PURE EV : జియోథింగ్స్‌తో ఇప్పుడు మరింత 'స్మార్ట్'గా ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికిల్ రైడింగ్..
PURE EV JioThings : జియోథింగ్స్‌తో ప్యూర్ ఈవీ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. కస్టమర్ల అనుభూతిని మెరుగుపరిచేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ చెబుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భారత దేశ లీడింగ్ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన ప్యూర్ ఈవీ కీలక్ అప్డేట్ ఇచ్చింది. జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన జియోథింగ్స్ లిమిటెడ్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. దీని ప్రకారం.. జియోథింగ్స్కి సంబంధించిన స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లు, టెలీమ్యాటిక్స్ని తమ ఎలక్ట్రిక్ వాహనాల్లోకి అనుసంధానించనున్నట్టు ప్యూర్ ఈవీ పేర్కొంది. అధునాతన ఐఓటీ సొల్యూషన్స్, నిరాటంకమైన కనెక్టివిటీ, సమగ్రమైన డిజిటల్ అనుసంధానతను ఉపయోగించుకుంటూ తమ కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించమే ఈ భాగస్వామ్య లక్ష్యం అని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ వెల్లడించింది.
ప్యూర్ ఈవీ- జియో థింగ్స్ హైలైట్స్..
తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పనితీరు, ఇంటారాక్టివిటీని మెరుగుపర్చేందుకు ఐఓటీ సొల్యూషన్స్‌తో పాటు జియోథింగ్స్ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లను అనుసంధానించడంపై ఇప్పుడు ప్యూర్ ఈవీ దృష్టిపెడుతుంది. 4జీ కనెక్టివిటీ ఆధారిత టెలీమ్యాట్రిక్స్ అనేది కస్టమర్లు రియల్ టైమ్‌లో వెహికిల్ పర్ఫార్మెన్స్ని పర్యవేక్షించేందుకు, మరింత మెరుగైన పర్ఫార్మెన్స్ని సాధించేందుకు ఉపయోగపడుతుంది.
జియోథింగ్స్ 4జీ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఆధారిత avniOSని ఉపయోగించుకుంటుంది. ఇది రియల్ టైమ్ డేటా ఎనలటిక్స్, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన ఇంటర్ఫేస్ కస్టమైజేషన్, ఫుల్ హెచ్డీ+ టచ్‌స్క్రీన్ డిస్ప్లే కంపాటబిలిటీని అందిస్తుంది. ఓఈఎంలు తమ ప్రాడక్ట్స్‌లో ఐఓటీ సొల్యూషన్స్‌ని అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ విప్లవాత్మక డిజిటల్ క్లస్టర్ ఉపయోగపడుతుంది.
జియో ఆటోమోటివ్ యాప్ సూట్ అనేది వాహనాల్లో అనుసంధానించే మరొక సొల్యూషన్! ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాల యూజర్ల కోసం రూపొందించిన జియోస్టోర్, మ్యూజిక్ స్ట్రీమింగ్, వెబ్ బ్రౌజింగ్, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్టెన్స్, నేవిగేషన్, గేమింగ్ లాంటి ఎన్నో ప్రొడక్ట్స్, సొల్యూషన్స్ ఇందులో ఉంటాయి.
"మా వాహనాల్లో జియోథింగ్స్ అత్యుత్తమ ఐఓటీ సామర్థ్యాలను పొందుపర్చడం వల్ల ప్యూర్ ఈవీ ప్రాడక్ట్స్‌ని పరిశ్రమలోనే అత్యుత్తమ ప్రమాణాలతో ఉండేలా తీర్చిదిద్దేందుకు ఒక చక్కని అవకాశం లభించింది. మా వాహనాల సామర్థ్యాలు, ఇంటరాక్టివిటీని మెరుగుపర్చడం ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీని పునర్నిర్వచించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. మెరుగైన కనెక్టివిటీ, పనితీరు, సౌలభ్యం ద్వారా కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా ఈవీ వ్యవస్థను మార్చే అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశగా ఈ భాగస్వామ్యం ఒక కీలక అడుగు," అని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు, ఎండీ డా. నిశాంత దొంగారి తెలిపారు.
"ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో కొత్త ఆవిష్కరణలు, శ్రేష్ఠత సాధించాలనే ఉమ్మడి లక్ష్యం గల ప్యూర్ ఈవీతో పార్ట్నర్ అవ్వడం సంతోషంగా ఉంది. మా అధునాతన ఐఓటీ సొల్యూషన్స్‌ని అనుసంధానించడం ద్వారా తమ కస్ట్మర్లకు అత్యుత్తమ ఎలక్ట్రిక్ వాహన అనుభూతిని అందించడంలో, పనితీరు, కనెక్టివిటీ పరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పడంలో ప్యూర్ ఈవీకి తోడ్పాటు అందించాలనేది మా లక్ష్యం," అని జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఆశీష్ లోథా తెలిపారు.
సంబంధిత కథనం