Ultraviolette F77 | ఇది కదా అసలు సిసలైన స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్ అంటే..!-presenting the ultraviolette f77 electric hyper bike check features specs price range ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Presenting The Ultraviolette F77 Electric Hyper Bike, Check Features, Specs, Price Range

Ultraviolette F77 | ఇది కదా అసలు సిసలైన స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్ అంటే..!

Manda Vikas HT Telugu
Oct 16, 2022 11:17 AM IST

Ultraviolette F77 Electric Bike: రహదారులపై వాయువేగంతో దూసుకుపోయే సూపర్ స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్ అల్ట్రావయొలెట్ F77 విశేషాలు తెలుసుకోండి. ఇది మేడ్- ఇన్- ఇండియా బైక్.

Ultraviolette F77
Ultraviolette F77

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుంది. ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే, ఇప్పటివరకు లాంచ్ అయిన వాటిలో ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ బైక్‌లు కొన్ని వచ్చినా అవి సాధారణ బైక్‌ల లాగే ఉన్నాయి. అసలు సిసలైన స్స్పోర్ట్స్ మోడల్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఇండియాలో ఇంకా రాలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడినట్లయింది. అల్ట్రావయొలెట్ అనే సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రాబోతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. (Also Read: డుగ్గు డుగ్గు సౌండ్ లేని ఎలక్ట్రిక్ బుల్లెట్ బైక్)

ట్రెండింగ్ వార్తలు

TVS మోటార్ కంపెనీ అనుబంధంగా ఉన్న అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్, తమ బ్రాండ్ నుంచి ఎంతగానో ఆసక్తిని కలుగజేస్తున్న Ultraviolette F77 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను నవంబర్ 24, 2022న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తొలుత బెంగళూరుతో ప్రారంభించి, ఆ తర్వాత దశల వారీగా మిగతా నగరాలలోనూ రోల్-అవుట్ చేయడానికి అల్ట్రావైలెట్ ప్లాన్ చేసింది. ఒక్క ఇండియాలోనే మాత్రమే కాదు, తమ ఈ Ultraviolette F77 హైపర్‌బైక్‌ను యూరప్, యూఎస్‌ దేశాలలో కూడా విడుదల చేయడానికి EV స్టార్టప్ ప్లాన్ చేస్తోంది.

Ultraviolette F77 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ చాలా స్టైలిష్‌గా, స్పోర్టియర్ లుక్‌ను కలిగి ఉంది. ఫీచర్ల పరంగా, యాంత్రికంగా కూడా ఈ బైక్ అత్యుత్తమంగా ఉంది. ఇండియాలోనే కాకుండా విదేశీ మార్కెట్లోనూ విక్రయిస్తున్నందున గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా తమ హైపర్‌బైక్‌ను అన్ని అంశాలను మెరుగ్గా అందజేస్తున్నట్లు అల్ట్రావయొలెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నిరాజ్ రాజ్‌మోహన్ తెలిపారు. భారతదేశంలో, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో విక్రయించే Ultraviolette F77 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌కు ఎటువంటి తేడా ఉండదని ఆయన స్పష్టం చేశారు.

Ultraviolette F77 బ్యాటరీ రేంజ్, స్పెసిఫికేషన్లు

అల్ట్రావయొలెట్ F77 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో 4.2kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ (మూడు మాడ్యులర్ లి-అయాన్ బ్యాటరీలు) ఉంటుంది. దీని శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ 2,250rpm వద్ద 33.52bhp శక్తిని, 90Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 2.9 సెకన్లలోనే సున్నా నుండి 60 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, 7.5 సెకన్లలో 100km/h వేగాన్ని అందుకుంటుంది. అలాగే గంటకు 147 కిమీల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. ఈ ఇ-మోటార్‌సైకిల్ ఒక్క ఛార్జ్‌పై 200 కిమీల పరిధిని అందించగలదని అంచనా.

ప్రామాణిక ఛార్జింగ్ పాయింట్‌ని ఉపయోగించి దీని బ్యాటరీ ప్యాక్‌ని పూర్తి సామర్థ్యానికి ఛార్జ్ చేయడానికి సుమారు 5 గంటలు పడుతుంది. అయితే, ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 1.5 గంటల సమయంలోనే ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ బరువు 158 కిలోలు.

Ultraviolette F77 ఫీచర్లు

ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అయినందున, Ultraviolette F77లో పూర్తి-LED లైటింగ్ సిస్టమ్, పెద్దగా ఉండే ఫుల్-కలర్ TFT డాష్, 3 రైడ్ మోడ్‌లు, LTE కనెక్టివిటీతో ఇంటిగ్రేటెడ్ eSim, 9-యాక్సిస్ IMU, షాక్, ఇంపాక్ట్ సెన్సార్లతో సహా ఇతర కస్టమైజ్డ్ ఫీచర్లు ఉంటాయి.

Ultraviolette F77 ధరలు

అల్ట్రావయొలెట్ F77 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎయిర్‌స్ట్రైక్, షాడో, లేజర్ అనే మూడు విభిన్న వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. వీటి ఆధారంగా ధరలు రూ. 1.50 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. అయితే వాస్తవ ధరలు ఎంత వరకు ఉంటాయనేది ఈ బైక్ లాంచ్ సమయంలోనే తెలుస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం