గురువారం స్టాక్ మార్కెట్లలో ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌ఈడీఏ షేరు ధర 5 శాతం పెరిగింది. అయితే, క్లోజింగ్ సమయంలో కాస్త తడబడింది. బీఎస్ఈ లో 0.74 శాతం నష్టంతో రూ. 193.30 వద్ద ముగిసింది. ఐపీఓ ధరతో పోలిస్తే కంపెనీ షేర్లు ఇప్పటివరకు 540 శాతం పెరిగాయి. అంటే ఈ పీఎస్‌యూ స్టాక్ ఇన్వెస్టర్లకు భారీ రాబడులను ఇచ్చింది.
గత 7 నెలల్లో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు భారీ రాబడులను ఇచ్చాయి. లిస్టింగ్ అయినప్పటి నుంచి ఈ స్టాక్ వరుసగా పెరుగుతూనే ఉంది. దీని వల్ల ఇన్వెస్టర్లు భారీగా లబ్ధి పొందారు.
సీఎన్‌బీసీ టీవీ 18 నివేదిక ప్రకారం, టెక్నికల్ అనలిస్ట్ రాజేష్ సత్పుత్ ఈ స్టాక్ రూ . 200 నుండి రూ. 215 మధ్య ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మరో 8 నెలల్లో రూ. 250 స్థాయికి చేరుకోవచ్చు. షేరు ధర రూ. 160 స్థాయిలో ఉంటే దానిని కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టడం మంచిదని ఆయన అన్నారు.
2024 జనవరి నుంచి మార్చి వరకు ఐఆర్ఈడీఏ మొత్తం లాభం రూ. 337 కోట్లు. గత ఏడాది మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఇది 33 శాతం అధికం. ఈ త్రైమాసికంలో ఐఆర్ఈడీఏ రూ. 253.60 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఏప్రిల్‌లో ఈ సంస్థకు 'నవరత్న' హోదా లభించింది. దీంతో 2030 నాటికి 'మహారత్న'గా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గత ఏడాది నవంబర్లో ఐఆర్ఈడీఏ ఐపీఓ వచ్చింది. అప్పుడు కంపెనీ ఐపీఓ ధర రూ. 32గా ఉంది. కానీ కేవలం కొద్ది నెలల్లోనే ఈ పీఎస్‌యూ కంపెనీ షేరు ధర రూ. 214కు చేరింది. ఈ ఏడాది కంపెనీ షేరు ధర 90 శాతం పెరిగింది.
(డిస్‌క్లెయిమర్: ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు తెలివైన నిర్ణయం తీసుకోండి. ఇక్కడ సమర్పించిన నిపుణుల అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి. )