పోకో తన ఎఫ్7 సిరీస్ అధికారిక లాంచ్ తేదీని ధృవీకరించింది. పోకో ఎఫ్7 ప్రో, పోకో ఎఫ్7 అల్ట్రా స్మార్ట్‌ఫోన్స్ మార్చ్ 27న సింగపూర్‌లో జరిగే ఒక కార్యక్రమంలో లాంచ్ అవుతాయి. పోకో గ్లోబల్ సోషల్ మీడియా ఛానెళ్ల ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ స్మార్ట్ఫోన్లకు సంబంధించిన వివిధ వివరాలు ఇప్పటికే లీకుల ద్వారా బయటకు వచ్చినప్పటికీ, ఈ డివైజ్లలో ఏమి ఉండబోతుందో ఈ ఈవెంట్ పూర్తి లుక్‌ని అందిస్తుంది. కంపెనీ షేర్ చేసిన తాజా ఫోటోలో ఎఫ్7 అల్ట్రా యెల్లో, బ్లాక్ కలర్ వేరియంట్లలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్స్‌కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
నివేదికల ప్రకారం.. పోకో ఎఫ్7 ప్రో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో నడిచే రెడ్మీ కే80 మాడిఫైడ్ వెర్షన్! మరోవైపు, పోకో ఎఫ్7 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ని కలిగి ఉన్న రెడ్మీ కే80 ప్రో వెర్షన్ కావచ్చు. ఈ రెండు మోడళ్లలో 6.67 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 2కే రిజల్యూషన్ (3200×1440 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది.
రెండు డివైజ్‌ల బ్యాటరీ సామర్థ్యాలు వాటి రెడ్మీ ప్రత్యర్థుల కంటే కొద్దిగా భిన్నంగా ఉంటాయని అంచనా. ఎఫ్7 ప్రోలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎఫ్7 అల్ట్రాలో 5300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్స్ ఆకట్టుకునే స్పీడ్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేయనున్నాయి. ఎఫ్7 ప్రో 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ఎఫ్7 అల్ట్రా 120 వాట్ వైర్డ్ ఛార్జింగ్- 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్‌ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ ఓఎస్ 2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్లు పనిచేయనున్నాయి.
పోకో ఎఫ్7 ప్రోలో ట్రిపుల్ కెమెరా వ్యవస్థ, 50 మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ 800 మెయిన్ సెన్సార్ విత్ ఓఐఎస్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మరోవైపు ఎఫ్7 అల్ట్రాలో ఓఐఎస్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 32 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఈ రెండు మోడళ్లు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్ కలిగి ఉంటాయని భావిస్తున్నారు. బహుళ రంగుల్లో లభిస్తాయి. అధికారిక లాంచ్ ఈవెంట్లో మరిన్ని వివరాలు పంచుకోనున్నారు.
పోకో ఎఫ్7 సిరీస్‌లో పోకో ఎఫ్7 కూడా ఉంటుంది! ఇందులో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ ఎలైట్ చిప్ ఉంటుందని భావిస్తున్నారు. చైనా కోసం రాబోయే రెడ్మీ టర్బో 4 ప్రో రీబ్రాండెడ్ వెర్షన్‌గా భావిస్తున్న ఈ మోడల్ క్యూ2 లో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ పోకో కొత్త స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ధరల వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. లాంచ్ నాటికి అవి తెలిసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం