Poco M7 Pro Discount : తక్కువ ధరలో మంచి ఫోన్ కొనాలనుకునేవారికి సూపర్ ఛాన్స్.. పోకో ఫోన్‌పై డిస్కౌంట్
Poco M7 Pro Discount : పోకో ఎం7 ప్రో 5జీ ఫోన్ మీద మంచి డిస్కౌంట్ నడుస్తోంది. తక్కువ ధరలో ఫోన్ కొనాలనుకునేవారికి ఈ ఆఫర్ బెస్ట్ ఛాయిస్.

పోకో బడ్జెట్ ధర ఫోన్‌లతో సంచలనం సృష్టిస్తోంది. ఫోన్లపై డిస్కౌంట్లను అందించడం ద్వారా కస్టమర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తోంది. దీని ప్రకారం పోకో ఎం7 ప్రో 5జీ ఫోన్‌పై ఆఫర్ నడుస్తోంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 21 శాతం తగ్గింపుతో లభిస్తుంది. మీరు బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే ఇది బెటర్ ఆప్షన్. ఈ ఫోన్ కొత్త ధర, స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం.
పోకో ఎం7 ప్రో 5జీ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అమ్మకానికి ఉంటుంది. ఇందులో అనేక ఏఐ ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంది. దీనికి 6.67-అంగుళాల డిస్‌ప్లే వస్తుంది. ఈ ఫోన్ ఆఫర్ గురించి చూద్దాం..
పోకో ఎం7 ప్రో 5జీ ఆఫర్
పోకో ఎం7 ప్రో 5జీ 6జీబీ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.14,999కి ఉంది. ఈ ఫోన్ అసలు 18,999. అంటే 21 శాతం డిస్కౌంట్ అందిస్తుంది.
8జీబీ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా నడుస్తుంది. ఈ ఫోన్ మీద 19 శాతం డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ.20,999.
ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీరు రూ. 750 తగ్గింపు పొందుతారు. ఈ మొబైల్ లావెండర్ ఫ్రాస్ట్ రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఈ ఆఫర్‌లన్నింటినీ సద్వినియోగం చేసుకోవచ్చు.
పోకో ఎం7 ప్రో 5జీ ఫీచర్లు
పోకో ఎం7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1080 × 2400 పిక్సెల్ రిజల్యూషన్, 2100 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సేఫ్టీని కలిగి ఉంది.
పోకో ఎం7 ప్రో ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంది. అదేవిధంగా ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 20-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5110mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఛార్జ్ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం అందించారు.
పోకో ఎం7 ప్రో 5జీ మొబైల్ స్ప్లాష్‌లు, దుమ్ము నుండి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్‌ను కలిగి ఉంది. దీనికి ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.