Promate XWatch-S19: ప్రొ మేట్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్ ‘ఎక్స్ వాచ్ - ఎస్19’; ధర ఎంతో తెలుసా?-promate xwatch s19 smartwatch priced at 3999 rupees on launch ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Promate Xwatch-s19 Smartwatch Priced At 3999 Rupees On Launch

Promate XWatch-S19: ప్రొ మేట్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్ ‘ఎక్స్ వాచ్ - ఎస్19’; ధర ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Aug 02, 2023 03:07 PM IST

Promate XWatch-S19: లేటెస్ట్ స్మార్ట్ వాచ్ మోడల్ ఎక్స్ వాచ్ - ఎస్19 ను ప్రొమేట్ సంస్థ బుధవారం లాంచ్ చేసింది. స్క్వేర్ డిజైన్ తో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఈ ప్రొమేట్ ఎక్స్ వాచ్ - ఎస్19 స్మార్ట్ వాచ్ ను తీర్చిదిద్దారు. లాంచింగ్ తో పాటు ఈ స్మార్ట్ వాచ్ ధరను కూడా ప్రకటించారు.

ప్రొమేట్ ఎక్స్ వాచ్ - ఎస్19 స్మార్ట్ వాచ్
ప్రొమేట్ ఎక్స్ వాచ్ - ఎస్19 స్మార్ట్ వాచ్ ( Promate )

Promate XWatch-S19: లేటెస్ట్ స్మార్ట్ వాచ్ మోడల్ ఎక్స్ వాచ్ - ఎస్19 ను ప్రొమేట్ సంస్థ బుధవారం లాంచ్ చేసింది. స్క్వేర్ డిజైన్ తో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఈ ప్రొమేట్ ఎక్స్ వాచ్ - ఎస్19 స్మార్ట్ వాచ్ ను తీర్చిదిద్దారు. లాంచింగ్ తో పాటు ఈ స్మార్ట్ వాచ్ ధరను కూడా ప్రకటించారు. ఈ స్మార్ట్ వాచ్ ధరను రూ. 3,999 గా నిర్ణయించారు.

ట్రెండింగ్ వార్తలు

భారీ డిస్ ప్లే..

ఈ ప్రొమేట్ ఎక్స్ వాచ్ - ఎస్19 స్మార్ట్ వాచ్ లో 1.95 ఇంచ్ ల భారీ డిస్ ప్లే ను ఏర్పాటు చేశారు. అలాగే, ఇందులో ఎడ్జ్ టు ఎడ్జ్ సెమీ కర్వ్డ్ టీఎఫ్టీ డిస్ ప్లే ఉంది. ఇప్పటివరకు ఇండియాలో ఉన్న అన్ని స్మార్ట్ వాచెస్ కన్నా దీని స్క్రీన్ టు బాడీ నిష్పత్తి (screen-to-body ratio) ఎక్కువ. ఈ స్మార్ట్ వాచ్ బ్రైట్ నెస్ కూడా మిగతా స్మార్ట్ వాచెస్ తో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ స్మార్ట్ వాచ్ బ్రైట్ నెస్ గరిష్టంగా 500 నిట్స్ ఉంటుంది. రిజొల్యూషన్ 240X282. మాస్క్యులైన లుక్ తో కనిపించే ఈ స్మార్ట్ వాచ్ బరువు 40 గ్రాములు మాత్రమే.

ఇవీ ఫీచర్స్

ఈ ప్రొమేట్ ఎక్స్ వాచ్ - ఎస్19 స్మార్ట్ వాచ్ లో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సీజన్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా, దాదాపు 100 కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఇవి అథ్లెట్లకు, రెగ్యులర్ గా వర్కౌట్స్ చేసేవారికి, జిమ్ కు వెళ్లేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఈ వాచ్ ను ‘ఎక్స్ వాచ్ (XWatch app) యాప్ తో కనెక్ట్ చేసుకోవడం ద్వారా మీ వర్కౌట్స్ కు సంబంధించిన పూర్తి రిపోర్ట్స్ పొందవచ్చు.

బ్లూటూత్ టెక్నాలజీ

ఈ ప్రొమేట్ ఎక్స్ వాచ్ - ఎస్19 స్మార్ట్ వాచ్ బ్లూటూత్ 5.1 టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లతో సింక్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ ఫ్రీ బ్లూటూత్ కాలింగ్ సదుపాయం ఉంది. నోటిఫికేషన్స్, కాల్స్,మెసేజెస్ ను నేరుగా చూసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ తో పాటు రెండు గ్రేడ్ 1 సిలికాన్ స్ట్రాప్స్, రెండు వైర్ లెస్ చార్జర్స్ లభిస్తాయి. ఈ స్మార్ట్ వాచ్ లోని బ్యాటరీ కనీసం 10 నుంచి 12 రోజులు వస్తుంది. ఈ వాచ్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కూడా.

WhatsApp channel