PPF account: పీపీఎఫ్ లో పెట్టుబడులకు ఈ సమస్యలున్నాయి తెలుసా?-ppf account why you should not invest in public provident fund top 5 reasons ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Ppf Account: Why You Should Not Invest In Public Provident Fund? Top 5 Reasons

PPF account: పీపీఎఫ్ లో పెట్టుబడులకు ఈ సమస్యలున్నాయి తెలుసా?

HT Telugu Desk HT Telugu
May 19, 2023 03:20 PM IST

PPF account: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund PPF) లో పెట్టుబడులు సురక్షితం. వీటిపై వడ్డీకి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ముఖ్యంగా వేతనజీవులు కానివారికి ఇది అనువైన భవిష్యత్ ప్రణాళిక పెట్టుబడి. కానీ ఇందులోనూ కొన్ని సమస్యలున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Mint)

PPF account: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund PPF) ఒక మంచి దీర్ఘాకాలిక పొదుపు పథకం. ప్రస్తుతం ఇందులోని పెట్టుబడులకు 7.1% వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ పొదపు పథకంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అవేంటంటే..

ట్రెండింగ్ వార్తలు

PPF account: వడ్డీ రేటు తక్కువ

ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) లో లభించే వడ్డీ రేటు ఎంప్లాయి ప్రావిడెండ్ ఫండ్ (EPF) లో లభించే వడ్డీ రేటు కన్నా తక్కువ. అందువల్ల ఉద్యోగస్తులు పీపీఎఫ్ ను పెద్దగా ప్రిఫర్ చేయరు. ఈపీఎఫ్ లో ప్రస్తుతం 8.15% వార్షిక వడ్డీ రేటు లభిస్తోంది. పీపీఎఫ్ లో అది 7.1% మాత్రమే. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకునే ఉద్దేశంతోనే చాలామంది పీపీఎఫ్ లో పెట్టుబడులు పెడ్తుంటారు. అయితే, పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందడానికి కూడా పీపీఎఫ్ కన్నా వీపీఎఫ్ (Voluntary Provident Fund VPF) మంచిదని మై ఫండ్ బజార్ సీఈఓ వినీత్ ఖండారే సూచిస్తున్నారు.

PPF account: లాకిన్ పీరియడ్ ఎక్కువ

పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్ కావడానికి పట్టే సమయం చాలా ఎక్కువ. పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్ కావడానికి 15 సంవత్సరాలు ఎదురు చూడాలి. ఆ లోపు ఆర్థిక అవసరాలకు ఆ డబ్బులు ఉపయోగపడవు. దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందాలనుకునేవారికి మాత్రమే ఈ పొదుపు పథకం అనువైనది.

PPF account: ఫిక్స్ డ్ గరిష్ట డిపాజిట్ లిమిట్

పీపీఎఫ్ ఖాతాలో గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ లిమిట్ ను ప్రభుత్వం పెంచలేదు. ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేయాలనుకునేవారికి ఈ స్కీమ్ ఉపయోగపడదు. వారు ఒకవేళ ఉద్యోగస్తులైతే, వీపీఎఫ్ (Voluntary Provident Fund VPF) వారికి అనువైన పథకం. అందులో పూర్తి పన్ను మినహాయింపు ప్రయోజనాలతో ఏటా రూ. 2.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.

PPF account: ముందే విత్ డ్రా చేయలేం..

పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ గడువు 15 సంవత్సరాలు. ఈ లోపు డబ్బు అవసరమై, కొంత మొత్తం విత్ డ్రా చేయాలనుకుంటే, చాలా షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. ఖాతా ఓపెన్ చేసిన తరువాత ఐదేళ్ల వరకు, అదికూడా ఖాతా ఓపెన్ చేసిన సంవత్సరాన్ని మినహాయించి, విత్ డ్రా చేయడానికి వీలు లేదు. ఆ తరువాత కూడా, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక సారి మాత్రమే, 1% వడ్డీ తగ్గింపుతో విత్ డ్రా చేయడానికి వీలుంటుంది.

PPF account: ముందే క్లోజ్ చేయడం కూడా కష్టం

పీపీఎఫ్ నిబంధనల ప్రకారం.. పీపీఎఫ్ ఖాతాను కింది షరతులకు లోబడి ముందే మూసేయవచ్చు.

  • ఖాతాదారుడికి కానీ, లేదా ఖాతాదారుడి జీవిత భాగస్వామికి కానీ, మైనర్ పిల్లలకు కానీ ప్రాణాంతక జబ్బు ఉంటే..
  • ఖాతాదారుడు, లేదా ఖాతాదారు పిల్లలు ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే..
  • ఖాతాదారుడి రెసిడెన్సీ స్టేటస్ మారితే..
  • ముందే క్లోజ్ చేస్తే, అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 1% వడ్డీ తగ్గిస్తారు. అందువల్ల, అకౌంట్ ను మూసేయడానికి బదులు.. ప్రతీ సంవత్సరం కనిష్ట మొత్తమైన రూ. 500 లను ఆ ఖాతాలో జమ చేస్తూ ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
  • ఈ కథనంలోని సూచనలు నిపుణులు చేసిన సిఫారసులు మాత్రమే. పెట్టుబడులు పెట్టేముందు అధీకృత నిపుణుల సలహా తీసుకోవడం సముచితం.

WhatsApp channel