లిథియం అయాన్ బ్యాటరీల జీవితకాలాన్ని రెట్టింపు చేసే దిశగా బీ ఎనర్జీ ఫ్రాన్స్‌తో జట్టు కట్టిన ప్యూర్ ఈవీ-pure ev and be energy team up to double battery life ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  లిథియం అయాన్ బ్యాటరీల జీవితకాలాన్ని రెట్టింపు చేసే దిశగా బీ ఎనర్జీ ఫ్రాన్స్‌తో జట్టు కట్టిన ప్యూర్ ఈవీ

లిథియం అయాన్ బ్యాటరీల జీవితకాలాన్ని రెట్టింపు చేసే దిశగా బీ ఎనర్జీ ఫ్రాన్స్‌తో జట్టు కట్టిన ప్యూర్ ఈవీ

HT Telugu Desk HT Telugu

లిథియం అయాన్ బ్యాటరీల జీవితకాలాన్ని రెట్టింపు చేసే దిశగా బీ ఎనర్జీ ఫ్రాన్స్‌తో ప్యూర్ ఈవీ సంస్థ జట్టు కట్టింది. 2026 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ ఐడీఏలో తొలి కేంద్రం అందుబాటులోకి రానుంది.

లిథియం అయాన్ బ్యాటరీల జీవితకాలాన్ని రెట్టింపు చేసే దిశగా బీ ఎనర్జీ ఫ్రాన్స్‌తో ప్యూర్ ఈవీ సంస్థ జట్టు

హైదరాబాద్: భారతదేశపు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాల్లో ఒకటైన ప్యూర్ ఈవీ సంస్థ, ఫ్రాన్స్‌కి చెందిన అగ్రగామి క్లైమేట్ టెక్ కంపెనీ బీ ఎనర్జీతో (BE Energy) వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. భారత్‌లో ఈ తరహా భాగస్వామ్యాల్లో ఇదే మొట్టమొదటిది. అధునాతన Li-Ion బ్యాటరీ రీకండీషనింగ్ సాంకేతికతను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు, ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించి సుస్థిరత, డీకార్బనైజేషన్‌ ప్రయత్నాలకు మరింతగా ఊతమిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది.

బ్యాటరీ రీకండీషనింగ్‌లో అంతర్జాతీయ దిగ్గజమైన బీ ఎనర్జీ, ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ భాగస్వామ్యమనేది, ప్యూర్ ఈవీ రూపొందించి, పేటెంట్ పొందిన బ్యాట్రిక్స్‌ఫారడే సాంకేతికత, బీ ఎనర్జీకి చెందిన పేటెంటెడ్ హై-టెక్ పరికరాల సమ్మేళనాన్ని వినియోగంలోకి తెస్తుంది. భారత్‌లో లిథియం అయాన్ బ్యాటరీల రీకండీషనింగ్ విభాగంలో తొలి పూర్తి స్థాయి సంస్థగా నిలవాలనేది ప్రధాన లక్ష్యం.

ఖర్చు తగ్గుతుంది

రీకండీషనింగ్/పునరుజ్జీవ ప్రక్రియ వల్ల కొత్త బ్యాటరీల అవసరం తగ్గి, మొత్తం ఖర్చులు కూడా తగ్గుతాయి కాబట్టి ఈవీ ఓనర్లకు దీర్ఘకాలికంగా గణనీయంగా ఆదా ప్రయోజనాలు కల్పించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదు. బ్యాటరీ జీవితకాలంపై వాణిజ్య బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లో విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా భారత్ మరింత స్వచ్ఛమైన, మరింత సుస్థిరమైన మొబిలిటీ వ్యవస్థ వైపు మళ్లే ప్రక్రియ మరింత వేగవంతమయ్యేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది.

“బీ ఎనర్జీతో మా భాగస్వామ్యమనేది మన్నికైన మరియు డబ్బుకు తగిన విలువను చేకూర్చే ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించాలన్న ప్యూర్ ఈవీ దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. భారత్‌లో బీ ఎనర్జీ తొలి భాగస్వామిగా, ‘రీ-సేల్’ విలువపై సంబంధిత వర్గాలు, అంటే ఆర్థిక సంస్థలు, అంతిమంగా వినియోగించే యూజర్లలో నమ్మకం పెంచడంలో మాకున్న నిబద్ధతకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుంది. ఈవీ ద్విచక్ర వాహనాలు, ఈఎస్ఎస్ మార్కెట్ల భవిష్యత్ రూపురేఖలను మార్చడంలో కీలక పాత్ర పోషించడంపై మేం ఆసక్తిగా ఉన్నాం” అని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు మరియు ఎండీ Dr. నిశాంత దొంగారి తెలిపారు.

కర్బన ఉద్గారాలు తగ్గుతాయి

“ప్యూర్ ఈవీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం, అలాగే భారత్‌లో అధునాతన బ్యాటరీ రీకండీషనింగ్ టెక్నాలజీ, పరికరాలను ప్రవేశపెట్టనుండటంపై మేం సంతోషంగా ఉన్నాం. ఈవీ రంగంలో సుస్థిరతకు తోడ్పడటం, కర్బన ఉద్గారాలను తగ్గించే క్రమంలో ఆఖరు దశలో ఉన్న, లోపాలున్న బ్యాటరీలను రీకండీషనింగ్ చేయడం ద్వారా పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపాలన్న మా నిబద్ధతకు ఈ భాగస్వామ్యం నిదర్శనంగా నిలుస్తుంది” అని బీ ఎనర్జీ వ్యవస్థాపకుడు, గ్లోబల్ ప్రెసిడెంట్ బెర్ట్రాండ్ కోస్ట్ (Bertrand Coste) తెలిపారు.

సుస్థిరత, నవకల్పనల విషయంలో ప్యూర్ ఈవీ, బీ ఎనర్జీ ఉమ్మడిగా ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నాయని తెలిపారు. హరిత సాంకేతికత విషయంలో భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా తోడ్పాటు అందించేలా, ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉంటుందని వివరించారు. 2026 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ ఐడీఏలో తొలి కేంద్రం అందుబాటులోకి రానుంది.

సంబంధిత కథనం