అదిరిపోయే బ్యాటరీ, కెమెరా ఫీచర్స్​- ఈ రెండు మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?-poco f7 to compete with iqoo neo 10 in mid range segment know how they differ ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  అదిరిపోయే బ్యాటరీ, కెమెరా ఫీచర్స్​- ఈ రెండు మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

అదిరిపోయే బ్యాటరీ, కెమెరా ఫీచర్స్​- ఈ రెండు మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

పోకో ఎఫ్​7 వర్సెస్ ఐక్యూ నియో 10.. రూ. 35,000 లోపు ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్​ మనీ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

పోకో ఎఫ్​7 వర్సెస్ ఐక్యూ నియో 10 (Poco)

పోకో ఎఫ్​7 స్మార్ట్‌ఫోన్ జూన్ 24న భారతదేశంలో రూ. 35,000 లోపు ధరతో విడుదల కానుంది. ఈ ప్రైజ్​ సెగ్మెంట్​లో ఇది వివో టీ4, ఐక్యూ నియో 10 వంటి అనేక ఇతర మిడ్-రేంజ్ ఫోన్‌లతో పోటీపడుతుంది. అయితే, ఐక్యూ నియో 10, పోకో ఎఫ్​7 రెండూ స్నాప్‌డ్రాగన్ 8ఎస్​ జెన్ 4 ప్రాసెసర్‌ని కలిగి ఉన్నాయి. దీంతో ఏ మోడల్ ఎక్కువ విలువను అందిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి, స్పష్టమైన అవగాహన కోసం, పోకో ఎఫ్​7, ఐక్యూ నియో 10 ఫీచర్స్​ వంటి వాటిని పోల్చి చూద్దాము..

పోకో ఎఫ్​7 వర్సెస్ ఐక్యూ నియో 10: డిజైన్- డిస్‌ప్లే..

పోకో ఎఫ్​7 స్మార్ట్​ఫోన్​ డ్యూయల్-టోన్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనిలో పిల్-షేప్​ కెమెరా మాడ్యూల్ చుట్టూ ఆర్జీబీ లైటింగ్ ఉంది. ఇది దాని పనితీరు, గేమింగ్ సామర్థ్యాలను సూచిస్తుంది. స్మార్ట్‌ఫోన్ పైభాగం ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఇన్ఫినిక్స్ జీటీ సిరీస్, నథింగ్ మోడల్‌లు అందించే విధంగా ఉంటుంది. ఈ స్మార్ట్​ఫోన్​ డస్ట్​ అండ్​ వాటర్​ రెసిస్టెన్స్​ కోసం IP68 రేటింగ్‌తో వస్తుందని అంచనాలు ఉన్నాయి.

మరోవైపు, ఐక్యూ నియో 10 స్క్వైరికల్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇది రేస్ ట్రాక్-ప్రేరిత రేర్​ ప్యానెల్‌తో ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది. అయితే, ఇది వాటర్​ ప్రొటెక్షన్​ కోసం IP65 రేటింగ్‌తో వస్తుంది. ఈ గ్యాడ్జెట్​.. పోకో F7తో పోల్చితే అంత మన్నికైనది కాదు!

పోకో ఎఫ్​7 6.83-ఇంచ్​ ఓఎల్​ఈడీ డిస్‌ప్లేతో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వరకు వస్తుందని అంచనా. అయితే, ఐక్యూ నియో స్మార్ట్​ఫోన్​ 10 6.78-ఇంచ్​ ఓఎల్​ఈడీ డిస్‌ప్లేతో 144హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వరకు వస్తుంది. కాబట్టి, స్పెసిఫికేషన్ల పరంగా, ఐక్యూ నియో 10 మరింత ప్రకాశవంతంగా ఉందని చెప్పవచ్చు.

పోకో ఎఫ్​7 వర్సెస్ ఐక్యూ నియో 10: పనితీరు- బ్యాటరీ..

రెండు పరికరాలు స్నాప్‌డ్రాగన్ 8ఎస్​ జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. పోకో ఎఫ్​7 12జీబీ ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​, 24GB వరకు టర్బో ర్యామ్​, యూఎఫ్​ఎస్​ 4.1 స్టోరేజ్‌ను అందిస్తుందని అంచనా. అయితే, ఐక్యూ నియో 10 16జీబీ ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్​, 512జీబీ వరకు అందిస్తుంది. అందువల్ల, రెండు స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన పనితీరును అందించవచ్చు. అయితే, పోకో F7 మరింత పర్ఫార్మెన్స్​ ఓరియెంటెడ్​ పరికరం అని గమనించాలి.

దీర్ఘకాలిక పనితీరు కోసం, పోకో ఎఫ్​7 7550ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తుందని సంస్థ వెల్లడించింది. ఇది 90వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వగలదు. అయితే, ఐక్యూ నియో 10 7,000ఎంఏహెచ్​ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 120వాట్​ ఫాస్ట్ ఛార్జర్‌కు మద్దతు ఇస్తుంది.

పోకో ఎఫ్​7 వర్సెస్ ఐక్యూ నియో 10: కెమెరా..

పోకో ఎఫ్​7 స్మార్ట్​ఫోన్​ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో సోనీ ఎల్​వైడీ-600 సెన్సర్‌తో 50ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉండవచ్చు. స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో 50ఎంపీ ప్రస్తావన కూడా కనిపిస్తుందని తెలుస్తోంది. మరోవైపు, ఐక్యూ నియో 10 కూడా డ్యూయెల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్​882 మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు కోసం, పోకో ఎఫ్​7 20ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉండవచ్చు. అయితే నియో 10 32ఎంపీ సెల్ఫీ కెమెరాకు మద్దతు ఇస్తుంది.

రెండు స్మార్ట్‌ఫోన్‌లు సారూప్య పనితీరును అందించగలిగినప్పటికీ, ఐక్యూ నియో 10 మెరుగైన డిస్‌ప్లే- స్టోరేజ్‌ను కలిగి ఉంది. అయితే, పోకో ఎఫ్​7 స్మార్ట్​ఫోన్​ మెరుగైన మన్నికను, ఎక్స్​టెండెడ్​ బ్యాటరీ లైఫ్​ని అందించగలదు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం