Valentine Day Sale : వాలెంటైన్ డే సేల్.. ఈ స్మార్ట్ ఫోన్ల మీద డిస్కౌంట్.. డబ్బులు సేవ్ చేసుకోండి!
POCO Valentine Day Sale : పోకో వాలెంటైన్స్ డే సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను బంపర్ డిస్కౌంట్లతో విక్రయిస్తున్నారు. పోకో 'ఎం', 'ఎక్స్' సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తోంది.

స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో వాలెంటైన్స్ డే సేల్ అందిస్తుంది. ఈ సేల్‌లో పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారు. పోకో 'ఎం', 'ఎక్స్' సిరీస్ ఫోన్ల తగ్గింపు పొందవచ్చు. పోకో ఈ సేల్ 2025 ఫిబ్రవరి 14న ముగుస్తుంది. మీ ప్రియమైనవారికి వాలెంటైన్ డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. ఈ ఫోన్ల మీద ఓ లుక్కేయండి.
పోకో ఎం6 ప్లస్ 5జీ
పోకో ఎం6లో 6.79 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ హెచ్‌డీప్లస్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌ను అందించారు. కెమెరా సెటప్‌లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 5,030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ సేల్ లో చౌకైన ఆప్షన్. ఈ సేల్లో బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ.10,249కే విక్రయిస్తున్నారు.
పోకో ఎం7 ప్రో 5జీ
పోకో ఎం7 ప్రో 5జీ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్. ఇందులో డాల్బీ అట్మాస్ స్పీకర్లు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ-1.5 కెమెరా, ఓఐఎస్, ఎఫ్/600 ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్, 5,110వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 45 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. పోకో ఎం7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్/డెబిట్ కార్డులతో రూ.13,499కే కొనుగోలు చేయవచ్చు.
పోకో ఎక్స్7 5జీ
పోకో ఎక్స్7 5జీ బడ్జెట్ ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో 6.67 అంగుళాల క్రిస్టల్రెస్ 1.5కే అమోఎల్ఈడీ డిస్ ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఓఐఎస్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. 5,110 వాట్ టర్బో ఛార్జింగ్‌తో 45 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వాలెంటైన్స్ డే సేల్లో బ్యాంక్ ఆఫర్లతో రూ.18,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
పోకో ఎక్స్ 7 ప్రో 5జీ
పోకో ఎక్స్ 7 ప్రో 5జీలో 6.87 అంగుళాల క్రిస్టల్స్ 120కే అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఇందులో 50 మెగాపిక్సెల్ ఓఐఎస్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. 90వాట్ హైపర్ చార్జ్ సపోర్ట్ చేసే 6,550 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. పోకో ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.24,999కే విక్రయిస్తున్నారు.