PURE EV : ఎలక్ట్రిక్​ స్కూటర్ల కోసం సరికొత్త ప్లాట్​ఫామ్​- ప్యూర్​ ఈవీతో ప్రయాణం ఇక మరింత సాఫీగా..-pure ev launches x platform 3 0 to revolutionize electric mobility ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Pure Ev : ఎలక్ట్రిక్​ స్కూటర్ల కోసం సరికొత్త ప్లాట్​ఫామ్​- ప్యూర్​ ఈవీతో ప్రయాణం ఇక మరింత సాఫీగా..

PURE EV : ఎలక్ట్రిక్​ స్కూటర్ల కోసం సరికొత్త ప్లాట్​ఫామ్​- ప్యూర్​ ఈవీతో ప్రయాణం ఇక మరింత సాఫీగా..

Sharath Chitturi HT Telugu
Jan 25, 2025 01:13 PM IST

ఎలక్ట్రిక్ మొబిలిటీలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా X ప్లాట్‌ఫామ్​ని 3.0ని ప్యూర్​ ఈవీ సంస్థ ఆవిష్కరించింది. ఏఐ టెక్నాలజీతో క్రేజీ అప్​గ్రేడ్స్ చేసింది. ఫలితంగా ప్రయాణం మరింత సాఫీగా సాగిపోనుంది.

ప్యూర్​ ఈవీ సరికొత్త ప్లాట్​ఫామ్​..
ప్యూర్​ ఈవీ సరికొత్త ప్లాట్​ఫామ్​..

భారత్‌లో ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాల్లో ఒకటైన ప్యూర్ ఈవీ తమ X ప్లాట్‌ఫామ్​కి గణనీయమైన అప్‌గ్రేడ్ చేస్తూ.. X ప్లాట్‌ఫామ్​ 3.0ను ప్రకటించింది. వెహికిల్​ పర్ఫార్మెన్స్​, కనెక్టివిటీ, రైడర్ సౌకర్యాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో అధునాతన ఫీచర్లు పొందుపర్చిన ఈ ప్లాట్​ఫామ్​.. అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో వస్తోంది.

yearly horoscope entry point

ప్యూర్​ ఈవీ కొత్త ప్లాట్‌ఫామ్​..

X ప్లాట్‌ఫామ్​ 3.0కి సంబంధించిన ప్రత్యేకతల్లో థ్రిల్ మోడ్‌ ఒకటి. ఇది టార్క్‌కు ఊతమిచ్చి, పనితీరును 25శాతం మేర మెరుగుపరుస్తుంది. తద్వారా యూజర్లకు మరింత ఉత్తేజకరమైన రైడింగ్ ఎక్స్​పీరియెన్స్​ని అందిస్తుంది. ఎలక్ట్రిక్ వాహన పర్ఫార్మెన్స్​లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ డైనమిక్, పవర్​ఫుల్​ డ్రైవ్‌ను కోరుకునే వారి కోసం ఈ ఫీచరు డిజైన్ చేశామని ప్యూర్​ ఈవీ చెబుతోంది.

“X ప్లాట్‌ఫామ్​ 3.0 ఆవిష్కరణతో, అధునాతన ఏఐ టెక్నాలజీలను నిరాటంకంగా అనుసంధించడం ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవానికి సంబంధించి తదుపరి దశలోకి అడుగుపెడుతున్నాం. ప్యూర్ ఈవీకి మాత్రమే పరిమితమైన ఈ ప్లాట్‌ఫామ్​, భారతీయ ఆవిష్కరణలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న మా ఆకాంక్షలను ప్రతిఫలిస్తుంది. వాహనాలను కేవలం రవాణా సాధనాలుగానే కాకుండా, మా కస్టమర్లకు అసమానమైన డ్రైవింగ్ అనుభూతినిస్తూ మొబిలిటీ కాన్సెప్ట్​ని పునర్నిర్వచించే, తెలివైన, కనెక్టెడ్ డివైజ్​లుగా మేము పరిగణిస్తాం,” అని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు, ఎండీ డా. నిశాంత్ దొంగారి తెలిపారు.

రైడర్ బిహేవియర్​ని అర్థం చేసుకుని, వివిధ రకాల రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించే అధునాతనమైన ప్రెడిక్టివ్ ఏఐ అనే సిస్టంతో ఈ ప్లాట్‌ఫామ్​ అనుసంధానమై ఉంటుంది. విశ్వసనీయతే ప్రధానంగా ఉండే ఈ ఫీచర్​.. “చికిత్స కన్నా నివారణ మేలు” అనే సూత్రం ఆధారంగా పని చేస్తుంది! తద్వారా సమస్యలు తలెత్తడానికి ముందే, వాటిని గుర్తించి0 పరిష్కరించడంతో వాహన అప్‌టైమ్ 100 శాతం ఉండేందుకు తోడ్పడుతుందని సంస్థ చెబుతోంది. క్లౌడ్ ఏఐతో కలిసి, ఈ ప్లాట్‌ఫామ్​ ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్లు, అప్‌గ్రేడ్లను అందిస్తుంది. తద్వారా వాహనం సాఫ్ట్‌వేర్‌ అప్-టు-డేట్ ఉండేలా, పూర్తి స్థాయిలో పనిచేయగలిగేలా చూసేందుకు తోడ్పడుతుంది.

నెక్ట్స్-జనరేషన్ టీఎఫ్‌టీ డ్యాష్‌బోర్డ్ అనేది ప్యూర్​ ఈవీ X ప్లాట్‌ఫామ్​ 3.0లో మరో ప్రత్యేకత. ఇది ఐఓఎస్​, ఆండ్రాయిడ్ డివైజ్‌లతో నిరాటంకంగా కనెక్ట్ అవుతుంది. ఈ ఆధునిక డ్యాష్‌బోర్డ్, రియల్-టైమ్ నేవిగేషన్ మ్యాప్‌లు, బ్యాటరీ హెల్త్ అప్‌డేట్‌లు, రేంజ్​ అంచనాలతో పాటు మరెన్నో స్మార్ట్ ఫీచర్లను అందిస్తుంది. తద్వారా కీలక వివరాలన్నీ రైడర్లకు ఇట్టే అందుబాటులో ఉండేలా చూస్తుంది.

ఈ ఫీచర్లన్నింటి మేళవింపు కారణంగా పరిశ్రమలోనే కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ.. ఎలక్ట్రిక్ వాహన సాంకేతికతలో X ప్లాట్‌ఫామ్​ 3.0 అనేది ఒక విశిష్టమైన పురోగతిగా నిలుస్తుందని సంస్థ చెబుతోంది.

విజయవంతమైన గత ప్లాట్‌ఫామ్​ అండతో, ఈ నూతన ప్లాట్‌ఫామ్​లోను న్యూ జెన్ స్మార్ట్ ఏఐ ఆధారిత వెహికల్ కంట్రోల్ యూనిట్, రీజెనరేటివ్ బ్రేకింగ్, కోస్టింగ్ రీజెన్, మెరుగుపర్చిన ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టం, స్విఫ్ట్ థ్రోటిల్ రెస్పాన్స్, అత్యంత సమర్ధవంతమైన పవర్‌ట్రెయిన్ మొదలైన ఫీచర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా కస్టమర్‌కు మెరుగైన అనుభూతిని అందించడంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పరిశ్రమ ప్రమాణాలను సరికొత్తగా నిర్వచిస్తాయి.

ప్రాథమికంగా.. X ప్లాట్‌ఫామ్​ 3.0 ప్యూర్ ఈవీ ప్రీమియం మోడల్స్ అయిన ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్​ స్కూటర్​, ఈట్రైస్ట్ ఎక్స్​లో అందుబాటులో ఉంటుంది. 2025 సంవత్సరం ఆఖరు నాటికి దీన్ని మిగతా అన్ని మోడల్స్‌కి అందుబాటులోకి తెచ్చే ప్రణాళికలు ఉన్నాయి. X ప్లాట్‌ఫామ్​ 3.0ను ఆవిష్కరించడమనేది.. ఎలక్ట్రిక్ వాహనాలను రోజువారీ జీవితంలో భాగం చేసే క్రమంలో సుస్థిరమైన, తెలివైన మొబిలిటీ సొల్యూషన్స్‌ని అందించే ప్రయత్నాలకు సారథ్యం వహించాలన్న ప్యూర్ ఈవీ లక్ష్యానికి అనుగుణమైనదిగా ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం