Samsung Galaxy S21: సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 పై భారీ డిస్కౌంట్; నమ్మశక్యం కాని ధరకు ఇలా కొనేయండి..
Samsung Galaxy S21: సామ్సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి వచ్చిన మరో సక్సెస్ ఫుల్ మోడల్ ఎస్ 21 ఎఫ్ఈ (Samsung Galaxy S21 FE). గ్రేట్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ తో వినియోగదారులను ఈ ఫోన్ విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోన్ మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు లభిస్తోంది.
Samsung Galaxy S21: సామ్సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి వచ్చిన మరో సక్సెస్ ఫుల్ మోడల్ ఎస్ 21 ఎఫ్ఈ (Samsung Galaxy S21 FE). గ్రేట్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ తో వినియోగదారులను ఈ ఫోన్ విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోన్ మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు లభిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
ఫీచర్స్ ఇవే..
సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ (Samsung Galaxy S21 FE) ఇప్పుడు అత్యంత చవగ్గా లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 6.4 ఇంచ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. వెనుకవైపు 12 ఎంపీ, 12 ఎంపీ, 8 ఎంపీ, సెల్ఫీల కోసం ముందువైపు 32 ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో నమ్మశక్యం కానీ, అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది.
ఎంత డిస్కౌంట్?
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ (Samsung Galaxy S21 FE) వేరియంట్ ఒరిజినల్ ధర రూ. 74,999. వివిధ డిస్కౌంట్ ఆఫర్స్ అనంతరం ఈ ఫోన్ ను కేవలం రూ. 39,999 లకే పొందవచ్చు. అంటే, దాదాపు 46% డిస్కౌంట్. ఇదే ఫైనల్ ప్రైస్ కాదు. ఇంకా ఆఫర్స్ ఉన్నాయి. అవి ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, బ్యాంక్ ఆఫర్స్. మీ దగ్గర ఉన్న వర్కింగ్ కండిషన్ లో ఉన్న స్మార్ట్ ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేసుకుంటే ఈ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ పై రూ. 35 వేల వరకు ఎక్స్ చేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, మీరు ఎక్స్ చేంజ్ చేస్తున్న ఫోన్ బ్రాండ్, మోడల్, కండిషన్ ఆధారంగా ఎక్స్ చేంజ్ బోనస్ ఉంటుంది. ఒకవేళ్ మీరు ఈ ఫోన్ ను హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీరు చెల్లిస్తున్న మొత్తం రూ. 15 వేల కన్నా ఎక్కువ ఉంటే, మీకు రూ. 1250 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. లేదా సామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 10% క్యాష్ బ్యాక్ లభిస్తుంది.