ్ విశ్వసనీయతను మెరుగుపరచడం ద్వారా ఇవి భారతదేశ డీకార్బనైజేషన్ లక్ష్యాలకు దోహదం చేస్తూ, స్థిరమైన భవిష్యత్తుకు విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయి..’ అని సంస్థ వివరించింది.

HT Telugu Desk

సంబంధిత కథనం